BigTV English

Hardik Pandya’s Mother :హార్దిక్ పాండ్య తల్లి గొప్ప మనసు.. 2100 కేజీల జ్యూస్ తో పాటు

Hardik Pandya’s Mother :హార్దిక్ పాండ్య తల్లి గొప్ప మనసు.. 2100 కేజీల జ్యూస్ తో పాటు

Hardik Pandya’s Mother : టీమిండియా క్రికెటర్లు హార్దిక్ పాండ్యా,  కృనాల్ పాండ్యాల తల్లి నళిని బెన్ పాండ్యా గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఆమె గొప్ప మనస్సు గురించి తెలిసిన వాహ్ వా అనాల్సిందే. ఆమె శ్రవణ్ సేవా ఫౌండేషన్ ద్వారా బరోడా  పంజ్రపోల్ లో మూగ జీవాలకు ఆహారాన్ని అందించారు. దాదాపు 700 ఆవులకు 2,100 కిలోల మామిడి పళ్ల రసం, 5వేల రోటీలను అందజేశారు.  స్వయంగా ఆమెను ఈ సేవలో పాల్గొనడం విశేషం. వారి కుటుంబ సంప్రదాయంలో భాగంగా ఈ పని చేసినట్టు నిర్వహకులు తెలిపారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో హార్దిక్ పాండ్యా తల్లి గొప్ప మనస్సుకు సంబంధించిన వార్త తెగ వైరల్ అవుతోంది.


Also Read :  Rp Singh: వాడికి 23 కోట్ల దండగ.. వెంకటేష్ అయ్యర్ పరువు తీసిన టీమిండియా మాజీ బౌలర్

ఇక నెటిజన్లు మాత్రం ఆవుల ఆకలి తీర్చిన పాండ్యా తల్లి నళినీ గొప్ప మనస్సు చాటుకున్నారంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు. ప్రస్తుతం పాండ్యా బ్రదర్స్ ఐపీఎల్ లో బీజీగా ఉన్నారు. హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ కి కెప్టెన్ గా కొనసాగితే.. కృనాల్ పాండ్యా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మొన్న రాజస్థాన్ రాయల్స్ పై బెంగళూరు విజయం సాధించిన సమయంలో పాండ్యా తన స్పిన్ తో అద్భుతమైన బౌలింగ్ వేశాడు. ఈ సీజన్ లో హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా వ్యవహరిస్తున్న ముంబై జట్టు ప్రస్తుతం నాలుగో స్థానంలో కొనసాగుతోంది. కృనాల్ పాండ్యా ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్సీబీ జట్టు మాత్రం మూడో స్థానంలో కొనసాగడం విశేషం. 


ముంబై ఇండియన్స్ జట్టు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో తొలుత అంతగా పుంజుకోలేదు. ఆ తరువాత మళ్లీ హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ జట్టు ఈ సీజన్ లో 9 మ్యాచ్ లు ఆడి 5 విజయాలు నమోదు చేసుకుంది. నాలుగు మ్యాచ్ ల్లో ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఒకవేళ ఇవాళ పంజాబ్ కింగ్స్ జట్టు విజయం సాధిస్తే.. ముంబై జట్టు ఐదో స్థానంలోకి వెళ్లే అవకాశం ఉంది. కోల్ కతా విజయం సాధిస్తే మాత్రం అలాగే ఉండనుంది. ముంబై జట్టులో బౌలర్లు బౌల్ట్, బుమ్రా, హార్దిక్ పాండ్యా వికెట్లు తీయడం.. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ లు అద్భుతమైన బ్యాటింగ్ చేయడంతో ఏ టీమ్ అయినా సులభంగా ఓడిస్తోంది ముంబయి.

ఇలాగే విజయాల పరంపర కొనసాగితే ముంబై జట్టు కప్ కొట్టే ఛాన్స్ ఎక్కువగానే ఉంది. ముంబై కంటే ముందుగా గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ముందంజలో ఉన్నాయి. ముందు ముందు ముంబయి ప్రతీ మ్యాచ్ లో విజయం సాధిస్తే.. టాప్  2 స్థానం కైవసం చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఈ సీజన్ లో ముంబయి లేదా బెంగళూరు జట్లు మాత్రమే టైటిల్ సాధిస్తాయని వారి అభిమానులు పేర్కొంటున్నారు. మరోవైపు ఢిల్లీ కూడా ఈసారి మంచి ఫామ్ లో కనిపిస్తోంది. ఈ సీజన్ లో ఏ జట్టు టైటిల్ సాధిస్తుందో చూడాలి.

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by Ahmedabad Mirror (@ahmedabadmirrorofficial)

Related News

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

Big Stories

×