BigTV English

Harsh Goenka: టెస్టుల్లో పులి… ఐపీఎల్ లో కుక్క లాంటోడు.. గొయెంకా వివాదాస్పద పోస్ట్

Harsh Goenka: టెస్టుల్లో పులి… ఐపీఎల్ లో కుక్క లాంటోడు.. గొయెంకా వివాదాస్పద పోస్ట్

Harsh Goenka: లీడ్స్ వేదికగా భారత్ – ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ లో టీమిండియా వికెట్ కీపర్, డాషింగ్ బ్యాటర్ రిషబ్ పంత్ అరుదైన ఘనత అందుకున్నాడు. ఐదవ స్థానంలో బ్యాటింగ్ కి దిగిన పంత్.. వన్డే తరహాలో తన ఇన్నింగ్స్ ని కొనసాగించాడు. బౌండరీలు, సిక్సులతో రెచ్చిపోయాడు. ఈ క్రమంలో ఓ క్రేజీ రికార్డ్ సృష్టించాడు పంత్. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలో అత్యధిక సిక్స్ లు బాదిన భారత బ్యాటర్ గా నిలిచాడు.


Also Read: Watch Video: బుర్కా లేడి భయంకర బ్యాటింగ్.. సర్పంచ్ సాబ్ కంటే దారుణంగా ఆడుతుందిగా

ఈ క్రమంలో డబ్ల్యూటీసి హిస్టరీలో అత్యధిక సిక్సులు బాదిన రోహిత్ శర్మ {56} ను పంత్ {58} దాటేశాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 359 పరుగులు చేసింది. భారత్ తరపున మొదటి రోజు కె.ఎల్ రాహుల్ {42}, సాయి సుదర్శన్ {0}, యశస్వి జైశ్వాల్ {101} పరుగులకు పెవిలియన్ చేరారు. ఇక కెప్టెన్ గిల్ {127*}, పంత్ {65*} పరుగులతో నాటౌట్ గా నిలిచారు.


రెండవ రోజు పంత్ అదే జోరును కొనసాగించి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో 146 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్ ల సాయంతో తన సెంచరీని పూర్తి చేశాడు. రిషబ్ పంత్ పంత్ కి ఇది 7వ టెస్ట్ సెంచరీ కావడం విశేషం. ఇక సెంచరీ సాధించగానే సంతోషంతో మరోసారి పంత్ ఫ్లిప్ జంప్ చేశాడు. ఈ ఇన్నింగ్స్ తో పంత్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్.. పంత్ పై ప్రశంసలు కురిపించాడు.

అతడు కిందికి పడుతూ ఆడే ప్యాడిల్ స్వీప్ చాలా తెలివైన షాట్ అని కొనియాడాడు. ఆ షాట్ ని పంత్ అనుకోకుండా ఆడింది కాదని.. పక్కా ప్రణాళికతో తెలివిగా దాన్ని ఆడతాడని చెప్పుకొచ్చాడు. ” కిందికి పడే క్రమంలో పంత్ బంతి కిందికి వెళ్లి స్కూప్ చేయడానికి అవకాశం లభిస్తుంది. స్పిన్నర్ షోయబ్ బషీర్ బౌలింగ్ చేస్తున్న సమయంలో పంత్, గిల్ గట్టిగా హిందీలో మాట్లాడుకోవడంలోనూ వ్యూహం ఉంది. అది మామూలుగా జరిగింది కాదు. బౌలర్ తో వాళ్లు ఒక ఆట ఆడారు. బౌలర్ లయను దెబ్బతీయడానికే అలా చేశారు.

ఈ విషయాలు స్కోర్ బోర్డ్ పై కనిపించవు. కానీ మ్యాచ్ పై చాలా ప్రభావాన్ని చూపిస్తాయి.” అన్నాడు సచిన్ టెండూల్కర్. అయితే ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గొయెంకా మాత్రం రిషబ్ పంత్ పై ఓ వివాదాస్పద పోస్ట్ చేశాడు. ఐపీఎల్ 2025 లో రిషబ్ పంత్ తీవ్రంగా నిరాశపరిచిన విషయం తెలిసిందే. ఈ సీజన్ లో పూర్తిగా విఫలమైన పంత్ ని ఉద్దేశిస్తూ ఈ ట్వీట్ చేశాడు గొయెంకా. పంత్ టెస్టుల్లో పులి అని.. ఐపీఎల్ లో మాత్రం పులి చారలు కలిగిన కుక్కలాంటివాడు అని అర్థం వచ్చే విధంగా వివాదాస్పద పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ చూసిన పంత్ అభిమానులు తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Shahid Afridi: క్రికెట్ వ‌దిలేసి, కిచెన్ లో వంట‌లు చేసుకోండి..మ‌హిళ‌ల జ‌ట్టును అవ‌మానించిన‌ అఫ్రిది

Pakistan Players: రిజ్వాన్ ఇంట పెళ్లి సందడి.. త‌మ‌న్నా పాట‌ల‌కు స్టెప్పులేసిన‌ పాక్ ప్లేయ‌ర్లు

India Schedule: 2026 వ‌ర‌కు వ‌రుస‌గా మ్యాచ్ లే…ప్లేయ‌ర్ల‌కు రెస్ట్ కూడా లేదు..టీమిండియా కొత్త షెడ్యూల్ ఇదే

Kranti Goud: మ‌గాడిలా ఉందంటూ ట్రోలింగ్‌..కానీ పాకిస్థాన్ పై బుమ్రాలా రెచ్చిపోయింది

Harmanpreet Kaur: దొంగ చూపుల‌తో బెదిరింపులు..బండ బూతులు తిట్టిన‌ హ‌ర్మ‌న్ ప్రీత్‌

Muneeba Run-Out: మునీబా రనౌట్ పై వివాదం..అంపైర్ తో పాక్ కెప్టెన్‌ గొడ‌వ‌, అస‌లు రూల్స్ ఏం చెబుతున్నాయి

Shoaib Akhtar: మా పురుషుల జ‌ట్టును పాకిస్థాన్ మ‌హిళలే చిత్తుగా ఓడిస్తారు..అంత ద‌రిద్రంలో ఉన్నాం

IND VS PAK Women: వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాక్ మ‌రో ఘోర ఓట‌మి.. టీమిండియా గ్రాండ్ విక్ట‌రీ

Big Stories

×