BigTV English

WI VS AUS : స్పెట్స్ పెట్టుకొని ఆడటం ఏంట్రా… విండీస్ ప్లేయర్ విధ్వంసం

WI VS AUS : స్పెట్స్ పెట్టుకొని ఆడటం ఏంట్రా… విండీస్ ప్లేయర్ విధ్వంసం

WI VS AUS : ప్రస్తుతం వెస్టిండీస్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు టెస్ట్ మ్యాచ్ ల్లో కూడా వెస్టిండీస్ జట్టు ఓటమి పాలైంది. ఆస్ట్రేలియా జట్టు వెస్టిండీస్ పై రెండింటిలో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. వెస్టిండీస్ జట్టు రెండో మ్యాచ్ ల్లో ఓటమి పాలై.. 6వ స్థానంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే వెస్టిండీస్ క్రికెటర్ బ్రాత్ వైట్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్పెట్స్ పెట్టుకొని ఆడటం ఏంట్రా..? అని కామెంట్స్ చేస్తున్నారు. టెస్ట్ క్రికెట్ కి రోజు రోజుకు క్రేజ్ తగ్గిపోతుంది. టెస్టు క్రికెట్ ని 5 రోజుల నుంచి 4 రోజుల వరకు తగ్గించాలని భావిస్తున్నారు. ముఖ్యంగా టీ-20 లీగ్ ల కారణంగా టెస్ట్ మ్యాచ్ లను వీక్షించేందుకు కూడా జనాలు ఇబ్బంది పడుతున్నారు.


Also Read :  Aamir Khan : గుత్తా జ్వాల కుమార్తెకు పేరు పెట్టిన అమీర్ ఖాన్\

100 టెస్టులు ఆడిన విండీస్ ప్లేయర్.. 


ఇక ప్రస్తుతం క్రికెట్ లో టీ-20ల హవా కొనసాగుతోంది. ప్రతీ దేశం ఒక్కో లీగ్స్ నిర్వహిస్తుంటాయి. ఇలా ప్రపంచ వ్యాప్తంగా సుమారు 25 లీగ్స్ నడుస్తున్నాయి. అయితే ఇపపుడు ఉన్న క్రికెటర్లు  కేవలం టీ-20 లకోసం కూడా రిటైర్మెంట్ అవుతున్నారు. కానీ ఒక ప్లేయర్ వీటన్నింటికీ భిన్నం అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికీ ఒక్క టీ-20 మ్యాచ్ ఆడలేదు. ఈ ఇంటర్నేషనల్ ప్లేయర్.. కానీ 100 టెస్టులు ఆడేశాడు. అవును.. ఇది వాస్తవం. విండీస్ ప్లేయర్ క్రైగ్ బ్రాత్ వైట్ ఏకంగా 100 టెస్టు మ్యాచ్ లు ఆడాడు. కానీ ఒక్క టీ-20 మ్యాచ్ కూడా ఇప్పటికీ ఆడలేదు. అంతేకాదు.. వన్డే మ్యాచ్ లు కూడా కేవలం 10 మాత్రమే ఆడాడు. అది కూడా ఎనిమిదేళ్ల క్రితం చివరి వన్డే ఆడాడు. ఇక టెస్టుల విషయానికి వస్తే.. 2011లో పాకిస్తాన్ మీద తన మొదటి మ్యాచ్ ఆడాడు. ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరుగుతున్న 2వ టెస్టులో ఒక మైలురాయిని అందుకున్నాడు.

Also Read :  CM Revanth : రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో క‌పిల్ దేవ్ భారీ డీల్ !

అందులో కనిపించకపోవడం వింతే.. 

ఇక అదే వెస్టిండీస్ తరపున 100 టెస్టులు ఆడటం.. ఇలా 14 ఏళ్లుగా టెస్టు క్రికెట్ ఆడుతున్నా.. వన్డే, టీ 20 ల్లో కనిపించకపోవడం కాస్త వింత అనే చెప్పవచ్చు. వాస్తవానికి అసలే కరేబియన్ ప్లేయర్లు అంటే.. టీ-20 లే గుర్తుకు వస్తాయి. మరీ అలాంటి సమయంలో టెస్టు క్రికెట్ పై ఇంత మక్కువ ఉండటం నిజంగా గ్రేట్ అని ఒప్పుకొవాలి. ఇక క్రైగ్ బ్రాత్ వైట్ 100 టెస్టుల్లో 5943 పరుగులు చేశాడు. దీంట్లో 12 సెంచరీలు ఉండటం విశేషం. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో కూడా బ్రాత్ వైట్ క్రికెట్ ఆడుతున్నాడు. అయితే ఇతను స్పెట్స్ పెట్టుకొని బ్యాటింగ్ చేయడంతో అందరూ వింతగా చూడటం విశేషం.

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×