Kohli Warns Gill: టీమిండియా వర్సెస్ విండీస్ మధ్య రేపటి నుంచే వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఇలాంటి తరుణంలో టీమిండియా జట్టులో చీలిక వచ్చినట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. తిరువనంతపురంలో టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తుండగా, విరాట్ కోహ్లీ కోపం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. టీమిండియా కెప్టెన్ శుభమాన్ గిల్ పై కోహ్లీ సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ప్రాక్టీస్ చేస్తున్న విరాట్ కోహ్లీ… ఏమైందో తెలీదు కానీ, వేలు చూపెడుతూ వార్నింగ్ ఇచ్చాడు. మీద మీదకు వచ్చాడు. దీంతో ప్లేయర్లు అందరూ గందరగోళానికి గురైయ్యారు. అసలు కోహ్లీకి ఏమైంది ? గిల్ పై ఎందుకంతా ఆగ్రహానికి లోనైయ్యాడు ? అంటూ మిగతా ప్లేయర్లు తలలు పట్టుకున్నారు. కోహ్లీ ఆగ్రహాన్ని కూల్ చేసే ప్రయత్నం చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కూడా సీరియస్ అవుతున్నారు.
టీమిండియా వర్సెస్ విండీస్ మధ్య రేపటి నుంచే వన్డే సిరీస్ ప్రారంభం కానున్న తరుణంలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఆర్డర్ మార్చేందుకు గంభీర్, గిల్ ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం నిన్నటి నుంచి సాగుతోంది. రోహిత్ శర్మ, యశస్వీ జైశ్వాల్ ఇద్దరినీ ఓపెనర్లుగా పంపాలనే ప్లాన్ చేస్తున్నారట. అంతేకాకుండా విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఆర్డర్ డిస్టర్బ్ చేసేందుకు కుట్రలు చేస్తున్నట్టు కూడా జోరుగా ప్రచారం సాగుతోంది.
కోహ్లీని మూడో స్థానంలో కాకుండా, నాలుగో స్థానంలో దింపేందుకు రంగం సిద్ధం చేశారని గంభీర్, గిల్ పై రకరకాల వార్తలు బయట వస్తున్నాయి. అయితే, దీనిపై విరాట్ కోహ్లీ నిన్నటి నుంచి గుర్రుగానే ఉన్నారనే ప్రచారం సాగుతోంది. నిన్న గంభీర్, గిల్ లకు వార్నింగ్ కూడా ఇచ్చి, ప్రాక్టీస్ మధ్యలోనే వెళ్లిపోయాడట కోహ్లీ. ఇక ఇవాళ కూడా గిల్ ను వేలు చూపెడుతూ వార్నింగ్ ఇచ్చిన వీడియో కూడా బయటకు వచ్చింది. ఈ క్రమంలో టీమిండియాలో చీలిక వచ్చినట్టు ప్రచారం సాగుతోంది.
రేపటి నుంచే టీమిండియా వర్సెస్ విండీస్ సిరీస్ ప్రారంభం కానుంది. రేపు తిర్వనంతపురం వేదికగా తొలి వన్డే మధ్యాహ్నం 2 గంటలకు షురూ కానుంది. వన్డే మ్యాచ్ అయిన తరుణంలో రాత్రి వరకు కొనసాగతుంది. టీమిండియా వర్సెస్ విండీస్ సిరీస్ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. అటు స్టార్ స్పోర్ట్స్ లో కూడా తిలకించవచ్చు. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మరి టీమిండియా ప్లేయర్లు ఎలా రాణిస్తారో చూడాలి. అటు విండీస్ ఫుల్ జోష్ లో కనిపిస్తోంది.
?utm_source=ig_web_button_share_sheet