E-Paper
Advertisement

కూరగాయలు ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలా? టాప్-5 డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్లు ఇవే!

కూరగాయలు ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలా? టాప్-5 డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్లు ఇవే!
Advertisement

Double Door Refrigerator: ప్రస్తుత కాలంలో ప్రతి ఇంట్లోనూ ఫ్రిజ్ అనేది అత్యవసర వస్తువుగా మారిపోయింది. ముఖ్యంగా తాజా కూరగాయలను ఎక్కువ రోజులు నిల్వ చేయడం.. చాలా మందికి ఒక పెద్ద సవాలుగా ఉంటుంది. దీని కోసమే మార్కెట్లోకి నెక్స్ట్-జెన్ టెక్నాలజీతో డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్లు వచ్చాయి. వీటిలో ప్రత్యేకంగా ఉండే అడ్జస్టబుల్ షెల్ఫ్స్ సహాయంతో పెద్ద సైజు గిన్నెలు లేదారక రకాల కూరగాయలను మనకు నచ్చినట్లుగా సర్దుకోవచ్చు. కూరగాయల ఈజీ స్టోరేజ్ కోసం పర్ఫెక్ట్ అయిన టాప్-5 డబుల్ డోర్ ఫ్రిడ్జ్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1.Samsung 236 L 3 Double Door Refrigerator:

Advertisement

సామ్‌సంగ్ బ్రాండ్ నుంచి వస్తున్న ఈ మోడల్ మిడిల్ క్లాస్ కుటుంబాలకు ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. ఇది డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీతో వస్తుంది. అందుకే దీనివల్ల కరెంట్ బిల్లు చాలా తక్కువగా వస్తుంది.ఇందులో ఉన్న అడ్జస్టబుల్ టఫెండెడ్ గ్లాస్ షెల్ఫ్స్ చాలా బలంగా ఉంటాయి. కూరగాయల కోసం ప్రత్యేకంగా పెద్ద వెజిటేబుల్ స్పేస్ ఉంటుంది. దీనివల్ల ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంటాయి. ఈ ఫ్రిడ్జ్ ధర మార్కెట్లో సుమారు రూ.27,000 నుంచి రూ.30,000 మధ్యలో అందుబాటులో ఉంది.

2. LG 260 L 3 Double Door Refrigerator:

ఎల్‌జీ కంపెనీ నమ్మకానికి మారుపేరుగా ఉంటాయి. ఈ 260 లీటర్ల డబుల్ డోర్ ఫ్రిడ్జ్ మధ్యస్థ కుటుంబాలకు సరిగ్గా సరిపోతుంది. ఇందులో ఉన్న కన్వర్టిబుల్, స్మార్ట్ ఇన్వర్టర్ ఫీచర్లు దీనిని మరింత ప్రత్యేకంగా మారుస్తాయి. దీనిలోని అడ్జస్టబుల్ షెల్ఫ్స్‌ను మనకు కావలసిన విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫలితంగా పెద్ద సైజు గిన్నెలు లేదా బకెట్లలో ఉన్న కూరగాయలను కూడా ఈజీగా సర్దుకోవచ్చు. దీని ధర సుమారు రూ.30,000 నుంచి రూ.33,000 వరకు ఉంటుంది.

3. Whirlpool 245 L Double Door Refrigerator:

Advertisement

ఎక్కువ స్టోరేజ్ ,ఫాస్ట్ కూలింగ్ కోరుకునే.. వారికి వర్‌పూల్ బెస్ట్ ఆప్షన్. ఇది సెన్స్ టెక్నాలజీతో వస్తుంది. కాబట్టి ఫ్రిడ్జ్ లోపలి ఉష్ణోగ్రతను ఎప్పటికప్పుడు ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేస్తుంది. ఇందులో.. ఉన్న హనీకాంబ్ వెజిటేబుల్ క్రిస్పర్ తేమను కాపాడుతూ కూరగాయలు వాడిపోకుండా చూస్తుంది. దీనిలోని సర్దుబాటు చేయడానికి వీలుగా ఉన్న షెల్ఫ్స్ వల్ల స్థలం కూడా వృధా కాదు. ఈ అద్భుతమైన ఫ్రిడ్జ్ ధర సుమారు రూ.25,000 నుంచి రూ.28,000 మధ్య లభిస్తుంది.

4.Panasonic 307 L 3 Double Door Refrigerator:

మీకు మరింత ఎక్కువ స్థలం కావాలనుకుంటే.. పనాసోనిక్ ఈ 307 లీటర్ల మోడల్ చాలా బాగుంటుంది. ఇది జంబో వెజిటేబుల్ బాస్కెట్ , ఫ్లెక్సిబుల్ షెల్ఫ్స్‌తో వస్తుంది. దీని వల్ల ఒకే సారి వారం రోజులకు సరిపడా కూరగాయలను స్టోర్ చేసుకోవచ్చు. అడ్జస్టబుల్ షెల్ఫ్స్ సాయంతో పెద్ద టమాటాల బుట్టలు లేదా పొడవాటి కీరదోసకాయలను కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సర్దొచ్చు. ఈ రిఫ్రిజిరేటర్ ధర సుమారు ర.36,000 నుంచి రూ.39,000 మధ్యలో ఉంది.

Also Read: వాక్యూమ్ క్లీనర్లపై 86% ఆఫర్..కొనడానికి ఇంతకంటే మంచి టైం ఉంటుందా?

5.Godrej 236 L 2 Double Door Fridge:

బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లు కోరుకునే వారికి గోద్రెజ్ బెస్ట్ ఛాయిస్. ఇది నానో షీల్డ్ టెక్నాలజీతో.. కూడిన యాంటీ బ్యాక్టీరియల్ గ్యాస్‌టెట్‌ను కలిగి ఉంటుంది. ఇది కూరగాయలను క్రిముల బారి నుంచి రక్షిస్తుంది. ఇందులో కూడా గట్టి టఫెండెడ్ గ్లాస్ అడ్జస్టబుల్ షెల్ఫ్స్ ఉన్నాయి. దీని ధర చాలా ఆర్థికంగా ఉంచి సుమారు రూ.23,000 నుంచి రూ.26,000లోపు లభిస్తుంది.

కూరగాయలను ఎక్కువ కాలం తాజాగా ఉంచుకోవడానికి, వంటింటి పనిని ఈజీ చేసుకోవడానికి ఈ నెక్స్ట్-జెన్ అడ్జస్టబుల్ షెల్ఫ్స్ గల డబుల్ డోర్ ఫ్రిడ్జ్‌లు ఎంతగానో సహాయ పడతాయి. మీ కుటుంబ అవసరాలు, బడ్జెట్‌కు తగిన మోడల్‌ను ఎంచుకుని మీ కిచెన్‌ను మరింత స్మార్ట్‌గా మార్చుకోండి!

Related News

రూ.3,000 బడ్జెట్‌లో వావ్ అనిపించే ANC ఇయర్‌బడ్స్.. సౌండ్ క్వాలిటీ, బ్యాటరీ నెక్ట్స్ లెవెల్!

అబ్బో ఇవేం ఆఫర్లు బాబోయ్.. సేల్ కంటే ముందే 6 స్మార్ట్‌ఫోన్ల ధరలు భారీగా డౌన్!

జియో బంపర్ ఆఫర్.. ఈ ఒక్క రీఛార్జ్‌తో 200 రోజులు టెన్షన్ ఫ్రీ.. రూ.35,000 విలువైన ఏఐ టూల్స్ ఫ్రీ!

మీ ఫోన్ కెమెరా హ్యాకర్ల కంట్రోల్లోకి వెళ్లిందా? వెంటనే ఇలా కనిపెట్టండి.. లేదంటే డేంజరే!

వాక్యూమ్ క్లీనర్లపై 86% ఆఫర్..కొనడానికి ఇంతకంటే మంచి టైం ఉంటుందా?

రూ.1,059కే టైప్-సి ఛార్జింగ్ ఫోనా? పెద్దలకు అదిరిపోయే గిఫ్ట్.. ఐటెల్ కొత్త మోడల్ వచ్చేసింది!

యూట్యూబ్‌లో షాపింగ్ హంగామా.. ఇక వీడియోలు చూస్తూనే కొనేయొచ్చు, క్రియేటర్లకు కొత్త ఆదాయ అవకాశాలు!

Big Stories

Advertisement
×