E-Paper
Advertisement

జియో బంపర్ ఆఫర్.. ఈ ఒక్క రీఛార్జ్‌తో 200 రోజులు టెన్షన్ ఫ్రీ.. రూ.35,000 విలువైన ఏఐ టూల్స్ ఫ్రీ!

జియో బంపర్ ఆఫర్.. ఈ ఒక్క రీఛార్జ్‌తో 200 రోజులు టెన్షన్ ఫ్రీ.. రూ.35,000 విలువైన ఏఐ టూల్స్ ఫ్రీ!
Advertisement

Jio Prepaid Plan: నెలనెలా రీఛార్జ్ చేసుకునే తలనొప్పి వద్దనుకునే జియో కస్టమర్లకు ఇది ఉపయోగకరమైన ప్లాన్. రిలయన్స్ జియో అందిస్తున్న రూ.2,025 ప్రీపెయిడ్ రీఛార్జ్‌తో ఎక్కువ కాలం సేవలను కొనసాగించడంతో పాటు డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, SMSల వంటి ప్రయోజనాలు పొందొచ్చు. అంతేకాదు.. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్, ఏఐ సేవలు, క్లౌడ్ స్టోరేజ్ వంటి అదనపు బెనిఫిట్స్ కూడా ఈ ప్లాన్‌లో ఉన్నాయి.

ఒక్కసారి రూ.2,025 చెల్లించి దీర్ఘకాలం రీఛార్జ్ టెన్షన్ లేకుండా ఉండాలనుకునే వారికి ఈ ప్లాన్ ఆసక్తికరంగా మారింది. మరి ఈ ప్లాన్ వ్యాలిడిటీ ఎంత? రోజుకు ఎన్ని జీబీ డేటా లభిస్తుంది? ఓటీటీ, ఏఐ, క్లౌడ్ స్టోరేజ్ ద్వారా ఎలాంటి ప్రయోజనాలు పొందొచ్చు? రూ.2,025కి జియో అందిస్తున్న పూర్తి బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందామా..

200 రోజుల వ్యాలిడిటీ..

Advertisement

రూ.2,025 ప్లాన్‌తో ఏకంగా 200 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అంటే.. దాదాపు 7 నెలల వరకు రీఛార్జ్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. రోజుకు 2.5 జీబీ చొప్పున మొత్తం 500 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. రోజువారీ డేటా పరిమితి పూర్తయిన తర్వాత 64 కేబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ కొనసాగుతుంది.

Also Read: రూ.1,059కే టైప్-సి ఛార్జింగ్ ఫోనా? పెద్దలకు అదిరిపోయే గిఫ్ట్.. ఐటెల్ కొత్త మోడల్ వచ్చేసింది!

కాలింగ్, 5జీ బెనిఫిట్..

Advertisement

ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్‌తో పాటు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. జియో 5జీ నెట్‌వర్క్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో, అర్హతలు, జియో నిబంధనలకు అనుగుణంగా అన్‌లిమిటెడ్ 5జీ డేటా ప్రయోజనం కూడా పొందవచ్చు.

ఓటీటీతో పాటు జెమిని..

ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే వారికి జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్, హాలీవుడ్ కంటెంట్ యాక్సెస్ లభిస్తుంది. అంతేకాకుండా గూగుల్ జెమిని ప్రోను 18 నెలల పాటు ఉచితంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. దీని విలువ సుమారు రూ.35,100గా పేర్కొంటున్నారు.

భారీ క్లౌడ్ స్టోరేజ్..

ఫొటోలు, వీడియోలు, ఇతర ఫైల్స్ కోసం 50జీబీ జియోఐక్లౌడ్ స్టోరేజ్‌తో పాటు గూగుల్ ఆఫర్ ద్వారా 5టీబీ వరకు క్లౌడ్ స్టోరేజ్ ప్రయోజనం లభిస్తుంది.

క్రియేటర్లకు Canva Pro..

డిజైనింగ్, ఫొటో ఎడిటింగ్, సోషల్ మీడియా కంటెంట్ తయారు చేసే వారికి Canva Pro Light సబ్‌స్క్రిప్షన్‌ను 12 నెలల పాటు ఉచితంగా అందిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాలిడిటీతో పాటు డేటా, ఓటీటీ, ఏఐ, క్లౌడ్ స్టోరేజ్ వంటి ప్రయోజనాలు కావాలనుకునే వారికి ఈ ప్లాన్ ఉపయోగకరంగా ఉండొచ్చు.

Also Read: యూట్యూబ్‌లో షాపింగ్ హంగామా.. ఇక వీడియోలు చూస్తూనే కొనేయొచ్చు, క్రియేటర్లకు కొత్త ఆదాయ అవకాశాలు!

Tags

Related News

అబ్బో ఇవేం ఆఫర్లు బాబోయ్.. సేల్ కంటే ముందే 6 స్మార్ట్‌ఫోన్ల ధరలు భారీగా డౌన్!

కూరగాయలు ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలా? టాప్-5 డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్లు ఇవే!

మీ ఫోన్ కెమెరా హ్యాకర్ల కంట్రోల్లోకి వెళ్లిందా? వెంటనే ఇలా కనిపెట్టండి.. లేదంటే డేంజరే!

వాక్యూమ్ క్లీనర్లపై 86% ఆఫర్..కొనడానికి ఇంతకంటే మంచి టైం ఉంటుందా?

రూ.1,059కే టైప్-సి ఛార్జింగ్ ఫోనా? పెద్దలకు అదిరిపోయే గిఫ్ట్.. ఐటెల్ కొత్త మోడల్ వచ్చేసింది!

యూట్యూబ్‌లో షాపింగ్ హంగామా.. ఇక వీడియోలు చూస్తూనే కొనేయొచ్చు, క్రియేటర్లకు కొత్త ఆదాయ అవకాశాలు!

హ్యాకర్ల టార్గెట్‌గా గూగుల్ క్రోమ్ యూజర్లు? CERT-In బిగ్ వార్నింగ్.. వెంటనే ఇలా చేయండి!

Big Stories

Advertisement
×