Turkish Warship: కశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఇండియాలోని పాకిస్థాన్ పౌరులను మన దేశం నుంచి వెళ్లగొట్టడమే కాకుండా.. సింధు నదీ జలాల ఒప్పందం రద్దు, పాకిస్థాన్ దేశ విమానాలకు భారత్ గగనతలం మూసివేయడం, దిగుమతులను ఆపేయడం లాంటి కీలక నిర్ణయాలను మోదీ సర్కార్ తీసుకుంది.
అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పాకిస్థాన్ ను అన్నివైపుల నుంచి భారత్ బంధిస్తోంది. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఎలాంటి పరిణామాలను చవిచూడాల్సి వస్తుందోనని.. పాకిస్థాన్ దేశం భయాందోళనలకు గురవుతోంది. ఈ క్రమంలోనే ఇతర దేశాలతో మద్దతు కూడగట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. దాయాది దేశం పాకిస్థాన్ తన మిత్ర దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా మోదీ సర్కార్ సమాచారం అందింది. దానికి ఇప్పుడు బలం చేకూరేలా ఓ వార్త బయటకు తెలసిింది. తాజాగా టర్కీకి చెందిన టీజీసీ బుయుకడా అనే భారీ యుద్ధ నౌక పాక్ తీరానికి చేరుకుంది.
ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ త్రివిధ దళాల ఉన్నత అధికారులతో వరుస భేటీలు నిర్వహిస్తున్న క్రమంలో భారత్ ఏ క్షణమైనా ఎదురుదాడి చేసే అవకాశం ఉందని పాకిస్థాన్ భావిస్తోంది. ఈ క్రమంలో దాయాది దేశం అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. సముద్ర మార్గంలోనూ మన దేశం దాడులు చేసే అవకాశం ఉండడంతో తన మిత్రదేశం టర్కీని సంప్రదించి గస్తీ యుద్ధనౌకను తెప్పించుకున్నట్టు తెలుస్తోంది.
పాకిస్థాన్ తీరానికి చేరుకున్న టర్కీ యుద్ధ నౌక టీజీసీ బుయుకడా 2013లో జలప్రవేశం చేసింది. ముఖ్యంగా ఈ యుద్ధ నౌక ప్రత్యేకత ఏంటంటే.. జలాంతర్గాములకు వ్యతిరేకంగా పని చేస్తుంది. గస్తీ కాయడంలో ఇది పేరు గాంచింది. పలు నౌకాదళ విన్యాసాల్లో పాల్గొని గుర్తింపు కూడా తెచ్చుకుంది.
2023 ఫిబ్రవరి 6న టర్కీ, సిరియా దేశాల్లో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం ధాటికి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు ఆపరేషన్ దోస్త్ పేరుతో టర్కీ దేశానికి సాయంగా నిలిచాం. ఎన్డీఆర్ఎప్, భారత సైన్యం, వైద్య బృందాలు, మందులు, ఆసుపత్రి సామగ్రి, రెస్క్యూ డాగ్ స్క్వాడ్‌లతో కూడిన బృందాలను టర్కీ దేశానికి పంపించారు. అయితే ఇలాంటి సమయంలో టర్కీ తీసుకున్న నిర్ణయం పట్ల పలువురు తప్పుబడుతున్నారు. కానీ టర్కీ ప్రభుత్వం మాత్రం ఇంధనం నింపుకోవడానికి అటు సైడ్ వెళ్లిందని.. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఖండించింది.
Also Read: Lashkar-e-Taiba: ఉగ్రవాదులకు సాయం చేసిన వ్యక్తి.. పోలీసుల నుంచి తప్పంచుకోబోయి.. చివరకు..?