BigTV English

Rohit – Salaar: ప్రభాస్ ను ఫాలో అయిన రోహిత్.. కోపంతో వికెట్ తో తీసి !

Rohit – Salaar: ప్రభాస్ ను ఫాలో అయిన రోహిత్.. కోపంతో వికెట్ తో తీసి !

Rohit – Salaar: చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ విజేతగా టీం ఇండియా నిలవడం జరిగింది. ఆదివారం జరిగిన న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో రోహిత్ శర్మ సేన గ్రాండ్ విక్టరీ కొట్టింది. దీంతో మూడోసారి ఛాంపియన్ గా నిలిచింది టీమిండియా. నాలుగు వికెట్లతో తేడాతో న్యూజిలాండ్ జట్టును చిత్తు చిత్తు చేసింది టీమిండియా. అయితే ఫైనల్ మ్యాచ్ లో గెలిచిన టీమిండియా క్రికెటర్లు… దుబాయ్ క్రికెట్ స్టేడియంలో రచ్చ రచ్చ చేశారు. కొంత మంది క్రికెటర్లు డాన్సులు చేయడం.. మరికొంతమంది వికెట్లు తీసి… గ్రౌండ్ చుట్టూ తిరగడం జరిగింది. మరి కొంతమంది క్రికెటర్లు తమ కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేశారు.


Also Read:  Most ICC Tropies: ఐసీసీ టోర్నమెంట్లు ఎక్కువగా గెలిచింది ఎవరు.. టీమిండియాకు ఎన్ని వచ్చాయి ?

ట్రోఫీ పట్టుకొని గ్రౌండ్ మొత్తం తిరిగారు మరి కొంతమంది. అయితే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం… డిఫరెంట్ గా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. మ్యాచ్ విజయం సాధించగానే.. వికెట్లు పీకి పందిరేశాడు. విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ ఇద్దరూ దాండియా కూడా ఆడారు. అది వికెట్లతో.. దాండియా ఆడడం గమనార్హం. ఆ తర్వాత అదే వికెట్ పట్టుకొని గ్రౌండ్ బయటకు వెళ్లే ప్రయత్నం చేశాడు రోహిత్ శర్మ. దీంతో అక్కడే ఉన్న కెమెరా మ్యాన్లు ఒక్కసారి.. ఫోటో దిగండి సార్ అని పిలిచారు. దీంతో చిర్రెత్తిపోయిన రోహిత్ శర్మ… తన చేతిలో ఉన్న వికెట్ను గ్రౌండ్ కు గట్టిగా గుచ్చాడు. ఆ తర్వాత ఫోటోలకు ఫోజులిచ్చాడు. అయితే చేతిలో ఉన్న వికెట్ ను గ్రౌండ్ కు గుచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఈ వీడియోను రకరకాలుగా వాడుకుంటున్నారు కొంతమంది టాలీవుడ్ అభిమానులు.


ప్రభాస్ నటించిన సలార్ సినిమాలో కూడా… ఇలాంటి సీన్ ఉంటుందని… ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. ప్రభాస్ కూడా కత్తిని గుచ్చే సీన్ ఉంటుందని… ఆ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. సలార్ సినిమా చూసే రోహిత్ శర్మ అలా చేసి ఉంటాడని మరి కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి రోహిత్ శర్మ కారణంగా ప్రభాస్ అభిమానులు… సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా… ఈ ఐసీసీ టోర్నమెంట్ తో ఇప్పటివరకు టీమిండియా ఏడు ఐసీసీ టోర్నమెంట్లు గెలుచుకుంది. కపిల్ దేవ్ నుంచి రోహిత్ శర్మ కెప్టెన్సీ వరకు…. 7 ఐసీసీ టోర్నమెంట్లు రావడం జరిగింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆధ్వర్యంలో… రెండు టోర్నమెంట్లు వచ్చాయి. 2024 t20 వరల్డ్ కప్ తో పాటు ఛాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్… రోహిత్ శర్మ కెప్టెన్సీ లోనే టీమిండియా దక్కించుకుంది.

Also Read: Chahal-Dhana shree: ప్రియురాలితో దుబాయికి చాహల్.. ధనశ్రీ సంచలన పోస్ట్?

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by Telugu Entertainment Page (@soggade_chinni_nayana_)

Related News

IND Vs PAK : అభిషేక్ శర్మ ఫాలోయింగ్ చూడండి.. పాకిస్తాన్ లేడీ కూడా లవ్ యూ చెప్పింది!

IND Vs PAK : అంపైర్లు అమ్ముడుపోయారు.. అది నాటౌట్… షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు

IND Vs PAK : గేమ్ ఓడిపోయాం కానీ యుద్ధం గెలిచాం : రవూఫ్ భార్య

IND Vs PAK : దుబాయ్ స్టేడియంలో పాకిస్థాన్ ఫ్యాన్ పై దాడి… రంగంలోకి పోలీసులు!

Fakhar Zaman catch : టీమిండియా తొండాట‌…ఐసీసీకి పాకిస్థాన్ ఫిర్యాదు

Abhishek Sharma: అభిషేక్ శ‌ర్మకు గ్రౌండ్ లోనే ప్ర‌పోజ్‌..ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చి మ‌రీ !

IND VS PAK: మ‌రోసారి టీమిండియా వ‌ర్సెస్ పాక్ మ్యాచ్‌..చ‌చ్చిన పామును మ‌ళ్లీ చంప‌డ‌మే

AK-47 Celebration: ధోని చేస్తే క‌రెక్ట్‌.. మేం చేస్తే త‌ప్పా…!

Big Stories

×