AFG vs ENG: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( Champions Trophy 2025 Tournament ) నేపథ్యంలో ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ… ఇంగ్లాండ్ వర్సెస్ ఆఫ్గనిస్తాన్ జట్లు ( England vs Afghanistan ) తలపడబోతున్నాయి. ఈ కీలక మ్యాచ్ లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో ( Gaddafi Stadium in Lahore)… మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ కాసేపటి క్రితమే ముగిసింది. ఇందులో టాస్ నెగ్గిన..ఆఫ్గనిస్తాన్ జట్టు మొదటి బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. లాహోర్ లోని గడాఫీ స్టేడియం ఇవాళ బ్యాటింగ్ కు అనుకూలించే ఛాన్సు ఉందట. ఈ తరుణంలోనే.. ఆఫ్గనిస్తాన్ జట్టు మొదటి బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో మొదట బౌలింగ్ చేయనుంది ఇంగ్లాండ్ టీం.
Also Read: Virat Kohli Fan Base: ఇదేం క్రేజ్ రా… కోహ్లీ కోసం పాకిస్థాన్ ప్రాణాలు ఇచ్చేలా ఉందిగా !
ఇది ఇలా ఉండగా… ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టుకు సెమిస్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే నిన్న ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఆస్ట్రేలియా అలాగే దక్షిణ ఆఫ్రికా చెరో పాయింట్ పంచుకున్నాయి. దీంతో ఆ రెండు జట్ల దగ్గర చెరో మూడు పాయింట్లు ప్రస్తుతానికి ఉన్నాయి. ఇప్పుడు ఇంగ్లాండ్ వర్సెస్ ఆఫ్గనిస్తాన్ మధ్య… ఏదైనా ఒక జట్టు ఓడిపోతే ఇంటికి వెళ్తాయి. గెలిచిన జట్టు.. సెమిస్ బరిలో ఉండే ఛాన్స్ ఉంటుంది. ఉదాహరణకు ఇంగ్లాండు జట్టు.. ఇవాల్టి మ్యాచ్ లో గెలిస్తే…. దక్షిణాఫ్రికా తో మార్చి ఒకటవ తేదీన మరో మ్యాచ్ ఉంది.
అక్కడ కూడా మెరుగైన రన్ రేట్ తో మ్యాచ్ గెలిస్తే… మూడు పాయింట్లు దక్కించుకునే ఛాన్స్ ఉంది. అప్పుడు సెమీస్ ఛాన్సులు ఉంటాయి. ఇక అంతకంటే ముందు ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్ లో ఆస్ట్రేలియా గనక ఓడిపోతే… ఇంగ్లాండుకు మరింత అవకాశాలు మెరుగవుతాయి. ఇటు ఇవాళ్టి మ్యాచ్ లో ఆఫ్గనిస్తాన్ గెలిస్తే.. ఇంగ్లాండ్ ఇంటికే వెళ్లే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇవాళ జరిగే ఆఫ్గనిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ చాలా కీలకంగా మారనుంది. ఇరు జట్ల మధ్య ట్రాక్ రికార్డు చూస్తుంటే.. ఇంగ్లాండ్ కే ఎక్కువగా ఛాన్సులు ఉన్నాయి.
Also Read: Ex Pak women’s team captain: పాకిస్థాన్ కెప్టెన్ గా ధోని ఉన్నా.. మావోళ్లు ఏం పీకలేరు !
ఇరు జట్ల వివరాలు
జట్లు:
ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, బెన్ డకెట్, జామీ స్మిత్(w), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(c), లియామ్ లివింగ్‌స్టోన్, జోఫ్రా ఆర్చర్, జామీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్
ఆఫ్ఘనిస్తాన్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(w), ఇబ్రహీం జద్రాన్, సెదిఖుల్లా అటల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(c), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నైబ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఫజల్హక్ ఫర్