Litton Das – Keshav maharaj: మన దేశంలో ఎక్కువమంది హిందువులు పూజించే దేవుడు పరమశివుడు. జలంతో అభిషేకించినా.. భక్తులు కోరిన కోరికలను తీర్చే భోళా శంకరుడు. శివుడిని భక్తుల పాలిట కొంగుబంగారంగా భావిస్తారు. శివయ్యని నమ్మి కొలిచే భక్తులకు ఎటువంటి వ్యాధి, భయం, దుఃఖం, ఉండవని హిందువుల నమ్మకం. ఆ కైలాసనాధుడు ప్రసన్నుడై, భక్తులకు కోరిన వరాన్ని ఇస్తాడు. శివుడిని పూజించడం వలన దుఃఖాలు జరిగిపోయి సకల సుఖాలు కలుగుతాయి.
Also Read: Virat Kohli Fan Base: ఇదేం క్రేజ్ రా… కోహ్లీ కోసం పాకిస్థాన్ ప్రాణాలు ఇచ్చేలా ఉందిగా !
నేడు మహా శివరాత్రి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తూ.. ఆ పరమశివున్ని పూజిస్తున్నారు. కేవలం భారత దేశంలో మాత్రమే కాకుండా అనేక దేశాలలో హిందూ మతంలో ఉన్నవారు మహాశివరాత్రిని ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే ఈ మధ్యకాలంలో విదేశీయులు కూడా కొందరు హిందూ తత్వాన్ని ఇష్టపడి హిందూ సంస్కృతిని పాటిస్తున్నారు. కొన్ని దేశాలలో అయితే ఏకంగా కొందరు శాస్త్రాలు నేర్చుకొని పురోహితం కూడా చేస్తున్నారంటే నమ్మండి. ఇకపోతే అన్యమతస్తులైన కొందరు సెలబ్రిటీలు కూడా మహాశివరాత్రి వేడుకలలో పాల్గొనడం మనం చూశాం.
కాగా బంగ్లాదేశ్ క్రికెటర్ లిటెన్ దాస్ గతంలో వినాయక చవితిని అంగరంగ వైభవంగా జరుపుకున్న విషయం చాలామందికి తెలిసి ఉండవచ్చు. వినాయక చవితి సందర్భంగా లిటెన్ దాస్ తన కుటుంబ సభ్యులతో కలిసి గణపతికి పూజలు నిర్వహించాడు. ఈ పూజలకు సంబంధించిన ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ.. ” గణపతి బప్పా మోరియా” అని రాసుకొచ్చాడు. ఇప్పుడు మరోసారి మహాశివరాత్రి సందర్భంగా శివలింగాలకు జలంతో అభిషేకం చేస్తూ దర్శనం ఇచ్చాడు.
దీంతో లిటెన్ దాస్ కి చెందిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అలాగే దక్షిణాఫ్రికా స్పిన్ బౌలర్ కేశవ్ మహారాజ్ కూడా తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో ఆ మహా శివుడి ఫోటోని షేర్ చేసి.. “అందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు. హర హర మహాదేవ్” అని క్యాప్షన్ ఇచ్చాడు. ఇక లిటెన్ దాస్ కి ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో చోటు దక్కని విషయం తెలిసిందే. సందేహాస్పద బౌలింగ్ యాక్షన్ కారణంగా సస్పెన్షన్ కి గురైన అతడిని.. సెలెక్టర్లు ఈఐసిసి టోర్నీకి పరిగణించలేదు.
Also Read: Ex Pak women’s team captain: పాకిస్థాన్ కెప్టెన్ గా ధోని ఉన్నా.. మావోళ్లు ఏం పీకలేరు !
ఇక తనపై వేటు పడడానికి గల విషయంపై స్పందించిన లిటెన్ దాస్.. ” గతంలో నేను ఎన్నో గొప్ప ఇన్నింగ్స్ ఆడాను. కానీ ఇప్పుడు జీరో నుండి మళ్ళీ మొదట పెట్టాల్సి వచ్చింది. నేను ఇకపై మరింత కఠినంగా శ్రమించాలి. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. నాకు ఛాంపియన్ ట్రోఫీ జట్టులో చోటు దక్కదని ముందే తెలుసు. నేను బాగా ఆడడం లేదు కాబట్టి నన్ను టీం నుండి తప్పించారు. ఇందులో దాచాల్సింది, సిగ్గుపడాల్సింది ఏమీ లేదు” అని తెలిపాడు.
Keshav Maharaj's Instagram story for Mahashivratri. 🙏❤️ pic.twitter.com/2BD9Vb3FrB
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 26, 2025