No plastic: ఖమ్మం జిల్లాలో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆలోచిన తీరు అందరిన్నీ అబ్బురపరుస్తుంది. మామూలుగా మనం ప్లాస్టిక్ వస్తువు వాడకుండా పెళ్లి చేయడమనేది చాలా కష్టం. అలాంటిది అతను నలుగురికి ఆదర్శంగా నిలవాలనే తపన హైలెట్. మారెమ్మ తల్లి టెంపుల్ వద్ద ప్లాస్టిక్ రహిత పెళ్లి చేసుకుని సూపర్ అనిపించుకున్నాడు. పెళ్ళి స్వాగతం బోర్డు సహితం క్లాత్ పై పెయింటింగ్. పెళ్ళిలో విస్తార్ల స్థానంలో అరటి ఆకులు, మట్టి గ్లాసులు మాత్రమే యూజ్ చేశారు. పెళ్లి మండపం సైతం అరటి ఆకులు, పూలతో అలంకరించారు. పెళ్ళికి వచ్చిన అతిధులు కూర్చునేందుకు అల్యూమినియం చైర్స్ వేశారు.
ALSO READ: NHAI Recruitment: నేషనల్ హైవేస్‌లో ఉద్యోగాలకు రేపే లాస్ట్ డేట్.. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు..
తాటాకు పందిరి, మామిడాకు తోరణం, అరిటాకు భోజనం…ఇది ఒకప్పటి పెళ్లి వేడుక. ఇప్పటి పెళ్లిళ్లు మోడరన్ టచ్‌తో ఫంక్షన్‌హాల్‌లో ఏది సహజమో ఏది కృత్రిమమో తెలియకుండా అట్టహాసంగా జరుగుతున్నాయి. పెళ్లి తర్వాత ఫంక్షన్‌హాల్‌ను శుభ్రం చేసినప్పుడు చూస్తే టన్నుల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలు మనసును కలిచివేస్తాయి. డబ్బు ఉంది కదా అని విచక్షణరహితంగా సంస్కారహీనంగా వ్యవహరించామా అనే అపరాధభావం తొలిచివేస్తుంది. వేడుక అంటే ఇది కాదు, మేము చేస్తున్నాం చూడండి.. అంటూ భూమితల్లికి కష్టం కలగని విధంగా తన పెళ్లి చేసుకున్నాడో యువకుడు.
ఖమ్మం జిల్లా రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామంలో మారెమ్మ గుడి వద్ద ఈ ప్లాస్టిక్ రహిత పెళ్లి తంతు జరిగింది. ఖమ్మం నగరానికి చెందిన సంపత్ అనే యువకుడు డోర్నకల్ మండలం వెన్నారంలో పంచాయితీ కార్యదర్శిగా పని చేస్తున్నారు. గ్రామాలలో ప్లాస్టిక్ రహిత కార్యక్రమాలు చేపడుతూ పలువురికి ఆదర్శంగా అంటూ సంపత్ అవార్డులు కూడా అందుకున్నారు. ఇటీవల తన పెళ్లి నిశ్చయం కావడంతో తన పెళ్లిలో సహితం ప్లాస్టిక్ రహితంగా చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. వివాహ వేడుకను ప్లాస్టిక్ ఫ్రీగా నిర్వహించే పనిలో పడ్డారు. అరిటాకులో భోజనం వడ్డించారు. మట్టి గ్లాసుల్లో తాగునీటిన అందించారు.
పెళ్లి మండపాన్ని సహజమైన అరటి ఆకులు, పూలతో అలంకరించారు. భోజనాలు పూర్తయిన తర్వాత చెత్తను ఎక్కడ వేయాలో కూడా ముందుగానే ఆలోచించారు. పెద్ద డ్రమ్ముల్లో పావు వంతు కొబ్బరి పీచు వేసి సిద్ధంగా ఉంచారు. అరిటాకులను అందులో వేశారు. పేపర్ వేస్ట్‌ను విడిగా వేస్ట్ కలెక్షన్ సెంటర్‌కు తరలించారు. మండపాన్ని అలంకరించిన పూలతో ఫ్లెక్సీలను సహజ రంగులతో తయారు చేసి క్లాత్ పై ముద్రించారు. ఇక వివాహ వేడుకు వచ్చిన అతిథులు కూర్చునేందుకు అల్యూమినియం చైర్లు ప్రత్యేకంగా తెప్పించారు. ఇది ప్లాస్టిక్ ఫ్రీ వెడ్డింగ్ గా నిలిచింది. పలువురికి ఆదర్శంగా నిలవాలని తన తపనను స్పష్టంగా కనిపిస్తుందని పెళ్లికొచ్చిన అతిథులు తెగ ముచ్చటించుకున్నారు.
ALSO READ: Future City: జస్ట్ 40 మినిట్స్‌లో ఎయిర్‌పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి.. ఎలానో తెల్సా..?
మరో వైపు పెళ్లి కొడుకు సంపత్ మాట్లాడుతూ.. తన పెళ్లికి పూల బొకేలు, గిఫ్ట్ ర్యాపర్‌లు చుట్టిన బహుమతులు తీసుకురావద్దని తెలియజేసినట్లు వెల్లడించారు. ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్ధాలను ఈ సందర్భంగా తెలియజేశారు. తన ఈ ప్రయత్నం ద్వారా 30 వేల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను నివారించగలిగానని హర్షం వ్యక్తం చేశారు.