BigTV English

Indian Team Matches: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా మ్యాచ్ ల టైమింగ్స్, ఫ్రీగా ఎలా చూడాలి ?

Indian Team Matches:  ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా మ్యాచ్ ల టైమింగ్స్, ఫ్రీగా ఎలా చూడాలి ?

Indian Team Matches: చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ కి కౌంట్ డౌన్ షురూ అయింది. ఫిబ్రవరి 19వ తేదీ అంటే రేపటి నుంచి… చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా అయింది. ఫిబ్రవరి 19వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఛాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( Champions Trophy 2025 Tournament )… మార్చి 9వ తేదీ వరకు జరుగుతుంది. అంటే దాదాపు 20 రోజుల పాటు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంటు నిర్వహించనుంది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ( International Cricket Council ). అయితే చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంటులో భాగంగా మొదటి మ్యాచ్ లో న్యూజిలాండ్ ( New Zealand) వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఉంటుంది. ఈ మ్యాచ్ లాహోర్లోని నేషనల్ స్టేడియంలో నిర్వహించనున్నారు. ట్రై సిరీస్ లో భాగంగా ఇప్పటికే పాకిస్తాన్ lo ( Pakisthan) ఉన్న న్యూజిలాండ్.. లాహోర్ లో ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టింది.


Also Read: JP Duminy Divorce: సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ జేపీ డుమిని విడాకులు.. 13 ఏళ్ళ తర్వాత !

ఇక టీమిండియా విషయానికి వస్తే… టీమిండియా మొదటి మ్యాచ్ బంగ్లాదేశ్ తో జరగనుంది. చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో భాగంగా… టీం ఇండియా తన మొదటి మ్యాచ్ బంగ్లాదేశ్ తో దుబాయ్ వేదికగా ఆడనుంది. వాస్తవానికి ఈ టోర్నమెంట్ కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉండేది. కానీ హైబ్రిడ్ మోడల్ కు.. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో టీమిండియా ఆడే ప్రతి మ్యాచ్ దుబాయ్ లో ( Dubai) నిర్వహిస్తారు. మిగిలిన మ్యాచ్లన్నీ పాకిస్తాన్లోని లాహోర్, గడాఫీ లాంటి స్టేడియాలలో జరుగుతాయి. అయితే దుబాయ్ లో టీమిండియా మ్యాచ్ లన్ని… మన భారతదేశ కాలమానం ప్రకారం ఏ సమయానికి.. స్ట్రీమింగ్ అవుతాయని ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది.


 

నేషనల్ మీడియా కథనాల ప్రకారం… ఈ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో… దుబాయ్ వేదికగా టీమ్ ఇండియా ( Team India ) ఆడే ప్రతి మ్యాచ్… మధ్యాహ్నం ఒకటి గంటలకు ప్రారంభమవుతాయి. దాదాపు 12:30 గంటలకు… మ్యాచ్లకు సంబంధించిన టాస్ ప్రక్రియ.. కొనసాగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అంటే ఒకటి గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతే… రాత్రి పది గంటల సమయానికి.. ప్రతి మ్యాచ్ ఫినిష్ అవుతుందన్నమాట. అదే పాకిస్తాన్ లో ఇతర జట్లు ఆడే మ్యాచ్లన్నీ మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమవుతాయి. అంటే ఇండియా టైమింగ్స్ ప్రకారం దాదాపు… సరిగ్గా నే ఉన్నాయని చెప్పవచ్చు.

Also Read: Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం.. పాకిస్థాన్ సెక్యూరిటీ చూడండి ?

 

ఇది ఇలా ఉండగా… చాంపియస్ ట్రోఫీ 2025లో టీమిండియా ఆడే మ్యాచ్ లన్ని… జియో హాట్ స్టార్ లో మనం చూడవచ్చు. అలాగే స్టార్ స్పోర్ట్స్ లో కూడా మ్యాచ్లు వస్తాయి. జియో హాట్ స్టార్ లో ( Jio Hotstar ) మ్యాచ్ లు చూడాలంటే… కచ్చితంగా రీఛార్జి చేసుకోవాలని చెబుతున్నారు. రీఛార్జి చేసుకున్నవారు ఉచితంగా చూడవచ్చు. ఇటీవల జియో అలాగే హాట్ స్టార్ ఒకటైన నేపథ్యంలో… డబ్బులు కచ్చితంగా చెల్లించాల్సిందేనని.. నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×