IND VS AUS: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో ( Champions Trophy 2025 Tournament ) భాగంగా మరికాసేపట్లోనే కీలక పోరు ప్రారంభం కానుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో భాగంగా తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా ( Team India vs Australia ) జట్ల మధ్య ఫైట్ ఇవాళ జరుగనుంది. దుబాయ్ లోని అంతర్జాతీయ వేదికగా టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి సెమీస్ జరుగుతోంది. అయితే.. ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ కాసేపటి క్రితమే ముగిసింది. ఇందులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేయాలని నిర్నయం తీసుకుంది. దీంతో టీమిండియా మొదట బౌలింగ్ చేయనుంది.
Also Read: Trinamool MP – Rohit Sharma: రోహిత్ చెత్త ప్లేయర్… టీమిండియాను తొలగించాల్సిందే ?
భారత కాలమానం ప్రకారం.. టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య సెమీస్ పోరు ( Team India vs Australia Semis )… మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇవాళ్టి మ్యాచ్ కోసం కొత్త పిచ్ రెడీ చేశారని అంటున్నారు. అంటే.. ఈ కొత్త పిచ్ స్పిన్నర్లకు ప్లస్ అవుతుందని చెబుతున్నారు. టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య సెమీస్ ఫైట్ ను జియో హాట్ స్టార్ వేదికగా ఉచితంగానే చూడవచ్చును. జియో నెట్ వర్క్ ఉన్న వారి దగ్గర… జియో హాట్ స్టార్ ( Jio Hot Star )ఉచితంగానే ప్రసారం చేస్తోంది ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ మ్యాచ్ లు. అలాగే…. స్పోర్ట్స్ 18 తో పాటు… స్టార్ స్పోర్ట్స్ లో కూడా టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి సెమీస్ వీక్షించవచ్చును.
ఇక టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య పోరులో రోహిత్ శర్మ సేన విజయం సాధిస్తే… నేరు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ఫైనల్ కు దూసుకెళుతుంది. లేకపోతే… ఆసీస్ మరోసారి ఫైనల్ కు వెళుతుంది. అటు రేపు దక్షిణాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో సెమీస్ ఉంది. దక్షిణాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో సెమీస్ పాకిస్థాన్ దేశంలోని లాహోర్‌లో జరుగనుంది. టీమిండియా ఫైనల్ కు వెళితే… ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ఫైనల్స్ కూడా దుబాయ్ లోనే జరుగుతుంది. టీమిండియా ఇంటికి వెళితే… పాకిస్థాన్ దేశంలోని లాహోర్‌లో జరుగనుంది ఫైనల్.
Also Read: Ind vs Aus, Semi-Final: ఆసీస్ కు చెక్..డేంజర్ ప్లేయర్లతో టీమిండియా..టైమింగ్స్,ఉచితంగా చూడాలంటే ?
టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్లు
ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): కూపర్ కొన్నోలీ, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్ (C), మార్నస్ లాబుస్‌చాగ్నే, జోష్ ఇంగ్లిస్ (w), అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్‌వెల్, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘ
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(C), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(w), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి