Rivaba Jadeja on IND vs AUS: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో భాగంగా గ్రూప్ ఏ లో హైట్రిక్ విజయాలతో సెమిస్ చేరుకున్న టీమిండియా.. నేడు సెమీఫైనల్స్ లో ఆస్ట్రేలియాతో తలపడబోతోంది. దుబాయ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ చాలా ఆసక్తికరంగా సాగనుంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై విజయం సాధించి 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లో ఓటమికే ప్రతీకారం తీర్చుకోవాలని భారత క్రీడాభిమానులు కోరుకుంటున్నారు.
Also Read: Fans Offers Prayers: ట్రావిస్ హెడ్ ను ఔట్ చేసేలా టీమిండియా ఫ్యాన్స్ పూజలు !
ఇక అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ అన్ని రంగాలలో పటిష్టంగా ఉన్న భారత జట్టు హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతుండగా.. అటు కంగారు జట్టు కేవలం బ్యాటింగ్ మీదే ఆశలు పెట్టుకుంది. ఇక దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా నేడు మధ్యాహ్నం 2:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. ఈ మ్యాచ్ లో గెలిచి ఫైనల్ కి చేరుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా భార్య, బిజెపి ఎమ్మెల్యే రివాబా జడేజా కూడా భారత జట్టుకు ఆల్ ది బెస్ట్ చెప్పింది.
అంతేకాకుండా ఆస్ట్రేలియా పై భారత జట్టు గెలుస్తుందని {Rivaba Jadeja on IND vs AUS} ధీమా వ్యక్తం చేసింది. ఈరోజు ఉదయం రవీంద్ర జడేజా భార్య రీవాబా మీడియాతో మాట్లాడుతూ.. ” కచ్చితంగా ఈ సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ గెలవబోతోంది. భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ తర్వాత క్రికెట్లో ఆసక్తికరమైన పోరు ఆస్ట్రేలియా – భారత్ మధ్య ఉంటుంది. గత కొన్నేళ్లుగా భారత్ – ఆస్ట్రేలియా మధ్య పోరు ఎంత థ్రిల్లింగ్ గా ఉంటున్నాయో చూస్తూనే ఉన్నాం.
అయినా నేను ఒక్కదాన్నే కాదు.. భారత క్రీడాభిమానులు అందరూ ఈ సెమీ ఫైనల్ ను అధిగమిస్తామనే ధీమాతోనే ఉన్నారు. నా తరపున, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానుల అందరి తరపున భారత జట్టుకు ఆల్ ది బెస్ట్” అని చెప్పుకొచ్చింది రివాబా జడేజా. ఇక ఈ మ్యాచ్ కి కెప్టెన్ రోహిత్ శర్మ మాస్టర్ ప్లాన్ తో బరిలోకి దిగుతున్నట్లు సమాచారం. న్యూజిలాండ్ పై మాదిరే నలుగురు స్పిన్నర్లను ఆడించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Also Read: Rohit Sharma Row – Kohli: కోహ్లీ ఓ బ్రిటీష్ రాయబారి…షామా సంచలన వ్యాఖ్యలు!
దుబాయ్ పిచ్ స్పిన్ కి అనుకూలంగా ఉండడంతో రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి అక్షర్ పటేల్.. ఆస్ట్రేలియా బ్యాటర్ల భరతం పట్టనున్నారు. మరోవైపు షమీకి తోడు హార్దిక్ పాండ్యా పేస్ బాధ్యతలను పంచుకోనున్నాడు. ఇక ఈ మ్యాచ్ లో కె.ఎల్ రాహుల్ స్థానంలో రిషబ్ పంత్ కి అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతున్నా.. కీలకమైన సెమీస్ పోరులో ఆ సాహసం చేయకపోవచ్చు. ఇక ఈ మ్యాచ్ టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కి పెద్ద పరీక్ష లాంటిదని క్రీడా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
#WATCH | #ICCChampionsTrophy | Ahead of the 1st semi-final clash between India and Australia today, Rivaba Jadeja – wife of Team India all-rounder Ravindra Jadeja and BJP MLA says, "Definitely we are going to win this match because a very interesting rivalry in cricket, right… pic.twitter.com/dn3sqhVyG8
— ANI (@ANI) March 4, 2025