BigTV English

IND VS NZ: టీమిండియా, న్యూజిలాండ్‌ ఫైనల్‌ వర్షం వల్ల రద్దు అయితే.. విజేత ఎవరు ?

IND VS NZ: టీమిండియా, న్యూజిలాండ్‌ ఫైనల్‌ వర్షం వల్ల రద్దు అయితే.. విజేత ఎవరు ?

 


IND VS NZ: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్‌ ( ICC Champions Trophy, 2025 ) నేపథ్యంలోనే.. ఫైనల్‌ మ్యాచ్‌ కు రంగం సిద్ధం అయింది. ఈ ఫైనల్స్‌ లో భాగంగా టీమిండియా వర్సెస్‌ న్యూజిలాండ్‌ జట్ల మధ్య ఫైట్‌ ఉండనున్న సంగతి తెలిసిందే. టీమిండియా వర్సెస్‌ న్యూజిలాండ్‌ ( Team India vs New Zealand ) జట్ల మధ్య జరిగే ఫైనల్‌ మ్యాచ్‌ దుబాయ్‌ లోని అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో మార్చి 9వ తేదీన ఆదివారం రోజున జరుగనుంది. మొదటి సెమీ ఫైనల్స్‌ లో విజయం సాధించిన టీమిండియా ఫైనల్‌ కు చేరుకుంది. ఆ సమయంలో ఆసీస్‌ పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది రోహిత్‌ సేన. ఇక ఇటు మార్చి 5వ తేదీన న్యూజిలాండ్‌ వర్సెస్‌ దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన రెండో సెమీప్‌ లో బ్యాక్‌ క్యాప్స్‌ విజయం సాధించారు. దీంతో… ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్‌ నేపథ్యంలోనే.. ఫైనల్‌ కు టీమిండియా, న్యూజిలాండ్‌ జట్లు చేరుకున్నాయి.

Also Read: Saud Shakeel: మ్యాచులో నిద్ర పోయాడు.. ఔట్ అయ్యాడు.. పాకిస్థాన్‌ ప్లేయర్లకే ఇది సాధ్యం…!


టీమిండియా, న్యూజిలాండ్‌ ఫైనల్‌ టైమింగ్స్‌, ఉచితంగా ఎలా చూడాలి ?

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్‌ నేపథ్యంలో టీమిండియా, న్యూజిలాండ్‌ ఫైనల్‌ మ్యాచ్‌ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. అలాగే… Jio Hotstar యాప్‌లో అభిమానులు ఫైనల్ ను ఉచితంగానే చూడవచ్చును. Jio Hotstar లో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్‌ అన్ని మ్యాచ్‌ లు ఉచితంగానే జియో నెట్‌ వర్క్‌ ఉన్నవారికి అందించారు. ఇక టీమిండియా, న్యూజిలాండ్‌ ఫైనల్‌ మ్యాచ్‌ టాస్ ప్రక్రియ మధ్యాహ్నం 2:00 గంటలకు ఉంటుంది. మ్యాచ్‌ ప్రారంభః మధ్యాహ్నం 2:30 PM కు ఉంటుంది.

దుబాయ్‌ లో వర్షం పడితే ఎలా ?

టీమిండియా, న్యూజిలాండ్‌ ఫైనల్‌ మ్యాచ్‌ నేపథ్యంలో దుబాయ్‌ లో వర్షం పడితే ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయనే కూడా చూడాలి. ఒక వేళ వర్షం పడి… మార్చి 9వ తేదీన మ్యాచ్‌ ఆగిపోతే.. రిజర్వ్‌ డే ఉన్నట్లు చెబుతున్నారు. కాబట్టి తర్వాత రోజున అంటే మార్చి 10 వ తేదీన అయినా టీమిండియా, న్యూజిలాండ్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే ప్రారంభం కానుంది. ఒక వేళ పూర్తిగా రద్దు అయితే… టీమిండియా, న్యూజిలాండ్‌ జట్లను విజేతలుగా ప్రకటించే ఛాన్సు కూడా ఉంటుంది. ఒక వేళ రన్ రేట్ ప్రకారం ప్రకటిస్తే…టీమిండియాకే ఛాన్స్ ఉంటుంది. మరి ఆదివారం రోజున ఏం జరుగుతుందో చూడాలి.

Also Read: Mushfiqur Rahim Retirement: బంగ్లాదేశ్ క్రికెటర్ ముష్ఫికర్ రహీమ్ రిటైర్మెంట్

స్క్వాడ్‌లు:

భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి.

న్యూజిలాండ్: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మాట్ హెన్రీ, కైల్ జేమిసన్, విలియం ఒరూర్కే.

 

 

Related News

IND VS AUS: బీసీసీఐ ఫోన్ లిఫ్ట్ చేయ‌ని కోహ్లీ..వ‌న్డేల్లోకి అభిషేక్ శ‌ర్మ‌ ?

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

Big Stories

×