BigTV English

Ram Pothineni: దసరా పై కన్నేసిన యంగ్ హీరో

Ram Pothineni: దసరా పై కన్నేసిన యంగ్ హీరో
Advertisement

Ram Pothineni: సందీప్ కిషన్ హీరోగా నటించిన రా రా కృష్ణయ్య అనే సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు మహేష్ బాబు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించుకుంది. కానీ అవకాశాలు మాత్రం ఊహించిన రీతిలో రాలేదు. అయితే మజిలీ సినిమాకి ఒక డిపార్ట్మెంట్ లో వర్క్ చేశాడు. తర్వాత యువి క్రియేషన్స్ బ్యానర్ లో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అనుష్క నవీన్ పోలిశెట్టి నటించిన ఈ సినిమా మంచి కలెక్షన్స్ ను వసూలు చేసింది దర్శకుడుగా మహేష్ బాబును నిలబెట్టింది.


కొన్నిసార్లు టాలెంట్ ఉన్నా కూడా అది బయటపడటానికి టైం పడుతుంది. అలా ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత నవీన్ పోలిశెట్టితో సినిమా చేసి మంచి పేరును సాధించాడు. మహేష్ బాబు ప్రస్తుతం యంగ్ హీరో రామ్ తో సినిమా చేస్తున్న సంగతే తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తుంది. రామ్ పోతినేని కెరియర్ లో వస్తున్న 22వ సినిమా ఇది. మహేష్ బాబు దర్శకత్వంలో రామ్ సినిమా వస్తుంది అని అంటే అందరికీ మంచి అంచనాలు మొదలయ్యాయి. ఎందుకంటే మహేష్ బాబు సెన్సిబిలిటీస్ ఏంటో రెండు సినిమాలు ద్వారా ఆల్రెడీ ప్రూవ్ అవుతూ వచ్చింది. ఇప్పుడు యంగ్ హీరో తో సినిమా సెట్ అయితే ఈ సినిమా కూడా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ జూన్ లేదా జూలై లోపు పూర్తి చేసి దసరాకు రిలీజ్ చేసే ప్లాన్ లో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇది కానీ వర్కౌట్ అయితే రామ్ కి మంచి రిలీజ్ డేట్ దొరికినట్లే.

Also Read : Happy birthday Sharwanand : మంచితనం వ్యక్తిత్వం సరిపోవు శర్వా , స్టోరీ సెలక్షన్ కూడా బాగుండాలి


ఇక రామ్ పోతినేని విషయానికి వస్తే రీసెంట్ టైమ్స్ లో హిట్ సినిమా చూసి చాలా రోజులైంది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన స్కందా సినిమా కూడా అంతంత మాత్రమే ఆడింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన డబుల్ ఇస్మార్ట్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పూరి కెరీర్ ని ఆ సినిమా సెట్ చేస్తుంది అని అందరూ ఊహించారు. కానీ ఆ సినిమా మరింత రిస్కులో పడేసింది. డబల్ ఇస్మార్ట్ సినిమా కోసం రామ్ చాలా కష్టపడ్డాడు. ఇక ఈ సినిమా మంచి రిజల్ట్ తీసుకురాకపోగా ఎన్నో విమర్శలు వచ్చేలా చేసింది. ఈ ప్రాజెక్టు తర్వాత ఇప్పటివరకు పూరి జగన్నాథ్ తన తదుపరి సినిమాను అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు రామ్ కి యంగ్ డైరెక్టర్ మహేష్ బాబు హిట్ ఇస్తాడని చాలామంది ఊహిస్తున్నారు.

Also Read : Sailesh Kolanu: హిట్ యూనివర్స్ మధ్యలో బ్రేకులు

Related News

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Sree Leela: శ్రీలీల 150 కోట్ల యాడ్ ఫిలిం టీజర్ చూశారా..ఏంటి స్వామీ ఈ అరాచకం!

Influencer Bhavani Ram : కన్నీళ్లు తెప్పిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్ భవాని స్టోరీ… అప్పుడు ట్రోల్ చేశారు.. ఇప్పుడు సంపాదన ఎంతంటే?

Lazawal Ishq Show: పాక్‌‌లో డేటింగ్ రియాల్టీ షో.. వెంటనే ఆపాలంటూ గోలగోల, ఎందుకంటే?

Venu Swamy: శత్రువుల నాశనం కోసం వేణు స్వామి పూజలు…నీటిపై తేలియాడుతూ అలా!

Big Stories

×