E-Paper
Advertisement

Mohsin Naqvi: PCB సొమ్ముతోనే ICC న‌డుస్తోంది, లేక‌పోతే రోడ్డున ప‌డుతుంది

Mohsin Naqvi: PCB సొమ్ముతోనే  ICC న‌డుస్తోంది, లేక‌పోతే రోడ్డున ప‌డుతుంది
Advertisement

Mohsin Naqvi:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అంతర్జాతీయంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి, ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటును బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ మొహ్సీన్ నఖ్వీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ ను ప్రపంచంలోనే అతిపెద్ద లీగ్ గా మార్చబోతున్నట్లు వెల్లడించారు. ఐసీసీ నడిచేది మొత్తం పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు సంబంధించిన డబ్బుల పైన అంటూ బాంబు పేల్చారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు లేకపోతే ఐసీసీ రోడ్డున పడేదని సంచలన ఆరోపణలు చేశారు. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ మొహ్సీన్ న‌ఖ్వీ ( Mohsin Naqvi) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: Tanveer Ahmed: వైభ‌వ్ ప‌చ్చి మోస‌గాడు…వాడి ఏజ్ ఒక్క‌టే కాదు, బ్యాట్లు కూడా చెక్ చేయాల్సిందే

పాకిస్తాన్ ద‌య‌, డ‌బ్బులతోనే ఐసీసీ న‌డుస్తోంది – మొహ్సీన్ న‌ఖ్వీ

Advertisement

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్, ఆ దేశానికి చెందిన మంత్రివర్యులు మొహ్సీన్ న‌ఖ్వీ గురించి నిత్యం సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉంటాయి. అతన్ని టార్గెట్ చేసి చాలా మంది ట్రోల్స్ కూడా చేస్తారు. పాకిస్తాన్ క్రికెట్ అభిమానులే అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే అలాంటి మొహ్సీన్ న‌ఖ్వీ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ కంటే పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంటు అతిపెద్దదని.. త్వరలోనే అంతర్జాతీయంగా PSL ను నెంబర్ వన్ లీగ్ గా మార్చబోతున్నట్లు వెల్లడించారు.

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు సంబంధించిన డబ్బులతోనే ఐసీసీ నడుస్తోందని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు మొహ్సీన్ న‌ఖ్వీ. ప్రపంచంలోనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చాలా పవర్ఫుల్, బీసీసీఐ ని కూడా సాసిస్తుందని బాంబు పేల్చారు. ఐసీసీని కాపాడిది కూడా తమ క్రికెట్ బోర్డు అన్నారు. ఐసీసీకి దాదాపు 50% లాభాలు తీసుకువస్తున్నామని స్పష్టం చేశారు. అందుకే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎవరిని ఫాలో కాదని… తామే డెసిషన్ మేకర్స్ అంటూ వ్యాఖ్యానించారు మొహ్సీన్ న‌ఖ్వీ. దీంతో మొహ్సీన్ న‌ఖ్వీ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఇండియ‌న్ ఫ్యాన్స్ సీరియ‌స్ అవుతున్నారు. వీడికి బుద్ది లేద‌ని, తెలిసి తెలియ‌ని లెక్క‌లు చెప్పి, అంద‌రినీ పిచ్చోళ్ల‌ను చేస్తున్న‌ట్లు మండిప‌డుతున్నారు ఫ్యాన్స్‌.

ఐసీసీ చైర్మన్ గా మొహ్సీన్ న‌ఖ్వీకి ఛాన్స్ ?

Advertisement

ఐసీసీ చైర్మన్ గా మొహ్సీన్ న‌ఖ్వీకి ఛాన్స్ వస్తుందని మొన్నటి నుంచి వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. 2027 డిసెంబర్ వరకు ఐసీసీ బాస్ గా జై షా కొనసాగనున్నాడు. ఆ తర్వాత కొత్త చైర్మన్ వస్తాడు. ఈ నేపథ్యంలోనే అదృష్టం బాగుంటే మొహ్సీన్ న‌ఖ్వీకి అవకాశం వస్తుందని అంటున్నారు. ఈ మేరకు పాకిస్తాన్ లో ప్రచారం అయితే సాగుతోంది.

Also Read: Virender Sehwag: రాసిపెట్టుకోండి…బుమ్రా బౌలింగ్ లో వైభ‌వ్ 6 బంతుల్లో ఆరు సిక్స‌రు కొడ‌తాడు

 

 

https://www.facebook.com/photo?fbid=973950412212368&set=a.808612632079481

 

Related News

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

డ్రెస్సింగ్ రూంలో త‌న్నుకున్న పాకిస్తాన్ క్రికెట‌ర్లు..!

ఐర్లాండ్ చేతిలో టీమిండియానే వైట్ వాష్ అయింది, అందుకే పాకిస్తాన్ ఓడిపోతోంది

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

Big Stories

Advertisement
×