OTT Movie : రీసెంట్ గా థియేటర్లలో రిలీజ్ అయిన ఒక బాలీవుడ్ మూవీ ఓటీటీలోకి రాబోతోంది. ఈ సినిమా హారర్ కామెడీ జానర్ లో తెరకెక్కింది. సంజయ్ దత్ ఇందులో ముఖ్య పాత్రలో నటించారు. ఇందులో ఒక దెయ్యం మగవాళ్లను టార్గెట్ చేస్తుంటుంది. ఈ స్టోరీ ఒక వైపు భయపెట్టిస్తూ, మరో వైపు కడుపుబ్బా నవ్విస్తుంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ బాలీవుడ్ హారర్ కామెడీ మూవీ పేరు ‘ది భూత్నీ’ (The Bhootnii). 2025 లో వచ్చిన ఈ సినిమాకి సిద్ధాంత్ సచ్‌దేవ్ దర్శకత్వం వహించారు. ఇందులో సంజయ్ దత్, మౌనీ రాయ్, సన్నీ సింగ్ , పలక్ తివారీ, బియౌనిక్ , ఆసిఫ్ ఖాన్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమా 2025 మే 1న థియేటర్లలో విడుదలైంది. ఇది హారర్, కామెడీ జానర్ లో తెరకెక్కింది. ఈ మూవీ తొందరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో లో స్ట్రీమింగ్ కి రానుంది.
స్టోరీలోకి వెళితే
ఈ స్టోరీ ఢిల్లీలోని సెయింట్ విన్సెంట్ కాలేజ్‌లో జరుగుతుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం వాలెంటైన్స్ డే రోజున “వర్జిన్ ట్రీ” అనే చెట్టు వద్ద ప్రేమికులు ప్రార్థనలు చేస్తుంటారు. ఈ చెట్టు నిజమైన ప్రేమను ప్రసాదిస్తుందని నమ్ముతారు. అయితే ప్రతి సంవత్సరం హోలీ పండుగ రోజున ఒక విద్యార్థి ఊహించని విధంగా ఇక్కడ చనిపోతుంటాడు. ఈ చనిపోయిన వాళ్ళలో మగవాళ్లే ఉంటారు. ఇక మెయిన్ స్టోరీలో సాంటా అనే ఒక కాలేజ్ విద్యార్థి, తన ప్రియురాలు బ్రేక్ అప్ చెప్పడంతో బాధపడుతుంటాడు. వాలెంటైన్స్ డే రాత్రి, మద్యం మత్తులో, అతను వర్జిన్ ట్రీ వద్దకు వెళ్లి నిజమైన ప్రేమ కోసం ప్రార్థిస్తాడు. అతని ప్రార్థనను మొహబ్బత్ అనే ఒక దెయ్యం వింటుంది. ఆ దెయ్యంకి సాంటాను చూసి జాలి కలుగుతుంది. మొహబ్బత్ అనే దెయ్యం ఇప్పుడు సాంటాను సొంతం చేసుకోవాలనే బలమైన కోరికతో ఉంటుంది. అతని స్నేహితులు, అతని దగ్గరకు వచ్చే ఎవరినైనా భయపెడుతుంది. సాంటాకు అనన్య అనే స్నేహితురాలు ఉంటుంది. ఆమె అతనిపై ఇష్టం కలిగి ఉంటుంది. ఇక దీనివల్ల ఆ దెయ్యానికి కోపం వస్తుంది.
ఇప్పుడు కాలేజ్‌లో వింత సంఘటనలు జరుగుతాయి. తలుపులు స్వయంగా తెరుచుకోవడం, దెయ్యం నీడలు కదలడం, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం వంటివి జరుగుతాయి. ఈ కాలేజ్ లో భయంకరమైన వాతావరణం కమ్ముకుంటుంది. విద్యార్థులు ఒంటరిగా నడవడానికి భయపడతారు. అంతే కాకుండా ఇప్పుడు వర్జిన్ ట్రీ ఒక భయంకరమైన ప్రదేశంగా మారుతుంది. కాలేజ్ మేనేజ్‌మెంట్ ఈ సమస్యను దాచడానికి ప్రయత్నిస్తుంది. తరువాత కృష్ణ త్రిపాఠి అలియాస్ బాబా (సంజయ్ దత్), ఒక అనుభవజ్ఞుడైన పారా-ఫిజిసిస్ట్ ను పిలిపించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతుంది. బాబా ప్రవేశంతో కథ ఊపందుకుంటుంది. అతను మొహబ్బత్ గతాన్ని తెలుసుకుంటాడు. ఆమెకు ఒక ట్రాజిక్ లవ్ స్టోరీతో సంబంధం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఆత్మకి, బాబాకి మధ్య ఒక యుద్ధ వాతావరణం మొదలవుతుంది. క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్లు ఎదురుపడతాయి. చివరికి ఈ ఆత్మ గతం ఏమిటి ? ఈ దెయ్యం మగవాళ్లనే ఎందుకు టార్గెట్ చేస్తోంది ? దీనివల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి ? బాబా ఈ సమస్యను పరిష్కరిస్తాడా ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : ఇది అమ్మాయిల కథ కాదు మావా అరాచకం … ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చూడాల్సిన మూవీ