Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 {Champions Trophy 2025} నిర్వహణపై కొనసాగుతున్న సందిగ్ధతకు తెరపడింది. ఛాంపియన్స్ ట్రోఫీ ని హైబ్రిడ్ విధానంలో నిర్వహించేందుకు ఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పాకిస్తాన్ కి షాక్ తగిలింది. ఐసీసీ ట్రోఫీ అయినప్పటికీ పాకిస్తాన్ వెళ్ళేది లేదని టీమిండియా తేల్చి చెప్పడంతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వెనక్కి తగ్గక తప్పలేదు. దీనికి పాకిస్తాన్ కూడా అంగీకరించింది. దీంతో ఈ మెగా టోర్నీలో ఇండియా మ్యాచ్ లు పూర్తిగా దుబాయిలోనే జరగనున్నాయి.
Also Read: Vinod Kambli: పెన్షన్ డబ్బులతో బతుకీడుస్తున్న భారత మాజీ క్రికెటర్!
మిగిలిన మ్యాచ్ లు పాకిస్తాన్ లోని 3 వేదికలలో ఉంటాయి. ఇక 2026 టీ – 20 వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా తో పాకిస్తాన్ ఆడే మ్యాచ్ ఇండియాలో బదులు కొలంబోలో జరగనుంది. ఐసీసీ – పీసీబీ మధ్య ఒప్పందం ప్రకారం 2026లో భారతలో జరిగే టి – 20 ప్రపంచ కప్ ఆడేందుకు పాకిస్తాన్ జట్టు భారత్ కి రావడం లేదు. అంటే 2025లో ఇండియా మ్యాచ్ లు వేరే చోట నిర్వహించడం వల్ల.. 2026లో పాకిస్తాన్ మ్యాచ్ లు కూడా వేరే చోట నిర్వహించాల్సి వస్తుంది. అలాగే పాకిస్తాన్ లో భారత జట్టు మ్యాచ్ లు నిర్వహించే అవకాశాన్ని కోల్పోయినందుకు పిసిబికి ఎలాంటి పరిహారం ఇవ్వడానికి ఐసీసీ నిరాకరించింది.
ఇక 2027 తర్వాత ఐసీసీ మహిళా ట్రోఫీని నిర్వహించేందుకు ఐసిసి అంగీకరించినట్లు సమాచారం. ఐసీసీ, బీసీసీఐ, పీసీబీ.. ఈ ముగ్గురు ఈ ఒప్పందంపై సంతృప్తి వ్యక్తం చేయడంతో సమస్య సద్దుమణిగింది. ఇక ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025 {Champions Trophy 2025} లో భాగంగా పాకిస్తాన్ మొత్తం పది మ్యాచ్ లకి అతిథ్యం ఇవ్వనుంది. కానీ ఇండియా ఆడే మూడు లీగ్ మ్యాచ్ లు మాత్రం దుబాయ్ లో జరుగుతాయి. ఇందులో పాకిస్తాన్ – ఇండియా మ్యాచ్ కూడా ఉంది. ఒకవేళ ఇండియా సెమీఫైనల్ కి గాని, ఫైనల్ కీ గాని చేరితే ఆ మ్యాచులు కూడా దుబాయ్ లోనే ఉంటాయి.
ఇండియన్ టీం లీగ్ స్టేజ్ లోనే నిష్క్రమిస్తే పాకిస్తాన్ లోని లాహోర్, లేదా రావాల్పిండి స్టేడియాల్లో ఈ మ్యాచ్ లు జరుగుతాయి. ఈ టోర్నీ షెడ్యూల్ ని కూడా త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుత సమాచారం ప్రకారం ఛాంపియన్ ట్రోఫీ 2025 {Champions Trophy 2025} ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు జరుగుతుంది. ఈ టోర్నమెంట్ లో 8 జట్లు పాల్గొంటాయి. అలాగే ఆ ఎనిమిది చెట్లను నాలుగు జట్ల చొప్పున రెండు గ్రూపులుగా విభజిస్తారు. ఒక్కో గ్రూపు నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన చెట్లు సెమీఫైనల్ కి అర్హత సాధిస్తాయి.
Also Read: World Chess Champion Gukesh: గుకేష్ తెలుగోడు కాదు…చంద్రబాబు వర్సెస్ స్టాలిన్ ?
సెమీస్ లో గెలిచిన జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఇక భారత్ – శ్రీలంక సంయుక్త వేదికల్లో టి – 20 వరల్డ్ కప్ 2026 లో జరగనుంది. అయితే ఈ టోర్నీలో పాల్గొనేందుకు భారత్ కి వెళ్లబోమని, తమకి సంబంధించిన మ్యాచ్లను శ్రీలంకలోనే నిర్వహించాలని ఇటీవలి సమావేశంలో పాకిస్తాన్ పట్టుబట్టినట్లు తెలిసింది. దీంతో ఈ టోర్నీలో పాకిస్తాన్ ఆడే లీగ్ దశ మ్యాచ్ లు శ్రీలంకలోని నిర్వహించేందుకు ఐసిసి కూడా ఒప్పుకున్నట్లు సమాచారం. ఎట్టకేలకు ఛాంపియన్స్ ట్రోఫీ – 2025 నిర్వహణకు సంబంధించి తలెత్తిన గందరగోళానికి ఐసీసీ తెరదించింది.