E-Paper
Advertisement

Under 19 World Cup 2026: వ‌ర‌ల్డ్ క‌ప్ లో టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. ఏకంగా 204 ప‌రుగుల తేడాతో

Under 19 World Cup 2026: వ‌ర‌ల్డ్ క‌ప్ లో టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. ఏకంగా 204 ప‌రుగుల తేడాతో
Advertisement

Under 19 World Cup 2026:   ఐసీసీ అండర్ 19 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( ICC Under 19 World Cup 2026 ) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో టీమిండియా అండర్ 19 జట్టు మరో విజయాన్ని నమోదు చేసుకుంది. ఇప్పటికే రెండు మ్యాచ్ లు గెలిచిన టీమిండియా ఇవాళ మూడవ మ్యాచ్ కూడా సొంతం చేసుకుంది. అండర్ 19 వన్డే వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ జింబాబ్వే వర్సెస్ టీమిండియా ( Zimbabwe U19 vs India U19) మధ్య ఆరవ మ్యాచ్ బులావాయే వేదికగా జరిగింది. అయితే ఇందులో 204 పరుగుల భారీ పరుగుల తేడాతో విజయం సాధించింది టీమిండియా అండర్ 19 జట్టు. టీమిండియా విధించిన 352 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో జింబాబ్వే అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో 37.4 ఓవర్లలోనే ఆల్ అవుట్ అయి ఓడిపోయింది జింబాబ్వే.

 Also Read: Former India captain: కొలంబోలో కొడితే, మ‌ద్రాసులో ప‌డ‌తారు..ఇప్ప‌టికైనా టీ20 ప్ర‌పంచ క‌ప్ నుంచి త‌ప్పుకోండి..పాకిస్తాన్ కు వార్నింగ్‌ 

వ‌ర‌ల్డ్ క‌ప్ లో టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ

Advertisement

ఐసీసీ అండర్ 19 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ జింబాబ్వే వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఆరవ మ్యాచ్ జరిగింది. బులవాయే క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ( Queens Sports Club, Bulawayo ) ఈ రెండు జట్ల మధ్య ఫైట్ జరిగింది. అయితే ఇందులో ఇండియా మొదట బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నిర్ణీత 50 ఓవర్లు ఆడింది అండర్ 19 టీమ్ ఇండియా. ఈ సందర్భంగా ఎనిమిది వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ టార్గెట్ జింబాబ్వే ముందు ఉంచింది టీమిండియా అండర్ 19. ఈ సందర్భంగా టీమిండియా కుర్రాడు వైభవ్ సూర్య వంశీ ( Vaibhav Sooryavanshi ) మరోసారి మెరిశాడు.

30 బంతుల 52 పరుగులు చేసిన వైభవ్, నాలుగు సిక్సర్లు అలాగే నాలుగు బౌండరీలు సాధించాడు. అటు విహాన్ మల్హోత్రా ఈ మ్యాచ్ లో సెంచరీ చేసి ఇరగదీసాడు. వికెట్లు పడుతున్న నేపథ్యంలో కాస్త స్లోగా ఆడినప్పటికీ సెంచరీ మాత్రం పూర్తి చేసి జట్టును ఆదుకున్నాడు. ఇంకా టీమిండియా విధించిన 353 పరుగుల లక్ష్యాన్ని చేదించడంలో జింబాబ్వే అండర్ 19 అత్యంత దారుణంగా విఫలమైంది. 35.4 ఓవర్లు ఆడిన జింబాబ్వే అండర్ 19 జట్టు, 148 పరుగులు చేసి కుప్ప కూలింది. దీంతో 204 పరుగుల భారీ పరుగుల తేడాతో విజయం సాధించింది టీమిండియా అండర్ 19. దీంతో హ్యాట్రిక్ విక్ట‌రీలు న‌మోదు చేసుకుంది టీమిండియా అండ‌ర్ 19 జ‌ట్టు. జింబాబ్వే వర్సెస్ టీమిండియా ( Zimbabwe U19 vs India U19) మధ్య ఆరవ మ్యాచ్ లో సెంచ‌రీతో అద‌ర‌గొట్టాడు విహాన్ మల్హోత్రా. దీంతో ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా విహాన్ మల్హోత్రాకే ద‌క్కింది.  అటు వ‌రుస‌గా మూడు విజ‌యాలు న‌మోదు చేసుకున్న టీమిండియాకు ( Team India) ఆరు పాయింట్లు ద‌క్కాయి.

Advertisement

 Also Read: Tanveer Ahmed-Abhishek: త‌న్వీర్ అహ్మాద్ కు అభిషేక్ స్ట్రాంగ్ కౌంట‌ర్‌..నిన్ను పాకిస్తాన్ లో న‌గ్నంగా తిరిగేలా చేస్తానంటూ !

 

 

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×