BigTV English

WTC Final Race – Australia: ఆస్ట్రేలియాకు బిగ్‌ షాక్‌…WTC రేసు నుంచి ఔట్‌ ?

WTC Final Race – Australia: ఆస్ట్రేలియాకు బిగ్‌ షాక్‌…WTC రేసు నుంచి ఔట్‌ ?

WTC Final Race – Australia: ప్రస్తుతం.. క్రికెట్ అభిమానులందరూ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ( ICC World Test Championship) కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ట్రోఫీ ( ICC World Test Championship ) ఫైనల్ కు టీమిండియా వస్తుందని… అందరూ అనుకుంటున్నారు. మొన్న న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఓడిపోవడంతో…. టీమిండియా ( Team India) ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు. కానీ ఆస్ట్రేలియా ( Australia ) గడ్డపై… మొదటి టెస్ట్ గెలవడంతో మళ్లీ మొదటి స్థానానికి వచ్చింది టీమిండియా.


Also Read: Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీ విషయంలో ICC కీలక నిర్ణయం.. అక్కడే మ్యాచులు !

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ట్రోఫీ ( ICC World Test Championship)పాయింట్స్ టేబుల్ లో ప్రస్తుతం టీమిండియా టాప్ పొజిషన్ లో ఉంది. 110 పాయింట్లు అగ్రస్థానంలో ఉన్న టీమిండియా… 61.11% సాధించింది. అయితే మొన్నటి వరకు రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా జట్టుకు ఊహించని షాక్ ఇచ్చింది సౌత్ ఆఫ్రికా. రెండవ స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా జట్టును కిందికి లాగేసింది సౌత్ ఆఫ్రికా ( SA). తాజాగా లంకపై గ్రాండ్ విక్టరీ కొట్టిన సఫారీలు… రెండవ స్థానానికి చేరుకున్నారు.


Also Read:  Mohammed Shami: SRHకు బిగ్‌ షాక్‌..మరోసారి గాయపడ్డ టీమిండియా బౌలర్‌ ?

దీంతో ప్రస్తుతం రెండవ స్థానంలో ఉన్న సఫారీల ఖాతాలో 64 పాయింట్లు చేరాయి. వాళ్ల విన్నింగ్ పర్సంటేజ్ 59.26 ఉంది. అదే ఆస్ట్రేలియా ( Australia ) విన్నింగ్ పర్సంటే మాత్రం 57.69 గా ఉండడం జరిగింది. ఇక ఆస్ట్రేలియా ఖాతాలో 90 పాయింట్లు ఉన్నప్పటికీ విన్నింగ్ పర్సంటేజ్ తగ్గడంతో మూడవ స్థానానికి దిగజారింది. దీంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ట్రోఫీ ఫైనల్ చాలా రసవత్తరంగా మారిపోయింది.

మళ్లీ ఆస్ట్రేలియా… గాడిలో పడాలంటే కచ్చితంగా టీమిండియాతో జరిగే రెండవ టెస్టులో… గెలవాల్సి ఉంటుంది. ఇక అటు ఈ ఛాంపియన్‌షిప్ ( ICC World Test Championship ) బరిలో నిలవాలంటే టీమిండియా మరో మూడు టెస్ట్ మ్యాచ్లు కచ్చితంగా గెలవాలి. మరో మూడు టెస్ట్ మ్యాచ్ లు గెలిస్తేనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ట్రోఫీ ఫైనల్ ( I C C World Test Championship ) బరిలో ఉంటుంది టీమిండియా. దీంతో ఈ ఛాంపియన్‌షిప్ ట్రోఫీ కోసం జరిగే ఫైట్ చాలా రసవత్తరంగా మారింది. ఇక ఆస్ట్రేలియాపై టీమిండియా గెలిచి.. అటు లంకపై సఫారీలు గెలిస్తే.. WTC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ట్రోఫీ ఫైనల్ ( ICC World Test Championship ) బరిలో టీమిండియా ( Team India) , సౌతాఫ్రికా ఉంటాయి.

 

ఇది ఇలా ఉండగా తాజాగా డర్బన్ వేదికగా శ్రీలంక వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మొదటి టెస్ట్ మ్యాచ్లో శ్రీలంకను చిత్తు చేసింది సౌత్ ఆఫ్రికా. ఏకంగా 233 పరుగుల తేడాతో శ్రీలంక జట్టు పై గ్రాండ్ విక్టరీ కొట్టింది సఫారీ జట్టు. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ అన్ని రంగాల్లో రాణించిన సఫారీ జట్టు గ్రాండ్ విక్టరీ కొట్టడం జరిగింది.

Related News

IND VS PAK: అభిషేక్‌ దుమ్ములేపాడు… సూప‌ర్ 4 లోనూ టీమిండియా విజ‌యం.. షేక్ హ్యాండ్ మళ్ళీ లేదు

IND Vs PAK : Ak 47 గ‌న్స్ పేల్చుతూ పాకిస్థాన్ సెల‌బ్రేష‌న్స్‌.. టీమిండియా టార్గెట్ ఎంతంటే

Rohith Sharma : టీమిండియా కోచ్ గా రోహిత్ శర్మ… త్వరలోనే రిటైర్మెంట్?

IND Vs PAK : సీన్ రిపీట్… పాకిస్తాన్ పరువు తీసిన సూర్య కుమార్ యాదవ్

Asia Cup 2025 : బంగ్లా, శ్రీలంక మ్యాచ్ లో నాగిని డ్యాన్స్‌.. వీడియో చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే

IND Vs PAK : ఆసియా కప్ లో కలకలం… టీమిండియా ప్లేయర్లు అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్!

IND Vs PAK : టీమిండియా ఫ్యాన్స్ కు పాకిస్థాన్ ఆట‌గాడు ఆటోగ్రాఫ్‌…!

BCCI : బీసీసీఐలో ప్ర‌క్షాళ‌న‌..కొత్త అధ్య‌క్షుడు ఇత‌నే.. ఐపీఎల్ కు కొత్త బాస్

Big Stories

×