WTC Final SA vs Aus: బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ – ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భారత జట్టు తీవ్రంగా నిరాశపరిచింది. ఒక టెస్ట్ వర్షం కారణంగా డ్రా గా ముగియడంతో ఈ సిరీస్ ని ఆస్ట్రేలియా 3-1 తో కైవసం చేసుకుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్నింటిలో మెరుగైన ప్రదర్శనలు లేకపోవడం, సీనియర్ స్టార్ బ్యాటర్లతో పాటు మిగతా ప్లేయర్లు కూడా పరుగులు చేయడంలో విఫలం కావడంతో భారత జట్టు ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది.
Also Read: Virat Kohli: కోహ్లీ మాస్ ర్యాగింగ్.. గుక్కపెట్టి ఏడుస్తున్న ఆసీస్ ప్లేయర్లు !
దీంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అవకాశాలను భారత్ చేజార్చుకుంది. ఈ సిరీస్ విజయంతో ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 10 ఏళ్ల తర్వాత సొంతం చేసుకుంది. గత రెండు పర్యాయాలు ఆస్ట్రేలియాలో భారత జట్టు 2 – 1 తో ఈ సిరీస్ ని చేజిక్కించుకుంది. ఇప్పుడు ఈ సిరీస్ ఫలితంతో ఆస్ట్రేలియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ 2025 కి అర్హత సాధించింది. ఇక దక్షిణాఫ్రికా జట్టు ఇప్పటికే ఫైనల్ చేరుకున్న విషయం తెలిసిందే. దీంతో డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ సౌతాఫ్రికా – ఆసీస్ మధ్య ఉండబోతోంది.
ఈ ఫైనల్ ఈ ఏడాది జూన్ నెలలో జరగనుంది. ఇంగ్లాండ్ లోని ప్రఖ్యాత లార్డ్స్ స్టేడియం ఈ ఫైనల్ కి వేదిక కానుంది. పాకిస్తాన్ పైన విజయంతో దక్షిణాఫ్రికా ఫైనల్ కీ గ్రాండ్ గా దూసుకెళ్లింది. ఇక్కడ మరో విషయం ఏంటంటే స్లో ఓవర్ రేట్ కారణంగా ఆస్ట్రేలియా పాయింట్లు కోల్పోవాల్సి వస్తుందా..? లేదా..? అన్నది ఐసీసీ తేల్చాల్సి ఉంది. ఐసీసీ నిర్ణయం తర్వాతే ఆస్ట్రేలియా అధికారికంగా డబ్ల్యూటీసి ఫైనల్ కీ అర్హత సాధిస్తుంది. ఫైనల్ కి అర్హత సాధిస్తే జూన్ 11న ప్రారంభమయ్యే డబ్ల్యూటీసి ఫైనల్ లో ఆస్ట్రేలియా జట్టు దక్షిణాఫ్రికా తో తలపడుతుంది. ఇక ఈ నెలాఖరున ఆస్ట్రేలియా రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కోసం శ్రీలంకకు వెళ్లాల్సి ఉంది.
Also Read: Australia Won BGT: WTC రేసు నుంచి ఔట్..10 ఏళ్ల తర్వాత BGT సిరీస్ కోల్పోయిన టీమిండియా
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023 – 25 పాయింట్ల పట్టిక వివరాల ప్రకారం:
జట్టు: దక్షిణాఫ్రికా: మ్యాచ్ లు: 11 గెలిచింది: 7 ఓడిపోయింది: 3 డ్రా: 1 పాయింట్లు: 88 విన్నింగ్ పర్సంటేజ్: 66.67
జట్టు: ఆస్ట్రేలియా: మ్యాచ్ లు: 17 గెలిచింది: 11 ఓడిపోయింది: 4 డ్రా: 2 పాయింట్లు: 130 విన్నింగ్ పర్సంటేజ్: 63.72
జట్టు: భారత్: మ్యాచ్ లు: 19 గెలిచింది: 9 ఓడిపోయింది: 8 డ్రా: 2 పాయింట్లు: 114 విన్నింగ్ పర్సంటేజ్: 50.00
జట్టు: న్యూజిలాండ్: మ్యాచ్ లు: 14 గెలిచింది: 5 ఓడిపోయింది: 7 డ్రా: 0 పాయింట్లు: 81 విన్నింగ్ పర్సంటేజ్: 48.21
జట్టు: శ్రీలంక: మ్యాచ్ లు: 11 గెలిచింది: 5 ఓడిపోయింది: 6 డ్రా: 0 పాయింట్లు: 60 విన్నింగ్ పర్సంటేజ్: 45.45
Have a look at the updated WTC points table after Australia clinched a historic Test series win against India by 3-1 and will face South Africa in the finals of WTC at the iconic Lord’s starting from 11th June, 2025 🔥🏏#AUSvsIND #AUSvSA #Finals #ICC #WTC2025 #Tests… pic.twitter.com/xmQoh9f0EH
— InsideSport (@InsideSportIND) January 5, 2025