BigTV English

Team India : సెమీస్ కి ఇండియా పక్కా..కానీ..

Team India : సెమీస్ కి ఇండియా పక్కా..కానీ..

Team India : వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఆరింటికి ఆరు మ్యాచ్ ల్లోను విజయం సాధించి ఇండియా సెమీస్ బెర్త్ దాదాపు ఖాయం చేసుకుంది. అయితే సాంకేతికంగా ఇంకా ప్రకటించకపోయినా మిగిలిన జట్ల పరిస్థితి చూస్తే, ఇండియాని దాటి వెళ్లే పరిస్థితి అయితే లేదు.
కాకపోతే శ్రీలంకకి మాత్రమే ఆ ఒక్క అవకాశం ఉంది. ఎందుకంటే తను రెండింటిలో గెలిచింది. ఇంకా ఆడాల్సినవి 4 ఉన్నాయి. అది వరుసగా గెలిస్తే 12 పాయింట్లు వస్తాయి.


ఇక ఇంటికే అంటున్న ఇంగ్లండ్ కూడా సాంకేతికంగా ఇంకా రేస్ లోనే ఉందని చెప్పాలి. ఆడిన ఆరు మ్యాచ్ ల్లో ఐదింటిలో ఓడిపోయింది. ఇంకా ఆడాల్సినవి మూడున్నాయి. అప్పుడు 8 పాయింట్లు అవుతాయి.
ఇప్పటికే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ 8 పాయింట్లతో ఉన్నాయి. ఇవి ఇలాగే ఉండిపోవాలి. అప్పుడు నెట్ రన్ రేట్ ఆధారంగా చూస్తారు. ఇంగ్లండ్ మిగిలిన మూడింటి మీద ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా తరహాలో 400 పరుగులు చేసుకుంటూ వెళ్లాలి. అది అసాధ్యం. కాకపోతే టెక్నికల్ గా ఈరోజు వరకు రేస్ లో ఉన్నట్టే లెక్క.

సౌతాఫ్రికా ఆరు మ్యాచ్ లకు ఐదింటిలో నెగ్గి 10 పాయింట్లతో  సెమీస్ కి దగ్గరగా ఉంది. ఇంకా మూడు మ్యాచ్ లు ఆడాలి. అన్నీ గెలిస్తే 16 పాయింట్లు అవుతాయి.
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ చెరో ఆరు మ్యాచ్ లు ఆడి, రెండేసి ఓటములతో 8 పాయింట్లతో ఉన్నాయి. ఇంకా ఆడాల్సినవి మూడున్నాయి. వీటిలో రెండు గెలిస్తే 12 పాయింట్లతో ఇండియాకి సమానం అవుతాయి. అలా వారికి సెమీస్ తలుపులు తెరుచుకుంటాయి.


శ్రీలంక, పాకిస్తాన్ రెండేసి విజయాలతో 4 పాయింట్లతో ఉన్నాయి. శ్రీలంక 4, పాకిస్తాన్ 3 మ్యాచ్ లు ఆడాలి. వీరు వరుసగా గెలిస్తే సెమీస్ అవకాశాలు చెప్పలేం. అప్పుడు శ్రీలంక 12, పాకిస్తాన్ 10 పాయింట్లతో ఉంటుంది.
అప్పుడు  ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కూడా ఇవే పాయింట్ల మీద ఉండిపోవాలి. అప్పుడు నెట్ రన్ రేట్ ఆధారంగా లెక్కలేస్తారు. అంత పరిస్థితి రాకపోవచ్చునని కొందరు అంటున్నారు.

బంగ్లాదేశ్ 6 మ్యాచ్ ల్లో 5 ఓటములతో చూసుకుంటూ సెమీస్ రేస్ నుంచి దాదాపు దూరమైనట్టేనని అంటున్నారు.
ఆఫ్గనిస్తాన్, నెదర్లాండ్ కూడా రెండేసి విజయాలు సాధించాయి. సాంకేతికంగా నేటి పరిణామక్రమంలో చూస్తే వాటికి అవకాశం ఉన్నట్టేనని అంటున్నారు. ఇంకా ఆడాల్సిన మ్యాచ్ లు ఉన్నాయి కాబట్టి, మొన్నటిలా ఏమైనా అద్భుతాలు జరిగితే..వారు వీరవచ్చు..వీరు వారు కావచ్చు..ఇదండీ సంగతి..

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×