BigTV English

Iga Swiatek : నెంబర్‌వన్‌కు షాక్.. ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి ఔట్..

Iga Swiatek  : నెంబర్‌వన్‌కు షాక్.. ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి ఔట్..

Iga Swiatek out from Australian Open : మహిళల టెన్నిస్ నెంబర్‌వన్‌ ర్యాంకర్ ఇగా స్వియాటెక్‌కు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో షాక్ తగిలింది. కజకిస్తాన్ క్రీడాకారిణి, 22వ సీడ్, గత వింబుల్డన్ ఛాంపియన్ అయిన ఎలెనా రైబాకినా చేతిలో… ప్రీ క్వార్టర్ ఫైనల్లో ఇగా స్వియాటెక్‌ కంగుతినింది. మహిళల సింగిల్స్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో… వరుస సెట్లలో 6-4, 6-4 తేడాతో ఇగా స్వియాటెక్‌ను ఓడించి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది… ఎలెనా రైబాకినా. గంటన్నర పాటు హోరాహోరీగా సాగిన పోరులో… స్వియాటెక్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు… ఎలెనా. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వార్టర్స్‌కు చేరడం రైబాకినాకు ఇదే తొలిసారి. స్వియాటెక్‌ కెరీర్లో ఇప్పటిదాకా మూడు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. ఇందులో రెండు ఫ్రెంచ్‌ ఓపెన్‌ కాగా.. మరొకటి యూఎస్‌ ఓపెన్‌ ఉంది. గత ఏడాదే యూఎస్‌ ఓపెన్‌ విజేతగా నిలిచిన స్వియాటెక్‌… ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మాత్రం క్వార్టర్ ఫైనల్ కూడా చేరలేదు.


మరో ప్రీ క్వార్టర్ ఫైనల్లో లాత్వియాకు చెందిన 17వ సీడ్ జెలెనా ఒస్టాపెంకో… అమెరికాకు చెందిన 7వ సీడ్ గౌఫ్ కు షాకిచ్చింది. రెండు వరుస సెట్లలో 7-5, 6-3 తేడాతో గౌఫ్ ను ఓడించి… క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది… ఒస్టాపెంకో. క్వార్టర్ ఫైనల్లో రైబాకినాతో తలపడుతుంది… ఒస్టాపెంకో.

ఇక మిగతా మహిళల సింగిల్స్ మ్యాచ్‌ల్లో… బెలారస్‌కు చెందిన అయిదో సీడ్‌ సబలెంక 6-2, 6-3 తేడాతో జర్మనీకి చెందిన ఎలిస్‌ మెర్టెన్స్‌పై గెలిచి ప్రీ క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. మరో మ్యాచ్‌లో స్విట్జర్లాండ్‌కు చెందిన 12వ సీడ్‌ బెన్సిచ్‌ 6-2, 7-5 తేడాతో ఇటలీకి చెందిన జియోర్గిని ఓడించి ప్రీ క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. సబలెంక, బెన్సిచ్‌ మధ్య ప్రీ క్వార్టర్స్‌ పోరు జరగనుంది. మరో మ్యాచ్‌లో ఫ్రాన్స్‌కు చెందిన నాలుగో సీడ్‌ గార్సియా 1-6, 6-3, 6-3 తేడాతో జర్మనీకి చెందిన సీజ్‌మండ్‌పై గెలిచి ప్రీ క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది


Follow this link for more updates : Bigtv

Tags

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×