IND vs Pak: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో ( Champions Trophy 2025 Tournament ) భాగంగా… దుబాయ్ వేదికగా జరిగిన ఆదివారం మ్యాచ్ లో టీమిండియా ( Team India ) గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టుపై ఏకంగా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన టీమ్ ఇండియా… సెమిస్ బరిలోకి దిగబోతుంది. ఒక్క అడుగు దూరంలోనే నిలిచింది టీమిండియా. మరో మ్యాచ్ గెలిచిన గెలవకపోయినా దాదాపు టీమిండియా సెమిస్ చేరే చాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే పాకిస్తాన్ పై టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టిన నేపథ్యంలో… సోషల్ మీడియాలో ఐఐటి బాబా ( IIT BABA ) వైరల్ అవుతున్నాడు.
Also Read: Hardik Pandya Watch: పాక్ మ్యాచ్ లో ఖరీదైన వాచ్ తో పాండ్యా..ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ?
ఐఐటి బాబాను టార్గెట్ చేస్తూ టీమ్ ఇండియా ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. ఒరేయ్ ఐఐటి బాబా నువ్వు ఎక్కడ..? వెంటనే మా దగ్గరికి రా నీ ఆట కట్టిస్తాం అంటూ వార్నింగ్ ఇస్తున్నారు. అయితే దీనికి కారణం లేకపోలేదు. టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ ( Team India vs Pakistan ) మధ్య మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో ఒక్కరోజు ముందుగా… వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు ఐఐటి బాబా. దుబాయ్ వేదికగా జరగబోతున్న… టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లో రోహిత్ శర్మ సేన ఓడిపోతుందని ఐఐటి బాబా.
తాను చెప్పిందే జరుగుతుందని… దీన్ని ఎవరు ఆపబోరని కూడా తేల్చి చెప్పేశాడు. దీంతో ఐఐటి బాబా నిన్నటి నుంచి ట్రెండింగ్ లోనే ఉన్నాడు. అయితే ఆదివారం రోజున రాత్రి సీన్ రివర్స్ అయింది. మ్యాచ్ టీమిండియా సొంతమైంది. దీంతో… ఐఐటి బాబాను సోషల్ మీడియాలో ఒక ఆట ఆడుకుంటున్నారు టీమిండియా ఫ్యాన్స్. ఒరేయ్ టీమిండియా ఓడిపోతుంది అన్నావు కదా… ఇప్పుడు గెలిచాం అంటూ ఆగ్రహిస్తున్నారు. సోషల్ మీడియాలో… ఐఐటి బాబాను వేధిస్తున్నారు. మొన్న లైలా సినిమా సందర్భంగా పృథ్వీరాజును వైసీపీ నేతలు ఆడుకున్నట్లుగానే.. ఇప్పుడు ఐఐటీ బాబాను ఒక ఆట ఆడుకున్నారు. దీంతో దేశం వదిలి ఐఐటి బాబా పారిపోయాడని కూడా వార్తలు వస్తున్నాయి.
Also Read: Chiranjeevi in Ind vs Pak match: దుబాయ్ మ్యాచ్ కు చిరు, టీడీపీ నేతలు…అభిషేక్ శర్మతోనే సిట్టింగ్ !
ఇది ఇలా ఉండగా.. కుంభ మేళా నేపథ్యంలోనే… పాపులర్ అయ్యాడు ” ఐఐటి బాబా”. భవిష్యత్తు గురించి చాలా విషయాలు చెప్పి సోషల్ మీడియాలో వైరల్ గా మారారు.ఐఐటి బాబా అసలు పేరు అభయ్ సింగ్. ఇతని స్వస్థలం హర్యానా. ఇతడు చిన్నప్పటినుండే స్థానిక పాఠశాలలో అద్భుతంగా రాణించేవాడు. ఢిల్లీలో ఐఐటీకి సిద్ధమయ్యే వరకు అభయ్ అసాధారణ ప్రతిభావంతుడు. ఇతడికి ముంబై ఐఐటీలో సీటు లభించింది. దీంతో ఐఐటి ముంబైలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఈ క్రమంలో క్యాంపస్ ప్లేస్మెంట్ లోనే ఉద్యోగాన్ని సంపాదించాడు. అయితే కొంతకాలం వరకు కార్పొరేట్ లో పనిచేసిన అభయ్ సింగ్.. కొన్ని కారణాల వల్ల దాన్ని వదులుకున్నాడు. అనంతరం ఫోటోగ్రఫీ పై మక్కువతో అటువైపు దృష్టి సారించాడు. కానీ దాన్ని కూడా వదిలేసి 2019 లో కెనడా వెళ్లిపోయాడు. అక్కడ ఓ ప్రతిష్టాత్మక సంస్థలో పనిచేస్తూ ప్రతినెలా సుమారు 3 లక్షల వరకు సంపాదించేవాడు. కానీ అకస్మాత్తుగా జాబ్ వదిలేసి సన్యాసుల్లో కలిసిపోయాడు.
Agar IIT Baba ka tukka laag gya tou kuch log inhe apna bagwan bna lenge 😂 pic.twitter.com/sZPzRxsICe
— Mr. Neeraj (@NeerajS00964849) February 21, 2025