BigTV English

Rinku Singh : అది కావాలని చేయలేదు .. క్షమాపణలు చెప్పిన రింకూ సింగ్‌!

Rinku Singh : అది కావాలని చేయలేదు ..  క్షమాపణలు చెప్పిన రింకూ సింగ్‌!
Rinku Singh latest news

Rinku Singh news today(Sports news in telugu):

సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ 20లో రింకూసింగ్ కొట్టిన సిక్సర్ బాల్ వెళ్లి మీడియా బాక్స్ అద్దానికి తగలడంతో అది భళ్లుమని పగిలింది. నిజానికి బాల్ పైకి వెళ్లిన తర్వాత, దాని గమన వేగం తగ్గుతుంది. కానీ రింకూ కొట్టిన బాల్ వెళ్లడం, వెళ్లడమే అద్దం మీదకి వెళ్లింది. దాంతో ఆ వేగానికి అద్దం బద్దలైపోయింది. విషయం తెలిసిన వెంటనే రింకూ పేరు స్టేడియంలో మార్మోగిపోయింది.


కెప్టెన్ మార్క్‌రమ్ వేసిన 19వ ఓవర్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ఓవర్ చివరి రెండు బంతులును రింకూ సింగ్ రెండు భారీ సిక్సర్లుగా మలిచాడు. చివరి బంతిని స్ట్రైట్‌గా ఆడాడు. అదెళ్లెళ్లి సైట్ స్క్రీన్‌పై ఉన్న మీడియా బాక్స్ గ్లాస్‌ను బలంగా తాకడం, ఆ దెబ్బకు అది  పగిలిపోవడం క్షణాల్లో జరిగిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

మీడియా బాక్స్ కి తగలడం ఏమోగానీ, భారతదేశంలోని సోషల్ మీడియా నిండా ఇవే వార్తలు, ‘అద్దాలు బద్దలు కొట్టిన రింకూ సింగ్’అంటూ హెడ్డింగులు. అయితే రింకూ సింగ్ మెరుపు వేగంతో 39 బాల్స్ లో 68 పరుగులు చేశాడు. అందులో 2 సిక్స్ లు, 9 ఫోర్లు ఉన్నాయి. అయితే మ్యాచ్ కూడా గెలిచి ఉంటే బాగుండేదని అంటున్నారు.


ఈ సందర్బంగా రింకూ సింగ్ మాట్లాడుతూ అది నేను కావాలని చేయలేదు. అందుకు మీడియా బాక్స్ లో అందరికి సారీ చెబుతున్నానని అన్నాడు. ఆ బాల్ విషయమై తన మనో భావాలన్ని రింకూ వ్యక్తం చేశాడు. నేను బ్యాటింగ్ కి వచ్చేసరికి మూడు వికెట్లు పడి, పరిస్థితి కష్టంగా ఉందని రింకూ సింగ్ తెలిపాడు.

అప్పటికి కెప్టెన్ సూర్య క్రీజులో ఉండి, వికెట్ల గురించి ఆలోచించకుండా ఆడమని తెలిపాడు. మొదట్లో క్రీజులో నిలదొక్కుకోవడానికి కొంత సమయం తీసుకున్నాను. ఇంక తర్వాత రన్ రేట్ పెంచే క్రమంలో హిట్టింగ్ చేశా. అయితే ఒక బాల్ వెళ్లి అనూహ్యంగా స్టేడియంలోని మీడియా బాక్స్ అద్దానికి తగిలిందని అన్నారు.

ఇలా జరిగిందని క్రీజులో ఉన్నప్పుడు తెలీలేదని అన్నాడు. డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లిన తర్వాత సహచరులు చెప్పారు. నువ్వు కొట్టిన సిక్సర్ ఎంత దూరం వెళ్లింది? ఎంత పని చేసింది చెప్పారని అన్నాడు. మ్యాచ్ గెలిచి ఉంటే బాగుండేదని అన్నాడు.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×