IND vs AUS 1st Test: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో టీమిండియా భోణి కొట్టింది. మొదటి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా అదరగొట్టింది. ఆస్ట్రేలియా గడ్డపై కంగారులను మట్టి కరిపించింది టీమిండియా. ఈ తరుణంలోనే మొదటి టెస్ట్ మ్యాచ్ విజయం సాధించి… బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024లో పై ( bgt 2024) చేయి సాధించింది టీమిండియా.
ఈ మ్యాచ్లో ఏకంగా 295 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై ( australia) గ్రాండ్ విక్టరీ కొట్టింది టీమిండియా. 534 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో… విఫలమైంది ఆస్ట్రేలియా. ఈ తరుణంలోనే 238 పరుగులకు రెండవ ఇన్నింగ్స్ లో ఆల్ అవుట్ అయింది. హెడ్ (head ) 89 పరుగులు, మీచెల్ మార్షల్ 47 పరుగులు , అలెక్స్ 41 పరుగులు చేసినప్పటికీ… టీమ్ ఇండియా బౌలర్ల దాటికి… తట్టుకోలేకపోయారు కంగారులు. దీంతో టీమ్ ఇండియా (team india ) 295 పరుగులతో విక్టరీ కొట్టింది.
ఇక ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో… టీమిండియా కెప్టెన్ బుమ్రా ( bumrah )మూడు వికెట్లు తీశాడు. మహమ్మద్ సిరాజు 3 వికెట్లు తీసి దుమ్ము లేపాడు. వాషింగ్టన్ సుందర్ తన ఆల్ రౌండర్ ప్రదర్శనతో కంగారులను భయపెట్టాడు. రెండో ఇన్నింగ్స్ లో రెండు వికెట్లు పడగొట్టి… పర్వాలేదనిపించాడు. నితీష్ రెడ్డి అలాగే హర్షిత్ రానా చెరో ఒక వికెట్ తీశారు. అంటే ఈ మ్యాచ్లో… ఫాస్ట్ బౌలర్లదే హవా కొనసాగింది. అటు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్లు కూడా టీమిండియాను గజ గజ వనికించారు.ఇటు… టీమిండియా బౌలర్లు కూడా… దుమ్ము లేపారు. ఇక ఈ విజయంతో… ఐదు టెస్టుల సిరీస్లో… 1- 0 తేడాతో లీడింగ్ లోకి వచ్చింది టీమిండియా.
ఇక ఈ మ్యాచ్ లో… టీమిండియా నే మొదట టాస్ గెలిచింది. టాస్ నెగ్గిన కొత్త కెప్టెన్ బూమ్రా… మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. పిచ్ వివరాలు అడిగి తెలుసుకున్న బూమ్రా… మొదట బ్యాటింగ్ చేసేందుకే రెడీ అయ్యాడు. అయితే మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 150 పరుగులకు కుప్పకూలింది. టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్.. లో బ్యాటర్లందరూ చేతులెత్తేశారు. ఈ తరుణంలోనే 150 పరుగులకు ఆల్ అవుట్ అయింది టీమిండియా.
అయితే 150 పరుగులకు టీమిండి ఆల్ అవుట్ కావడంతో మ్యాచ్ ఓడిపోతారని అందరు అనుకున్నారు. కానీ ఆస్ట్రేలియా బ్యాటింగ్కు దిగిన తర్వాత టీమిండియా బౌలర్లో రెచ్చిపోయి బౌలింగ్ చేశారు. దీంతో 104 పరుగులకు మొదటి ఇన్నింగ్స్ లో ప్యాక్ అయింది ఆస్ట్రేలియా. ఇక రెండో ఇన్నింగ్స్ నుంచి సీన్ పూర్తిగా మారిపోయింది. మొదటి టెస్ట్ మ్యాచ్ మ్యాచ్ మొత్తం టీమ్ ఇండియా చేతిలోకి వచ్చేసింది. ఈ తరుణంలోనే.. రెండో ఇన్నింగ్స్ లో 487 పరుగులు చేసింది టీమిండియా.ఆర్ వికెట్లు నష్టపోయిన టీమ్ ఇండియా…487 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఇక అప్పటికే టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ 150 కి పైగా పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ కూడా చాలా రోజుల తర్వాత…. సెంచరీ చేసి అదర గొట్టాడు. ఇక అనంతరం… రెండవ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ దిగిన ఆస్ట్రేలియా… చేజింగ్ చేసే క్రమంలో ఓడిపోయింది.
Also Read: IPL Auction 2025: ఐపీఎల్ వేలంలో భారత క్రికెటర్లకు ఎదురు దెబ్బ.. ఈ ప్లేయర్లందరూ unsold