IPL Auction 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటుకు సంబంధించిన మెగా వేలం… కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నిన్న ప్రారంభమైన ఈ మెగా వేలం ( IPL Auction 2025) ఇవాళ కూడా కొనసాగుతోంది. అయితే రెండో రోజు.. మెగా వేలం ప్రారంభం కాగానే… కొంతమంది కీలక భారత ప్లేయర్లు.. Un sold లిస్టులోకి వెళ్లారు. మొన్నటి వరకు టీం ఇండియాకు సేవలు అందించిన ప్లేయర్లను కూడా ప్రాంచీలు కొనుగోలు చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదు.
Also Read: IPL Auction 2025: భువి, దీపక్ చాహర్ కు జాక్ పాట్
దీంతో… అజిక్య రహానే, శార్దుల్ ఠాకూర్, పృద్వి షా, మయాంక్ అగర్వాల్, లాంటి కీలక భారత ప్లేయర్లు అన్ సోల్డ్ లిస్టులోకి వెళ్లిపోయారు. వీరితోపాటు శ్రేయస్ గోపాల్, సీనియర్ బౌలర్ పియుష్ chawla, కార్తీక్ త్యాగి, యష్ దూల్, ks భరత్ లాంటి ప్లేయర్లను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించలేదు. దీంతో ఇకపై ఈ ప్లేయర్ లందరూ ఐపీఎల్ కు దూరం కాబోతున్నారు.
అదే సమయంలో విదేశీ క్రికెటర్లకు కూడా ఈ మెగా వేలంలో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. నిన్న డేవిడ్ వార్నర్ లాంటి ప్లేయర్ ఆన్ సోల్డ్ లిస్టు లోకి వెళ్ళగా…ఇవాళ మరి కొంతమంది ఆ లిస్టులోకి వెళ్లారు. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు మాజీ కెప్టెన్ కేన్ మామ ను ఈసారి ఎవరు కొనుగోలు చేయలేదు. డైరీల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, ను కొనుగోలు చేయలేదు.
ఇక అటు ఇవాళ… వేలంలో కొంతమంది ప్లేయర్లు భారీ ధర పలుకుతున్నారు. హార్దిక్ పాండ్యా సోదరుడు కృనాల్ పాండ్యా ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కొనుగోలు చేసింది. 5.75 కోట్లు పెట్టి మరి… అతని కొనుగోలు చేసింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. అలాగే మంచి ఊపులో ఉన్న పంజాబ్ కింగ్స్… మార్కో జాన్సన్ ను కొనేసింది. అతనికి ఏకంగా ఏడు కోట్లు పెట్టి మరి కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్.
Also Read: IPL Auction 2025: ఐపీఎల్ వేలంలో భారత క్రికెటర్లకు ఎదురు దెబ్బ.. ఈ ప్లేయర్లందరూ unsold
అటు టీమిండియా ఆల్రౌండర్ వాషింగ్టన్ కు కూడా మంచి ధర వచ్చింది. 3.2 కోట్లకు సుందర్ ను దక్కించుకుంది గుజరాత్ టైటాన్. ఇక అటు.. పంజాబ్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన శ్యామ్ కరణ్ ను చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. అతనికి 2.4 కోట్లు పెట్టి మరి కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. అటు డూప్లిసిస్ ను కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. కీలక ప్లేయర్లందర్నీ తక్కువ ధరకు కొనుగోలు చేయడంలో ఢిల్లీ… నిన్నటి నుంచి సక్సెస్ అవుతోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆర్సిబి కేప్టన్ డూప్లిసస్ ను కూడా రెండు కోట్లకు కొనుగోలు చేసింది.
ఇది ఇలా ఉండగా… మొదటి రోజు మెగా వేలంలో రిషబ్ పంత్ కు జాక్పాట్ తగిలింది. అతన్ని 27 కోట్లకు లక్నో గెల్చుకుంది. అంతేకాదు వచ్చే సీజన్లో అతనికి కెప్టెన్ కూడా ఇవ్వబోతుంది లక్నో. ఆ జట్టును వదిలి kl రాహుల్ బయటికి వెళ్లడంతో… పంత్ను కొనుగోలు చేసింది లక్నో యాజమాన్యం. శ్రేయస్ అయ్యర్ ను 26.75 కోట్లకు పంజాబ్ సొంతం చేసుకుంది.