IND vs AUS: టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఇవాల్టి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. తొలి వన్డే పెర్త్ వేదికగా ఇవాళ ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. అయితే ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా ఇప్పుడు కష్టాల్లో పడింది. అద్భుతంగా రాణిస్తారు అనుకున్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ అట్టర్ ఫ్లాప్ అయ్యారు. రోకో – రోకో అంటూ ఈ టోర్నమెంట్ కంటే ముందు బాగా జాకీలు లేపారు. కానీ రియాల్టీ లో మాత్రం కంగారుల ముందు ఈ ఇద్దరు ఆటగాళ్లు తోక ముడిచారు. రోహిత్ శర్మ కేవలం 8 పరుగులు చేస్తే, విరాట్ కోహ్లీ మాత్రం డకౌట్ అయ్యాడు. ఖాతా తెరవకముందే పెవీలియన్ కు వెళ్లిపోయాడు కోహ్లీ. దీంతో రోకో కాంబినేషన్ పై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది.
విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ ఇద్దరూ కూడా ఇవాల్టి మ్యాచ్ లో అత్యంత దారుణంగా విఫలమయ్యారు. 2027 వన్డే వరల్డ్ కప్ లో ఇద్దరు ప్లేయర్లు ఆడాలని ఫ్యాన్స్ అందరు కోరుకుంటున్న నేపథ్యంలో, వచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంది రోకో కాంబినేషన్. ఈ మ్యాచ్ లో 8 పరుగులకు రోహిత్ శర్మ స్లిప్ లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అటు విరాట్ కోహ్లీ ఏకంగా డక్ అవుట్ అయ్యాడు. దీంతో అభిమానులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆడతారనుకున్న ఇద్దరు ప్లేయర్లు ఇలా చేతులెత్తేయడం దారుణమని ఎమోషనల్ అవుతున్నారు. వీళ్లిద్దరు ఔట్ అయిన తర్వాత టీమిండియా కొత్త కెప్టెన్ శుభ్ మన్ గిల్ ఆదుకుంటాడు అనుకుంటే, అతను కూడా చేతులు దులిపేసుకున్నాడు. పది పరుగులు చేసి కీపర్ క్యాచ్ అవుతాడు గిల్. ఇక ప్రస్తుతం శ్రేయాస్ అయ్యర్ , అక్షర్ పటేల్ ఇద్దరూ బ్యాటింగ్ చేస్తున్నారు. వీళ్ళు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రెండుసార్లు వర్షం పడింది. దీంతో మ్యాచ్ అర్థంతరంగా ఆగిపోయింది.
టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న పెర్త్ వన్డే మ్యాచ్ లో వర్షం విలన్ గా మారింది. పదే పదే వర్షం అడ్డంకిగా మారి మ్యాచ్ కు అంతరాయం కలిగిస్తోంది. ఇప్పటికే రెండుసార్లు వర్షం పడగా మ్యాచ్ ఆగిపోయింది. వర్షం ఇలా పదేపదే పడడంతో టీమిండియా బ్యాటర్లకు చాలా ఇబ్బంది ఎదురవుతోంది. ఈ తరుణంలోనే వరుసగా మూడు వికెట్లు కోల్పోయింది టీమిండియా. ఇప్పటి వరకు 11.5 ఓవర్లు ఆడిన టీమిండియా మూడు వికెట్లు నష్టపోయి 37 పరుగులు మాత్రమే చేసింది. ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ ఆరు పరుగులతో బ్యాటింగ్ చేస్తుండగా అక్షర్ పటేల్ ఏడు పరుగులు సాధించాడు. ఇప్పుడు మళ్లీ వర్షం ఆగి మ్యాచ్ ప్రారంభమైన అయినా, మన బ్యాటర్లు కాస్త జాగ్రత్తగా ఆడాలి. లేకపోతే వరుసగా వికెట్లు పడే ప్రమాదం ఉంటుంది.
— Out Of Context Cricket (@GemsOfCricket) October 19, 2025
A nightmare start for India 💔
Rohit Sharma, Virat Kohli, and Shubman Gill dismissed early in the opening ODI.#AUSvIND #ROKO #ShubmanGill pic.twitter.com/Wn3NNkIAS3
— CricTracker (@Cricketracker) October 19, 2025