Ind vs Eng T20: ఇంగ్లాండ్ తో 5 టీ-20 ల సిరీస్ లో భాగంగా మొదటి టీ-20 లో విజయం సాధించిన భారత జట్టు ఇప్పుడు రెండవ టి-20 మ్యాచ్ లో కూడా సత్తా చాటేందుకు ఉవ్విల్లూరుతుంది. శనివారం రోజు చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా శనివారం భారత్ – ఇంగ్లాండ్ మధ్య రెండవ టి-20 పోటీ జరగబోతున్న సందర్భంలో భారత జట్టుకు ఊహించని షాక్ తగిలింది. మ్యాచ్ కి ముందు ఇద్దరు కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా జట్టుకు దూరమైనట్లు సమాచారం.
Also Read: Team India: ఘోర అవమానం.. జాతీయ గీతాన్ని పాడని ఆ ఇద్దరు టీమిండియా ప్లేయర్స్ ?
మొదటి టీ-20 లో జట్టును విజేతగా నిలిపిన భారత ఓపెనర్ అభిషేక్ శర్మ నెట్ సెషన్ లో క్యాచింగ్ డ్రిల్ సమయంలో తన చీలమండ భాగంలో గాయపడ్డట్లు సమాచారం. గాయం కారణంగా అభిషేక్ శర్మ నెట్స్ లో బ్యాటింగ్ చేయకుండానే డ్రెస్సింగ్ రూమ్ కి తిరిగి వెళ్ళాడు. ఫిజియోతో దాదాపు అరగంట సమయం గడిపిన తరువాత కొద్దిగా కుంటుతూ కనిపించాడు అభిషేక్ శర్మ.
ఇది అభిమానులను ఆందోళనకు గురిచేసింది. ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టెస్ట్ లోకి ఎంట్రీ ఇచ్చి, సెంచరీ తో చెలరేగిన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి.. ఇంగ్లాండ్ తో జరుగుతున్న 5 టీ-20 ల సిరీస్ లో కూడా ఎంపికయ్యాడు. అయితే ఇతడు కూడా తొలి టీ-20 తరువాత పక్కటెముకల గాయంతో బాధపడుతున్నట్లుగా స్కానింగ్ లో తేలింది. ఈ గాయం కారణంగా నితీష్ కుమార్ రెడ్డి మొత్తం సిరీస్ కి దూరం అయ్యాడు.
అతని స్థానంలో మరో ఆల్ రౌండర్ శివమ్ దుబేకి అవకాశం కల్పించారు. ప్రస్తుతం రంజీ ట్రోఫీలలో ఆడుతున్న శివం దుబే.. జమ్మూ కాశ్మీర్ తో జరిగిన మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ లలోను డకౌట్ అయ్యాడు. అయితే ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డికి గాయం కారణంగా దుబేకి జట్టులో చోటు దక్కింది. ఇక అభిషేక్ శర్మ అందుబాటులో లేకపోతే అతడికి స్థానంలో వాషింగ్టన్ సుందర్ లేదా దృవ్ జురెల్ ని జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.
Also Read: Champions Trophy 2025: రహస్యంగా పాకిస్థాన్ వెళ్లిన పాండ్యా.. అఫ్రిదితో ఫోటోలు ?
వీరిద్దరూ మాత్రమే కాదు రింకు సింగ్ కూడా గాయంతో బాధపడుతున్నారట. డ్రింకు సింగ్ వెన్నెముక సమస్యతో ఇంగ్లాండుతో జరగబోయే రెండు, మూడవ టి-20 లకు దూరం కానున్నాడు. రింకూ సింగ్ స్థానంలో రమణదీప్ సింగ్ కి చోటు కల్పించనున్నట్లు తెలుస్తోంది. నాలుగవ టి-20 కి రింకు సింగ్ తిరిగి జట్టులో కలుస్తాడని సెలక్టర్లు, బీసీసీఐ భావిస్తోంది. మొత్తానికి ఈ గాయాల బెడద భారత జట్టును ఇరకాటన పడేస్తోంది.
Rinku Singh sustained a low back spasm while fielding in the 1st T20I against England.#INDvsENG #RinkuSingh #CricketTwitter pic.twitter.com/69f7PhgtuP
— InsideSport (@InsideSportIND) January 25, 2025