IND VS ENG, 4Th Test: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్… రెండో రోజు ముగిసింది. రెండో రోజు ఆటలో టీమిండియా పై ఇంగ్లాండ్ టీం ఆధిపత్యాన్ని చెలాయించింది. ఏమాత్రం వెనుకడుగు వేయలేదు ఇంగ్లాండ్. ఈ నేపథ్యంలోనే ఇవాల్టి రోజున.. టీమిండియాను తక్కువ పరుగులకు కట్టడి చేసి మొదటి ఇన్నింగ్స్ లో ఆల్ అవుట్ చేసింది. నిన్న నాలుగు వికెట్లు తీసిన ఇంగ్లాండ్.. రెండో రోజు ఆటలో ఆల్ అవుట్ కూడా చేసింది. ఈ నేపథ్యంలోనే 358 పరుగులకు కుప్పకూలింది టీమిండియా.
పోరాడిన రిషబ్ పంత్.. టీమ్ ఇండియా స్కోర్ ఎంత అంటే
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ లో భారీ స్కోర్ చేసే అవకాశాన్ని టీమిండియా చేజేతులా పోగొట్టుకుంది. రెండో రోజు ఆటగాళ్లు పెద్దగా రాణించకపోవడంతో.. తొందరగానే ఆల్ అవుట్ అయింది టీమిండియా. మొదటి ఇన్నింగ్స్ లో 114 ఓవర్లు వాడిన టీమిండియా 358 పరుగులకు కుప్పకూలింది. నిన్న నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియా ఇవాళ 6 వికెట్లను కోల్పోవడం జరిగింది.
దీంతో 358 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్ 58 పరుగులు చేయక కేఎల్ రాహుల్ 46 పరుగులతో రాణించాడు. అలాగే సాయి సుదర్శన్ 61 పరుగులు చేయగా రిషబ్ పంత్ గాయమైనప్పటికీ 54 పరుగులతో దుమ్ము లేపాడు. ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా 20 పరుగులు చేయగా శార్దూల్ ఠాకూర్ 41 పరుగులు చేసి రఫ్పాడించాడు. వాషింగ్టన్ సుందర్ 27 పరుగులు చేసి తొందరగానే అవుట్ అయ్యాడు.
గాయమైనప్పటికీ బ్యాటింగ్ చేసిన పంత్
నాలుగో టెస్ట్ మొదటి రోజున… రిషబ్ పంత్ రిటైర్డ్ హర్ట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. 30 కి పైగా పరుగులు చేసిన రిషబ్ పంత్… గాయం కారణంగా ఆసుపత్రికి పాలయ్యాడు. అయితే ఇవాల్టి రోజున మళ్లీ గ్రౌండ్ కు వచ్చి బ్యాటింగ్ చేసే ప్రయత్నం చేశాడు రిషబ్ పంత్. ఈ నేపథ్యంలోనే ఇవాళ 75 బంతుల్లో 54 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇందులో రెండు సిక్సర్లతో పాటు మూడు బౌండరీలు ఉన్నాయి.
దూకుడుగా ఆడుతున్న ఇంగ్లాండ్
టీమిండియా ఆల్ అవుట్ కాగానే.. ఇంగ్లాండ్ ప్లేయర్లు దుమ్ము లేపుతున్నారు. ఇవాళ మొదటి ఇన్నింగ్స్ లో కేవలం రెండు వికెట్ల కోల్పోయిన ఇంగ్లాండ్ టీం.. భారీ స్కోర్ నమోదు చేసింది. ఇద్దరు ఓపెనర్లు జాక్ క్రాలి, బెన్ డక్కెట్ ఇద్దరూ దుమ్ము లేపారు. అలాగే ఇద్దరు కూడా సెంచరీ మిస్ చేసుకున్నారు. ముఖ్యంగా బెన్.. 94 పరుగులు చేసి అన్షుల్ కాంబోజ్ బౌలింగ్లో వికెట్ కోల్పోయాడు. అటు క్రాలి వికెట్ ను 84 పరుగుల వద్ద రవీంద్ర జడేజా వికట్ తీశాడు. ఇక రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండు 46 ఓవర్లు ఆడి రెండు వికెట్లు నష్టపోయి 225 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియన్ బీట్ చేయాలంటే మరో 133 పరుగులు చేయాల్సి ఉంది ఇంగ్లాండ్. ప్రస్తుతం ఓలిపోప్, జో రూట్… ఇద్దరు బ్యాటింగ్ చేస్తున్నారు.