E-Paper
Advertisement

Ind vs NZ 1st T20I: అక్ష‌ర్ ప‌టేల్ కు తీవ్ర ర‌క్త‌స్రావం, ఆస్ప‌త్రికి త‌ర‌లింపు..తొలి టీ20లో ఇండియా విక్ట‌రీ

Ind vs NZ 1st T20I: అక్ష‌ర్ ప‌టేల్ కు తీవ్ర ర‌క్త‌స్రావం, ఆస్ప‌త్రికి త‌ర‌లింపు..తొలి టీ20లో ఇండియా విక్ట‌రీ

Ind vs NZ 1st T20I: టీమిండియా వ‌ర్సెస్ న్యూజిలాండ్ ( India vs New Zealand, 1st T20I ) జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన తొలి టీ20 మ్యాచ్ లో సూర్య కుమార్ యాద‌వ్ సేన‌కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. టీమిండియా స్టార్ ఆల్ రౌండ‌ర్‌, వైస్ కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్ కు తీవ్ర గాయం అయింది. న్యూజిలాండ్ ప్లేయ‌ర్ డారిల్ మిచెల్ కొట్టిన భారీ షాట్ నేప‌థ్యంలో బంతిని ఆపేందుకు ప్ర‌య‌త్నించాడు వైస్ కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్. ఆ స‌మ‌యంలో అక్ష‌ర్ ప‌టేలే బౌలింగ్ చేశాడు. ఇక డారిల్ మిచెల్ కొట్టిన బంతిని ఆపబోగా, అక్ష‌ర్ ప‌టేల్ ( Axar Patel ) చేతికి తీవ్రమైన గాయం అయింది. ఈ త‌రుణంలోనే అక్ష‌ర్ ప‌టేల్ కు ర‌క్త స్రావం కూడా జ‌రిగింది. దీంతో వెంట‌నే గ్రౌండ్ ను వీడాడు. అక్ష‌ర్ ప‌టేల్ ను ( Axar Patel Injury ) ఆస్ప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు స‌మాచారం అందుతోంది. అక్ష‌ర్ ప‌టేల్ మ్యాచ్ మ‌ధ్య‌లోనే వెళ్లిపోవ‌డంతో అభిషేక్ శ‌ర్మ బౌలింగ్ చేశాడు. ఈ సంఘ‌ట‌న ఇప్పుడు టీమిండియాలో క‌ల‌క‌లం రేపుతోంది.

Also Read: Rinku Singh AI Video Controversy: దేవుళ్ల‌పై ఆ పోస్టులు…రింకు సింగ్ అరెస్ట్ కు రంగం సిద్ధం..అస‌లు ఏంటి ఈ వివాదం ?

తొలి టీ20లో ఇండియా విక్ట‌రీ

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( India vs New Zealand, 1st T20I) మధ్య ఇవాళ మొట్ట మొదటి టి20 జరిగిన సంగతి తెలిసిందే. నాగ్ పూర్ లోని విదర్భ క్రికెట్ స్టేడియం వేదికగా ( Vidarbha Cricket Association Stadium, Nagpur) ఈ మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ ల అద్భుతంగా రాణించిన టీమిండియా, గ్రాండ్ విక్టరీ కొట్టింది. బ్యాటింగ్ అలాగే బౌలింగ్ రెండు విభాగాలు అద్భుతంగా రాణించిన టీమిండియా ఏకంగా 48 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లు ఆడి ఏడు వికెట్ల నష్టానికి 238 పరుగులు సాధించింది. అయితే ఈ 239 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో… పోరాడి ఓడిపోయింది న్యూజిలాండ్. ఛేజింగ్ చేసే క్ర‌మంలో 20 ఓవ‌ర్లు ఆడిన న్యూజిలాండ్ 7 వికెట్ల న‌ష్టానికి 190 ప‌రుగులు సాధించింది. దీంతో 48 ప‌రుగుల తేడాతో ఓడింది న్యూజిలాండ్‌. దీంతో 5 టీ20ల సిరీస్ లో 1-0 తేడాతో టీమిండియాలో ( Team India ) లీడింగ్‌లోకి వ‌చ్చింది.

అభిషేక్ శ‌ర్మ తుఫాన్ ఇన్నింగ్స్‌

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి T20 మ్యాచ్ లో అభిషేక్ శర్మ ఇరగదీశాడు. ఎప్పటిలాగే సిక్సర్లు అలాగే బౌండర్లతో రెచ్చిపోయాడు అభిషేక్ శర్మ. ఈ మ్యాచ్ లో 35 బంతుల‌లోనే 85 పరుగులతో రఫ్పాడించాడు. ఇందులో ఎనిమిది సిక్సర్లు అలాగే ఐదు బౌండరీలు ఉన్నాయి. మొత్తం 240 స్ట్రైక్ రేటుతో న్యూజిలాండ్ కు చుక్కలు చూపించాడు అభిషేక్ శర్మ.

 

Also Read: Shoaib Malik Retirement: పాకిస్తాన్ కు ఎదురుదెబ్బ‌..PSL 2026 ప్రారంభాని కంటే ముందే షోయబ్ మాలిక్ రిటైర్మెంట్‌

 

?igsh=MThkZ3JiM21qMmZqeQ==

 

 

 

Related News

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Tanveer Ahmed: విరాట్ కోహ్లీ మ‌గాడైతే, పాకిస్తాన్ పిచ్ ల‌పై ఆడి చూపించాలి

లాహోర్ గ‌డ్డ‌పై విరాట్ కోహ్లీ ప్లకార్డులు…గూస్ బంప్స్ రావాల్సిందే

Big Stories

×