Ind vs Sa 1st Odi: మూడు వన్డేల సిరీస్ లో భాగంగా భారత్ – దక్షిణాఫ్రికా జట్ల మధ్య నేడు తొలి వన్డే జరుగుతుంది. ఝార్ఖండ్ రాజధాని రాంచి వేదికగా ఈ మొదటి వన్డే మ్యాచ్ కొనసాగుతోంది. ఈ మొదటి వన్డే లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ బ్యాటింగ్ కి దిగింది.
Also Read: Kohli – Rohit: అఫ్రిది రికార్డు బ్రేక్.. 352 సిక్సర్లతో రోహిత్ హిస్టరీ.. విరాట్ కోహ్లీ సెంచరీ
అయితే టాస్ విషయంలో భారత్ ఓ రికార్డును తన పేరిట నమోదు చేసుకుంది. వరుసగా 19 వన్డే మ్యాచ్ లలో ఓడిన జట్టుగా భారత్ నిలిచింది. 2023 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ నుండి ఇప్పటివరకు వన్డేలలో భారత్ టాస్ లు ఓడిపోతూనే వస్తుంది. ఈ టాస్ విషయంలో భారత్ తర్వాత రెండవ స్థానంలో నెదర్లాండ్ ఉంది. నెదర్ల్యాండ్ వరుసగా 11 వన్డే మ్యాచ్ లలో టాస్ ఓడింది.
తొలి వన్డేలో భారత్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 349 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ కి దిగిన భారత జట్టుకు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ {18} పరుగులు చేసి దూకుడుగా ఆడే క్రమంలో త్వరగా అవుట్ అయ్యాడు. చాలాకాలం తర్వాత వన్డేల్లో పునరాగమనం చేసిన యశస్వి జైష్వాల్.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కాస్త మెరుగ్గానే ఇన్నింగ్స్ ఆరంభించినప్పటికీ.. నిలకడగా ముందుకు సాగలేకపోయాడు. ఈ దశలో క్రీజ్ లోకి వచ్చిన విరాట్ కోహ్లీ – రోహిత్ శర్మ కలిసి ఇన్నింగ్స్ ని చక్కదిద్దారు.
సఫారీ బౌలర్లపై ఎదురు దాడికి దిగిన రో – కో లు.. స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. రోహిత్ శర్మ – విరాట్ కోహ్లీ కలిసి 109 బంతుల్లో 136 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. రోహిత్ శర్మ 51 బంతుల్లో 57 పరుగులు చేశాడు. ఇందులో 5 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. అయితే వన్డే క్రికెట్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన క్రికెటర్ గా వరల్డ్ రికార్డ్ సాధించాడు రోహిత్ శర్మ. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది పేరిట ఉన్న రికార్డ్ ని బ్రేక్ చేశాడు. రోహిత్ శర్మ అవుట్ అయిన తర్వాత భారత్ వెంట వెంటనే వికెట్లు కోల్పోయింది. రుతురాజ్ గైక్వాడ్ {8}, వాషింగ్టన్ సుందర్ {13} పరుగులకే పెవిలియన్ చేరారు. దీంతో జట్టుపై కాస్త ఒత్తిడి పడింది.
అయితే విరాట్ కోహ్లీ తన అనుభవాన్ని ఉపయోగించి మరో వికెట్ పడకుండా.. రాహుల్ తో కలిసి 76 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ఇక 120 బంతుల్లో 135 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ.. బర్గర్ బౌలింగ్ లో రికెల్టన్ కి క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ లో 11 ఫోర్లు, 7 సిక్స్ లు ఉన్నాయి. తద్వారా అంతర్జాతీయ క్రికెట్ లో తన 83వ సెంచరీని నమోదు చేశాడు. అలాగే వన్డేలలో విరాట్ కోహ్లీకి ఇది 52వ సెంచరీ. అనంతరం కేఎల్ రాహుల్ – రవీంద్ర జడేజా కలిసి 36 బంతుల్లో 65 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.
Also Read: Chew Gum: క్రికెటర్లు ఎందుకు బబుల్ గం నములుతారు.. దీని వెనుక ఇంత సీక్రెట్ ఉందా
ఈ క్రమంలో కేఎల్ రాహుల్ తన ఆఫ్ సెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు. అయితే 60 పరుగులు చేసిన కేఎల్ రాహుల్.. స్వీప్ షాట్ ఆడియో ప్రయత్నం చేసి కీపర్ చేతికి చిక్కాడు. ఇక రవీంద్ర జడేజా కూడా అద్భుతంగా రాణించాడు. 19 బంతుల్లో 32 పరుగులు చేసి చివరి ఓవర్ లో అవుట్ అయ్యాడు. జడేజా తర్వాత క్రీజ్ లోకి వచ్చిన అర్షదీప్ సింగ్.. తొలి బంతికే డక్ అవుట్ గా వెనుదిగాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో భారత జట్టు 8 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో జాన్సెన్ 2, బర్గర్ 2, బాష్ 2, బార్ట్ మాన్ 2 వికెట్లు పడగొట్టారు.