BigTV English
Advertisement

IND W vs ENG W T20 : గిల్ కోసం రంగంలోకి మహిళలు.. ఇక ఇంగ్లాండ్ కు చుక్కలే

IND W vs ENG W T20 : గిల్ కోసం రంగంలోకి మహిళలు.. ఇక ఇంగ్లాండ్ కు చుక్కలే

IND W vs ENG W T20 : ప్రస్తుతం టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మెన్స్ టెస్ట్ సిరీస్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. 5 టెస్ట్  మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ తొలి టెస్ట్ లో విజయం సాధించి కాస్త ముందంజలో ఉంది. తొలి ఇన్నింగ్స్ లో అద్భుత ఫామ్ కనబరిచిన టీమిండియా జట్టు రెండో ఇన్నింగ్స్ కేవలం కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ మాత్రమే సెంచరీలు చేశారు. మిగతా బ్యాటర్లు అంతా విఫలం చెందారు. తొలి ఇన్నింగ్స్ లో ఓపెనర్ జైస్వాల్, కెప్టెన్ గిల్, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ సెంచరీలు చేయడంతో భారత్ భారీ స్కోర్ చేసింది. వీరికి తగ్గట్టుగానే ఇంగ్లాండ్ కూడా అద్భుతంగా ఆడింది.


Also Read :  Vaibhav Suryavanshi : విరాట్ కోహ్లీకి మళ్ళీ అవమానం.. వైభవ్ కు 18 నెంబర్ జెర్సీ!

ఇంగ్లాండ్ ఉమెన్స్ కి చుక్కలే.. 


తాజాగా ఓ వార్త వైరల్ అవుతోంది. నూతన కెప్టెన్ శుబ్ మన్ గిల్ కోసం మహిళలు రంగంలోకి దిగారు. ఇక ఇవాళ ఇంగ్లాండ్ కి చుక్కలే అని పేర్కొంటున్నారు. భారత మెన్స్ జట్టు టెస్టుల్లో ఓడినా.. ఉమెన్స్ జట్టు ఇవాళ ఇంగ్లాండ్ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్ లో కచ్చితంగా భారత మహిళల జట్టు గెలుస్తుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మెన్స్ చేయలేని పని.. ఉమెన్స్ చేస్తారని ట్రోలింగ్స్ చేయడం గమనార్హం. ముఖ్యంగా టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ కొనసాగుతున్న నేపథ్యంలో మహిళలు కూడా.. ఇంగ్లాండ్ మహిళల జట్టుతో తలపడబోతున్నారు. ఇవాళ్టి నుంచి టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మహిళల జట్ల మధ్య టీ-20 సిరీస్ ఇవాళ ప్రారంభం కానుంది.

ఇదే తొలి టీ-20 సిరీస్

నాటింగ్ హోమ్ లోని ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. భారత కాలమానం ప్రకారం.. ఇవాళ రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. టీమిండియా ఉమెన్స్ జట్టుకు ఈ సంవత్సరంలో ఇదే మొదటి టీ-20 సిరీస్ కావడం గమనార్హం. వచ్చే ఏడాది టీ-20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ఈ ఐదు మ్యాచ్ ల సిరీస్ లో సత్తా చాటాలని టీమిండియా భావిస్తోంది. ఇక ఈ టీ 20 సిరీస్ సోనీ లీవ్ లో చూడవచ్చు. మరోవైపు జులై 02 నుంచి ఇంగ్లాండ్ తో మెన్స్ టెస్ట్ సీరిస్ జరుగనుంది. రెండో టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. ఓ వైపు మహిళల టీ-20 మ్యాచ్ లు, మరోవైపు మెన్స్ టెస్ట్ సిరీస్ అభిమానులకు పండుగ వాతావరణం నెలకొంది.

ఇంగ్లాండ్ మహిళల T-20 జట్టు : 

డాని వ్యాట్ -హడ్జ్, సోఫియా, డంక్లీ, నాట్ స్క్రైవర్-బ్రంట్ (కెప్టెన్), పైజ్ స్కోల్ ఫీల్డ్, అమీ జోన్స్ (వికెట్ కీపర్), ఆలీస్ కాప్సే, ఎమ్ ఆర్లాట్, చార్లీ డీన్, సోఫీ ఎక్లెస్టోన్, లిన్సే స్మిత్, లారెన్ బెల్.

భారత మహిళల T-20 జట్టు : 

స్మృతి మంధాన, యాస్తిక భాటియా, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమంజోత్ కౌర్, దీప్తి శర్మ, రాధా యాదవ్, శ్రీ చరణి, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్. 

Related News

Ind vs Aus, 1st T20: టాస్ గెలిచిన ఆసీస్.. బ్యాటింగ్ ఎవ‌రిదంటే

Suryakumar Yadav Mother: ఆస్ప‌త్రిలో శ్రేయాస్‌.. సూర్య కుమార్ త‌ల్లి సంచ‌ల‌న నిర్ణ‌యం

Bumrah-Harshit: ఒరేయ్ పిల్ల బ‌చ్చా.. అవేం బూట్లురా, హ‌ర్షిత్ రాణా ప‌రువు తీసిన బుమ్రా

Telugu Titans: ద‌క్షిణాఫ్రికాకు WTC, ఆర్సీబీకి IPL 2025, ఇక నెక్ట్స్ తెలుగు టైటాన్సే లోడింగ్‌

Telugu Titans: తెలుగు టైటాన్స్ అదిరిపోయే విజ‌యం.. కోచ్ కు క‌న్నీళ్లు ఆగ‌లేదు

Ind vs Aus, 1st T20: నేడే టీమిండియా, ఆసీస్ తొలి టీ20..హెడ్ వ‌ర్సెస్ అభిషేక్‌.. టైమింగ్స్‌, ఫ్రీగా ఎలా చూడాలంటే

Dhoni-Kohli: ఇండియాలో స్వేచ్ఛ‌గా తిరుగుతున్న‌ ధోని..కానీ ఫ్రీడమ్ లేద‌ని లండ‌న్ కు కోహ్లీ..!

IPL 2026: ముంబైలోకి నితీష్‌, ఇషాన్‌…SRHలోకి తిల‌క్ వ‌ర్మ‌,మ‌రో బౌల‌ర్ ?

Big Stories

×