Varshini murder case: భూపాలపల్లి జిల్లాలో యువతి వర్షణి హత్య కేసు కీలక మలుపులు తిరుగుతుంది. కన్నతల్లి కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తన సొంత కూతురి ప్రాణం తీశిందంటే విని నమ్మలేనంత షాక్‌కు గురి అవుతున్నారు ప్రజలు. ప్రియుడి మోజులో పడి భర్తతో పాటు తన సొంత కుమార్తెను కూడా దారుణంగా చంపిన ఘటన రాష్ట్రంలో ఇప్పుడు సంచలనంగా మారింది. మహిళా సంఘాల నేతలు, సామాజికవేత్తలు, స్థానిక ప్రజలు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా వేదికగా చోటుచేసుకున్న ఈ దారుణం కొన్ని రోజులుగా వార్తల హెడ్లైన్లలో నిలుస్తోంది. వర్షిణి అనే యువతి హత్య కేసును పోలీసులు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ప్రారంభ దశలో సహజ మరణం అనుకున్న ఈ ఘటన.. తర్వాత అనుమానాస్పద మలుపు తిరిగింది. దర్యాప్తులో ఒక్కొక్క క్లూ వెలుగులోకి రావడంతో అసలు దోషులపై పోలీసులు గట్టి ఆధారాలు సేకరించారు. యువతి వర్షిణి మృతిపై ఎట్టకేలకు పోలీసులు కీలక ఆధారాలు రాబట్టారు.
ALSO READ: CM Revanth Reddy: కల్వకుంట్ల కుటుంబం కాలం చెల్లిన నోట్లలాంటిది.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసిన విషయం బయటపడుతుందని కూతురు వర్షిణిని తల్లి కవిత కిరాతకంగా చంపింది. ప్రియుడు రాజ్ కుమార్ తో కలిసి జూన్ 25న భర్త కుమారస్వామిని హత్య చేసింది. తన భర్త అనారోగ్యంతో చనిపోయాడని నమ్మించి అంత్యక్రియలు కూడా పూర్తి చేసింది. అయితే కూతురుకు విషయం తెలియడంతో ప్రియుడితో కలిసి ఆగస్టు 3న కుమార్తెను చంపేసింది. కూతురు శవాన్ని ఫ్రిజ్ లో దాచిపెట్టి, కనిపించకుండా పోయిందని ప్రచారం చేసింది.
ALSO READ: Kavitha: బీఆర్ఎస్‌లో అవినీతి? ఆ బడా నేతల గుట్టు రట్టు చేసిన కవిత, త్వరలో మరికొందరి జాతకాలు?
ఆగస్టు 6వ తేదీన, చిట్యాల పోలీస్ స్టేషన్లో కూతురు కనపడట్లేదని ఫిర్యాదు చేసింది. కూతురు డెడ్ బాడీని ప్రియుడు రాజ్ కుమార్ తో కలిసి ఊరి చివర గుట్టల్లో పడేసింది. ఎవరూ గుర్తించకపోవడంతో తిరిగి డెడ్ బాడీని కాటారం శివారు అడవిలో పడేసి క్షుద్ర పూజల పేరు సీన్ క్రియేట్ చేసింది. వర్షిణి అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తులో డబుల్ మర్డర్ ను పోలీసులు చేధించారు. కప్పల కవిత, ఆమె ప్రియుడు రాజ్ కుమార్ ల పై హత్యకేసు నమోదు చేసి పోలీసులు రిమాండ్ కు తరలించారు.