RCB: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bangalore) జట్టు వివాదంలో చిక్కుకుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పై ( Royal Challengers Bangalore) హిందీ భాషను రుద్దుతున్నారని కర్ణాటకకు చెందిన కొంత మంది అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ మెగా వేళానికంటే ముందే… కర్ణాటక కు చెందిన క్రికెటర్లను మెగా వేలంలో కొనుగోలు చేయాలని..అక్కడి అభిమానులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే డిమాండ్ ను తెరపైకి తీసుకువచ్చింది.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ( Karnataka Chief Minister Siddaramaiah ), డిప్యూటీ ముఖ్యమంత్రి డికె శివకుమార్ ( Deputy Chief Minister DK Shivakumar ) లాంటి నేతలు సైతం… లోకల్ ప్లేయర్లను ఆర్సిబి జట్టులో ఆడించాలని డిమాండ్ వినిపించారు. కానీ మెగా వేలం మొన్న జరిగినప్పుడు.. పెద్దగా కర్ణాటక ప్లేయర్లను తీసుకోలేదు ఆర్సిబి యాజమాన్యం. అయితే ఈ వివాదం.. ముగియకముందే ఆర్సిబి జట్టుపై మరో వివాదం తెరపైకి వచ్చింది. మొన్నటి వరకు కన్నడ భాషకు సంబంధించిన ట్విట్టర్ హ్యాండిలే మెయింటైన్ చేసేవారు.
Also Read: BCCI – Mohammed Shami: టీమిండియా బౌలర్ షమీకి షాక్.. బీసీసీఐ డెడ్ లైన్ విధింపు?
ఇప్పుడు కొత్తగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ( Royal Challengers Bangalore) హిందీ ట్విట్టర్ ను కూడా సృష్టించారు. ఇప్పుడు ఇదే కర్ణాటక అభిమానులకు కోపం తెప్పిస్తోంది. మొదటినుంచి కర్ణాటక ప్రజలు తమ కన్నడ భాష పై ప్రత్యేక చొరవ చూపిస్తారు. ఏదైనా తమ కన్నడ భాషలో ఉండేలా నిత్యం చూసుకుంటారు. అలాంటిది ఆర్సిబి జట్టులో హిందీ భాషను రుద్దుతున్నారని… ఇప్పుడు కొత్తగా మండిపడుతున్నారు కర్ణాటక అభిమానులు. ఆర్ సి బి జట్టును బ్యాన్ చేయాలని కూడా కొంత మంది డిమాండ్ చేస్తున్నారు.
ప్రాంతీయ క్రికెటర్లను తీసుకోవడమే కాకుండా ప్రాంతీయ భాషకు అన్యాయం చేస్తున్నారని… వెంటనే ఆ ట్విట్టర్ హ్యాండిల్ ను డిలీట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనిపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు యాజమాన్యం ఇంకా స్పందించలేదు. ప్రస్తుతం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bangalore) హిందీ ట్విట్టర్ హ్యాండిల్ అకౌంట్ కు… 25 వేల మంది ఫాలోయింగ్ ఉన్నారు. మరి.. కర్ణాటక రాష్ట్రంలో హిందీ ట్విట్టర్ అకౌంట్ పై వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ( Royal Challengers Bangalore) ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Also Read: Young Cricketer Died: మహారాష్ట్రలో విషాదం.. గుండెపోటుతో క్రికెటర్ మృతి !
ఇది ఇలా ఉండగా మొన్న జరిగిన మెగా వేలంలో… భువనేశ్వర్ కుమార్, లివింగ్ స్టోన్ లాంటి కీలక ప్లేయర్లను తీసుకుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు.
पेश है धुरंधरों से सजी आईपीएल 2️⃣0️⃣2️⃣5️⃣ की हमारी दमदार टीम! ❤️🔥#PlayBold #IPL2025 #IPLAuction #BidForBold #RCB #Hindi #Explore pic.twitter.com/R3ZbmmDRAZ
— Royal Challengers Bengaluru Hindi (@RCBinHindi) November 25, 2024