BigTV English

Young Cricketer Died: మహారాష్ట్రలో విషాదం.. గుండెపోటుతో క్రికెటర్ మృతి !

Young Cricketer Died: మహారాష్ట్రలో విషాదం.. గుండెపోటుతో క్రికెటర్ మృతి !

Young Cricketer Died: మహారాష్ట్ర క్రికెట్లో ( Maharashtra cricket ) పెను విషాదం చోటుచేసుకుంది.తాజాగా గుండపడుతో ఒక క్రికెటర్ మరణించడం జరిగింది. ఈ సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. గుండెపోటుతో క్రికెటర్ ( Maharashtra young cricketer ) మరణించిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్రలోని చత్రపతి శంభాజీ నగర్ లో… ఉన్నపలంగా మరణించాడు. ఇమ్రాన్ పటేల్ ( Imran Patel) అనే 35 సంవత్సరాల క్రికెటర్… మ్యాచ్ ఆడుతుండగా కుప్పకూలాడు.


also read: BCCI – Mohammed Shami: టీమిండియా బౌలర్ షమీకి షాక్.. బీసీసీఐ డెడ్ లైన్ విధింపు?

ఇమ్రాన్ పటేల్ కు…గుండెపోటు వచ్చినట్లు సమాచారం అందుతుంది.అయితే క్రికెట్ ఆడుతున్న సమయంలోనే అతనికి గుండెపోటు వచ్చిందట.దీంతో… ఒక్కసారిగా గ్రౌండ్ లోనే కుప్పకూలాడట ఇమ్రాన్ పటేల్ ( Imran Patel). అయితే.. అతని వెంటనే ఆసుపత్రికి…తరలించగా…అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది అని సమాచారం. దీంతో మహారాష్ట్ర క్రికెట్లో తీవ్ర విషాదం నెలకొంది.


వాస్తవంగా… గురువారం రోజున ఈ సంఘటన జరిగినట్లు చెబుతున్నారు. మహారాష్ట్రలో ( Maharashtra ) ఉన్న గార్వేర్ స్టేడియంలో..చిన్న లీగ్ మ్యాచ్లు జరుగుతున్నాయట. ఈ తరుణంలోనే… ఇమ్రాన్ పటేల్ కూడా ఈ లీగ్ మ్యాచ్లో పాల్గొన్నాడట. మ్యాచ్ జరిగిన ప్రతిసారి ఇమ్రాన్ పటేల్ ఓపెనింగ్ బ్యాటింగ్ చేస్తాడట. ఈ తరుణంలోనే తాజాగా జరిగిన మ్యాచ్ లో కూడా ఓపెనింగ్కు దిగాడట ఇమ్రాన్ పటేల్.

అయితే అదే సమయంలో కొన్ని ఓవర్ల పాటు బ్యాటింగ్ కూడా చేశాడట. బ్యాటింగ్కు దిగిన మొదటి నుంచి… చాతిలో నొప్పిగా ఉందని పదేపదే అంపార్లకు చెప్పాడట ఇమ్రాన్ పటేల్. ఆ తర్వాత ఒకసారి గా కుప్పకూలినట్లు చెబుతున్నారు. మ్యాచ్లో దాదాపు 5 ఓవర్లు పూర్తి అయిన తర్వాత చెస్ట్ అలాగే లెఫ్ట్ ఆర్మ్ లో… తీవ్రమైన నొప్పిగా ఉందని.. గట్టిగా అరిచాడట.. ఆ తర్వాత క్షణాల్లోనే గుండెపోటు రావడంతో కుప్పకూలాడట ఇమ్రాన్ పటేల్.

పెవిలియన్ కు వెళ్తూ.. ఈ సంఘటన జరిగినట్లు చెబుతున్నారు. వెంటనే అతన్ని అక్కడే ఉన్న మ్యాచ్ నిర్వాహకులు… ఆసుపత్రికి తరలించారు. అదే ఆసుపత్రి కాస్త దూరం ఉండడంతో ఆలస్యమైందట. దీంతో ఆసుపత్రికి వెళ్లిన తర్వాత చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారని సమాచారం. ఇక ఆ క్రికెటర్ ఇమ్రాన్ పటేల్ కు ( Imran Patel) భార్య అలాగే ముగ్గురు కూతుర్లు ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో ఆ కుటుంబంతో పాటు మహారాష్ట్ర క్రికెట్ లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: Rishabh Pant IPL Salary: రిషబ్ పంత్ కు షాక్.. రూ. 27 కోట్లలో భారీ కోత..40 శాతం పోతాయి?

ఇది ఇలా ఉండగా… మహారాష్ట్ర యంగ్ క్రికెటర్ ఇమ్రాన్ పటేల్ మరణం పట్ల… ఆ రాష్ట్రానికి చెందిన పలువురు సీనియర్ క్రికెటర్లు సంతాపం తెలుపుతున్నారు. ఇక ఈ సంఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని… దర్యాప్తు కూడా చేస్తున్నారు. నిజంగా ఇది గుండెపోటా లేక ఇతర సమస్యల కారణంగా మరణించాడా ? అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Related News

Asia Cup 2025 : బంగ్లా చిత్తు… ఫైనల్ కు పాకిస్తాన్.. టీమిండియాతో బిగ్ ఫైట్

PAK Vs BAN : పాకిస్తాన్ కి షాక్.. బంగ్లాదేశ్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs BAN : ఇండియానా… అదెక్కడుంది? బంగ్లాదేశ్ అభిమాని ఓవరాక్షన్

PAK Vs BAN : టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

Smriti Mandana : స్మృతి మంధానకు ఘోర అవమానం… ఆ ఫోటోలు వైరల్ చేసి!

Abhimanyu Easwaran : 25 సెంచరీలు, 30 అర్థ శతకాలు చేసినా ఛాన్స్ దక్కడం లేదు…అభిమన్యు ఏం పాపం చేశాడు రా !

Inzamam-ul-Haq : అభిషేక్ శర్మ బ్యాట్ లో చిప్స్.. అందుకే దారుణంగా ఆడుతున్నాడు

Asia Cup 2025 : అభిషేక్ శర్మ రనౌట్… దుబాయ్ స్టేడియంలో ఏడ్చేసిన లేడీ

Big Stories

×