E-Paper
Advertisement

IND VS BAN: కొంప‌ముంచిన వ‌ర్షం…బంగ్లాదేశ్ పై టీమిండియా విజ‌యం

IND VS BAN: కొంప‌ముంచిన వ‌ర్షం…బంగ్లాదేశ్ పై టీమిండియా విజ‌యం
Advertisement

IND VS BAN: ఐసీసీ అండర్ 19 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ ( ICC Under 19 World Cup 2026 ) నేపథ్యంలో టీమిండియా ( India U19 ) మరో విజయాన్ని నమోదు చేసుకుంది. బంగ్లాదేశ్ అండర్ 19 జట్టు పైన (Bangladesh U19 ) ఏకంగా 18 పరుగులు తేడాతో విజయం సాధించిన టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ లీగ్ దశలో జరిగిన మ్యాచ్ లో డక్ వర్క్ లూయిస్ ( Duckworth–Lewis–Stern method ) పద్ధతి ప్రకారం బంగ్లాదేశ్ పై అండర్ 19 టీమ్ ఇండియా విజయం సాధించింది. 238 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. బంగ్లాదేశ్ చేతులు ఎత్తేసింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో ఓవర్లు కుదించారు. దీంతో టీమ్ ఇండియా సులభంగా విజయం సాధించింది.

Also Read: Babar Azam-Steve Smith: బాబర్ ఆజాంకు స్ట్రైక్ ఇవ్వకుండా పరువు తీసిన స్మిత్..బ్యాట్ నెల‌కొట్టి రెచ్చిపోయిన పాక్ బ్యాట‌ర్‌

కొంప‌ముంచిన వ‌ర్షం…బంగ్లాదేశ్ పై టీమిండియా విజ‌యం

Advertisement

ఐసీసీ అండర్ 19 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ జింబాబ్వే లోని బులవాయే క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా బంగ్లాదేశ్ అండర్ 19 వర్సెస్ టీమ్ ఇండియా అండర్ 19 జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. గ్రూప్ స్టేజి లో భాగంగా జరిగిన ఈ ఏడవ మ్యాచ్ లో డక్ వర్క్ లూయిస్ పద్ధతి ప్రకారం 18 పరుగుల తేడాతో విజయం సాధించింది అండర్ 19 టీమిండియా. ఈ మ్యాచ్ లో టీమిండియా మొదట బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా 48.4 ఓవర్లు వాడిన టీమ్ ఇండియా అండర్ 19 జట్టు 10 వికెట్లు నష్టపోయి 238 పరుగులు సాధించింది. ఈ మ్యాచ్ లో 14 సంవత్సరాల వైభవ్ సూర్య వంశీ 67 బంతులలో 72 పరుగులతో రాణించాడు. అభిజ్ఞాన్ కుందు ఈ మ్యాచ్ లో 112 బంతుల్లో 80 పరుగులతో రాణించాడు. దీంతో టీమిండియా 238 పరుగులు సాధించగలిగింది.

Advertisement

అయితే ఈ మ్యాచ్ లో రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ అండర్ 19 ku పదే పదే వర్షం అడ్డంకీ గా మారింది. వర్షం పడిన నేపథ్యంలో టార్గెట్ ను 165 పరుగులకు కుదించారు. ఈ టార్గెట్ ను కూడా 29 ఓవర్లలో చేదించాలి. కానీ బంగ్లాదేశ్ మాత్రం చేతులెత్తేసింది. 28.3 ఓవర్లలో 148 పరుగులకు అండర్ 19 బంగ్లాదేశ్ ఆల్ అవుట్ అయింది. దీంతో టీమ్ ఇండియా 18 పరుగులతో విజయం సాధించింది.

పాయింట్ల పట్టికలో దూసుకు వెళ్తున్న టీమిండియా

ఐసీసీ అండర్ 19 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( ICC Under 19 World Cup 2026 ) నేపథ్యంలో టీమిండియా దూసుకు వెళ్తోంది. మొదట యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జట్టుపై (United States of America team ) విజయం సాధించిన టీమిండియా ఇవాళ బంగ్లాదేశ్ పై విజయం సాధించింది. దీంతో గ్రూప్ ఏ లో నాలుగు పాయింట్లు సాధించిన టీమిండియా మొదటి స్థానంలో నిలిచింది. మరో మ్యాచ్ గెలిస్తే సూపర్ సిక్స్ లోకి దూసుకు వెళ్లనుంది టీమిండియా అండర్ 19 టీం.

Also Read: Rohit-Gambhir: రోహిత్ శర్మ కెప్టెన్సీ పోయేలా చేసింది గంభీరే..వాడు పెద్ద‌ దుర్మార్గుడు..మాజీ క్రికెట‌ర్ సంచ‌ల‌నం

 

 

 

 

Related News

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

Big Stories

Advertisement
×