IND vs AUS 3rd Test: డ్రాగా బ్రిస్బేన్ టెస్టు ( Brisbane Test )..ముగిసింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో ( Border Gavaskar Trophy ) భాగంగా బ్రిస్బేన్ వేదికగా…. టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా ( Australia ) మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో టీమిండియా కు ( Team India) భారీ ఊరట లభించింది. ఓడిపోవాల్సిన మ్యాచ్ వరుణుడి కారణంగా… టీమిండియా ( Team India) వర్సెస్ ఆస్ట్రేలియా ( Australia ) మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది.
Also Read: Ind vs Aus 3rd Test: లంచ్ బ్రేక్‌ను ముందే ప్రకటించిన అంపైర్లు.. గబ్బాలో టెన్షన్.. టెన్షన్ !
వర్షం పడకపోయి ఉంటే.. ఈ మ్యాచ్ లో టీమిండియాకు ( Team India) కష్టాలు తప్పేవి కాదు. దీంతో 5 టెస్టుల మ్యాచ్ సిరీస్ 1-1 తేడాతో సమం అయింది. ఇవాళ ఉదయం నుంచి వర్షం పడింది. అలాగే… బ్యాడ్ లైట్ కారణంగా అంపైర్లు డ్రాగా ప్రకటించారు. వర్షం కారణంగా చివరి రోజు రెండు సెషన్ల ఆట రద్దు అయిన సంగతి తెలిసిందే. ఇవాళ కూడా వర్షం పడింది. దీంతో చేసేది ఏమీ లేక డ్రాగా ప్రకటించారు. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో 1-1తో సమం అయింది.
ఇది ఇలా ఉండగా… ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు… 445 పరుగులు చేసింది. భారత బౌలర్లను… దీటుగా ఎదుర్కొన్న ఆస్ట్రేలియా జట్టు… 400కు పైగా స్కోర్ చేయగలిగింది. ఇందులో ముఖ్యంగా టీమిండియా కు శనిలా మారిన హెడ్… 150 పరుగులు చేశాడు. ఎక్కడ టీమిండియా బౌలర్లకు ఛాన్స్ ఇవ్వకుండా దుమ్ము లేపాడు.
Also Read: Kohli – Gambhir: కోహ్లీ, గంభీర్ పై సెలబ్రేషన్స్… టీమిండియా ఫ్యాన్స్ సీరియస్?
అటు స్టీవెన్ స్మిత్ తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఇద్దరు వికెట్లు పడిన తర్వాత… ఆస్ట్రేలియా తొందరగానే ఆల్ అవుట్ అయింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా… వికెట్లను త్వరగానే పోగొట్టుకుంది. దీంతో తక్కువ స్కోరుకే… టీమిండియా ఆల్ అవుట్ కావడం జరిగింది. టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో.. 260 పరుగులకు… ఆల్ అవుట్ అయింది. ఇందులో… కేఎల్ రాహుల్… 84 పరుగులు చేసి రాణించాడు. అటు ఆకాష్ దీప్ తో పాటు టీమ్ ఇండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అద్భుతంగా ఆడి టీమిండియా కు ఫాలో ఆన్ తప్పించారు.
ఇక అనంతరం ఆస్ట్రేలియా జట్టు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. రెండో ఇన్నింగ్స్ కంటే.. ముందే 185 పరుగులు ఆస్ట్రేలియా జట్టు చేతిలో ఉన్నాయి. దీంతో రెండో ఇన్నింగ్స్ లో ఫాస్ట్ గా ఆడే ప్రయత్నం చేసింది ఆసీస్. ఈ తరుణంలోనే…. 89 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది. అనంతరం మ్యాచ్ డిక్లేర్ చేశారు. అనంతరం వర్షం, బ్యాడ్ లైట్ ఇష్యూ వచ్చింది. దీంతో రెండో ఇన్నింగ్స్ లో 8 పరుగులు చేసింది టీమిండియా. ఇంకేముందు.. మ్యాచ్ డ్రాగా ప్రకటించారు. ఇక మరో రెండు టెస్టులు ఈ టోర్నీలో మిగిలి ఉన్నాయి.