Mitchell Santner Captancy: న్యూజిలాండ్ క్రికెట్ బోర్డ్ ఆ దేశ జట్టుకు కొత్త సారధి {Mitchell Santner Captancy} ని ఎంపిక చేసింది. 2022లో టెస్ట్ కెప్టెన్సీని వదిలేస్తున్నట్లు న్యూజిలాండ్ సీనియర్ ప్లేయర్ టీమ్ సౌదీ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఆ తరువాత కేన్ విలియమ్ సన్ జట్టుపగ్గాలు అందుకున్నాడు. సౌధీ కివీస్ కి 14 టెస్టులలో సారథిగా వ్యవహరించాడు. వీటిలో ఆరు మ్యాచ్ లలో జట్టుని గెలిపించాడు. ఇక సౌధీ కెప్టెన్సీ బాధ్యతలనుంచి తప్పుకున్నాక.. విలియమ్సన్ ఆ బాధ్యతలు చేపట్టాడు.
Also Read: Kohli – Gambhir: కోహ్లీ, గంభీర్ పై సెలబ్రేషన్స్… టీమిండియా ఫ్యాన్స్ సీరియస్?
ఇదిలా ఉంటే.. తాజాగా సొంతగడ్డపై ఇంగ్లాండ్ తో జరిగిన మూడవ టెస్ట్ లోనూ న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. తన కెరీర్ చివరి టెస్ట్ ఆడిన స్టార్ పేసర్ టీమ్ సౌధీకి న్యూజిలాండ్ జట్టు ఘన విజయంతో వీడ్కోలు పలికింది. ఈ గెలుపుతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్స్ టేబుల్ లో న్యూజిలాండ్ నాలుగో స్థానానికి చేరింది. ఓటమితో ఇంగ్లాండ్ ఆరవ ప్లేస్ కి పడిపోయింది. ఇక శ్రీలంక 5వ స్థానంలో కొనసాగుతుండగా.. టాప్ 3 లో సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, భారత్ తలపడుతున్నాయి.
దీంతో ఇప్పుడు న్యూజిలాండ్ జట్టుకి వన్డే మరియు టి-20 ఫార్మాట్లకి సారథ్యం వహించే బాధ్యతలను మిచెల్ సాంట్నర్ {Mitchell Santner Captancy} కి అప్పగించింది న్యూజిలాండ్ క్రికెట్ బోర్డ్. ఈ ఏడాది ప్రారంభంలో సాంట్నర్ 24 టీ – 20 లు, నాలుగు వన్డేలకు కెప్టెన్ గా వ్యవహరించాడు. సాంట్నర్ కి టి-20 జట్టుకు నాయకత్వం వహించిన అనుభవం చాలా ఉంది. అంతేకాకుండా ఇటీవల పూణేలో భారత్ తో హామిల్టన్ వేదికగా జరిగిన మ్యాచ్ లో సాంట్నర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ప్రదర్శనతో మెరిశాడు. ఇక ఇటీవల జరిగిన ఇండియన్ ప్రీమియర్ 2025 మెగా వేలంలోనూ ఈ న్యూజిలాండ్ స్టార్ ఆల్ రౌండర్ సాంట్నర్ ని ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు రెండు కోట్లకు విక్రయించింది.
Also Read: Prithvi Shaw: సాయి బాబా.. నేను ఇంకేం చేయాలి.. పృథ్వి షా ఎమోషనల్ పోస్ట్!
32 ఏళ్ల ఈ న్యూజిలాండ్ స్టార్ ఆల్ రౌండర్ {Mitchell Santner Captancy} ఇప్పటివరకు 213 వైట్ బాల్ అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడాడు. వీటిలో అతను తాత్కాలికంగా 24 టి20 లు, నాలుగు వన్డేలకు కెప్టెన్ గా వ్యవహరించాడు. అయితే తనకు కెప్టెన్ గా బాధ్యతలు అప్పగించడంపై సాంట్నర్ స్పందిస్తూ.. “నాకు చాలా గౌరవంగా ఉంది. నేను చిన్నప్పటినుండి న్యూజిలాండ్ క్రికెట్ జట్టులో ఆడాలని కలలుకనేవాన్ని. ఇప్పుడు కెప్టెన్ గా రెండు ఫార్మాట్లలో జట్టును నడిపించే అవకాశం దక్కడం సంతోషంగా ఉంది. ఇది నాకు ఒక కొత్త సవాల్ లాంటిది. వైట్ బాల్ క్రికెట్ లో నా జట్టు నువ్వు ముందుకు తీసుకు వెళ్లడానికి కృషి చేస్తాను” అని చెప్పుకొచ్చాడు. మరి మిచల్ సాంట్నర్ నాయకత్వంలో న్యూజిలాండ్ జట్టు ఏ మేరకు రాణిస్తుందనేది వేచి చూడాలి.