Big Stories

Nagababu About Varun Tej: రిస్క్ తీసుకుని వరుణ్ ఫెయిల్ అయ్యాడు: నాగబాబు

 

- Advertisement -

- Advertisement -

Mega brother Nagababu About Varun Tej in : ఇండియన్ ఎయిర్ ఫైలట్ గా మెగాబ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ యాక్ట్ చేసిన లెటెస్ట్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్ . ఈ మూవీలో వరుణ్ సరసన మానుషి చిల్లర్ నటిస్తోంది. శక్తి ప్రతాప్ సింగ్ హడా ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. మార్చి 1న ఈ మూవీ రిలీజై.. ఆడియెన్స్ ముందుకు రానుంది.ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఆదివారం సాయంత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. ఈ ఈవెంట్ కి వరుణ్ తండ్రి నాగబాబు అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్బంగా నాగబాబు తన పుత్రరత్నం వరుణ్ గురించి మాట్లాడుతూ.. కొత్తదనంతో నిండిన మూవీస్ చేయాలని అనుకుంటాడు వరుణ్. అందుకు తగ్గట్టుగానే రిస్క్ తీసుకుంటాడు. ఈ క్రమంలో చాలాసార్లు ఫెయిల్ అయ్యాడు. కానీ..స్టోరీలు, రోల్స్ ఎంపిక విషయంలో వరుణ్ నాకు ఎంతగానో నచ్చుతాడు. ప్రతి తండ్రికి తన కొడుకు విజయం సాధిస్తే ఎంత ఆనందం ఉంటుందో.. పరాజయం పొందినప్పుడు కూడా అంతే బాధ ఉంటుంది. నా బాధ తనకు, తన బాధ నాకు తెలుసు. తనకు మంచి పర్సనాలిటీ ఉంది. కొన్ని క్యారెక్టర్ల విషయంలో ఇలాంటి కటౌట్ ఉన్నవారు పెద్దగా ఫెర్పామెన్స్ చేయకుండా నిల్చున్నా చూసేందుకు బాగుంటుంది. జయాపజయాలకు అతీతంగా తను ముందుకెళ్లాలని కోరుకుంటున్నా. ఒక్కోసారి మంచి ప్రయత్నాలు కూడా ఫెయిల్ అవుతాయి. దిగులు పడొద్దు. ప్రయత్నాలు చేస్తూ వెళ్తుంటే లైఫ్ లో అత్యున్నత స్థాయికి వెళుతారని అన్నారు.

Also Read: ప్రముఖ గాయకుడు పంకజ్ ఉధాస్ కన్నుమూత..

“నా పిల్లలు, అందరి బిడ్డలు బాగుండాలి. దేశ సరిహద్దుల్లో ఉండే సైనికులు బాగుండాలని.. మా అమ్మ దైవాన్ని ప్రార్థిస్తుంది. మా అమ్మ వాళ్ళ నాన్న, మేనమామ, మా పెద్దనాన్న మిలటరీలో పనిచేశారు. టెక్నాలజీ లేని ఆ రోజుల్లో పరిస్థితి ఎలా ఉండేదో పెద్దనాన్న చెప్పేవారు. యుద్దంలో ఎయిర్ ఫోర్స్ వారు ముందుగా ఎటాక్ చేస్తుంటారు. 1965 పాకిస్థాన్ వార్ సమయంలో అత్యాధునిక రాడార్ ని అమెరికా ఆ దేశానికి అందించింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన అలీ బ్రదర్స్ సాహసోపేతంగా ఆ రాడార్ ని ధ్వంసం చేశారు. 1962 చైనా వార్ లో మన ఆర్మీ తెగువకు చూసి చైనా ఆర్మీ ప్రశంసల వర్షం కురిపించింది” అని నాగబాబు పేర్కొన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News