Kho Kho World Cup final: మహిళల ఖో ఖో వరల్డ్ కప్ ( Kho Kho World Cup ) విజేతగా టీమిండియా నిలిచింది. ఇవాళ జరిగిన ఫైనల్ మ్యాచ్ లో మహిళల టీమ్ ఇండియా జట్టు… అఖండ విజయాన్ని నమోదు చేసుకొని తొలిసారి ఛాంపియన్ గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో నేపాల్ జట్టు పైన విజయం సాధించిన టీమిండియా… ఛాంపియన్ గా అవతరించింది.
Also Read: ICC U19 Women’s T20 World Cup: ఖాతా తెరిచిన టీమిండియా.. విండీస్ పై గ్రాండ్ విక్టరీ
నేపాల్ జట్టుపై 78-40 పాయింట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది మహిళల టీమ్ ఇండియా జట్టు. చేజింగ్ అలాగే డిఫెన్స్ లో మన ఇండియన్ అమ్మాయిలు పై చేయి సాధించారు. దీంతో మహిళల ఖో ఖో వరల్డ్ కప్ ( Kho Kho World Cup ) విజేతగా మహిళల టీమిండియా… నిలిచి చాంపియన్ అయింది. ఈ సారి జరిగిన టోర్నమెంట్ లో ఏకంగా 23 జట్లు తొలిసారిగా పాల్గొన్నాయి. భారతదేశ ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్ ఇవాళ న్యూఢిల్లీలో జరిగింది.
న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో ( Indira Gandhi Indoor Stadium )… మహిళల టీమిండియా ( Team India) వర్సెస్ నేపాల్ ( Nepal ) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ రెండు జట్లు ఫైనల్ బరిలో తలపడ్డాయి. అయితే మొదటి నుంచి నేపాల్ మహిళల జట్టుపై టీమిండియా మహిళల జట్టు ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. ఎక్కడ కూడా ప్రత్యర్థి నేపాల్ మహిళల జట్టుకు చాన్స్ ఇవ్వలేదు మన మహిళలు. ఈ మ్యాచ్ మొదటి రౌండ్ లో టీమిండియా దుకుడుగా ఆడింది. దీంతో 34-0 తేడా ఆదిత్యాన్ని సంపాదించింది టీమిండియా. అయితే రెండవ రౌండ్ లో మాత్రం నేపాల్ జట్టు పుంజుకుంది. దీంతో 35-24 తేడాతో… రెండో రౌండ్ ముగిసింది.
Also Read: Abhinav Manohar: SRH చేతిలో మరో డేంజర్ ఆల్ రౌండర్.. క్యావ్యాపాప ప్లాన్ అదుర్స్ !
మళ్లీ మూడో రౌండ్ వచ్చేసరికి టీమిండియా మరోసారి దూకుడు పెంచింది. ఈ తరుణంలోనే పాయింట్ల పట్టికలో ఆదిత్యాన్ని 49కి పెంచుకుంది. దీంతో చివరికి 38 పాయింట్లు తేడాతో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టి ఛాంపియన్ గా నిలిచింది. దీంతో నేపాల్ జట్టు రన్నరప్ గా నిలవడం జరిగింది. ఇక తొలిసారి మహిళల జట్టు మహిళల ఖో ఖో వరల్డ్ కప్ ( Kho Kho World Cup ) గెలవడం పట్ల… భారత అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు భారత ప్రభుత్వం కూడా మహిళల జట్టును అభినందించింది. ప్రధాని నరేంద్ర మోడీ ( PM Modi ) కూడా… మహిళల జట్టు ఛాంపియన్ గా నిలవడం పట్ల ఆస్పందించారు. భారతదేశ గౌరవాన్ని కాపాడారని ఆయన కొనియాడారు.
History created!
Kudos👏🏻 to our Women’s Kho Kho team on defeating Nepal🇳🇵 and claiming the inaugural Kho Kho World Cup title.
Hats off🫡 to you champions!
Pic credit: @Kkwcindia#KhoKho #TheWorldGoesKho #KhoKhoWorldCup #Sports pic.twitter.com/4dKkUz1TwJ
— SAI Media (@Media_SAI) January 19, 2025