BigTV English

IND Women VS NEP Women : సెమీస్ కి వెళ్లిన అమ్మాయిలు: నేపాల్ పై ఘన విజయం

IND Women VS NEP Women : సెమీస్ కి వెళ్లిన అమ్మాయిలు: నేపాల్ పై ఘన విజయం

India women vs Nepal women match(Sports news today): మహిళల ఆసియా కప్‌లో భాగంగా.. భారత క్రికెట్ అమ్మాయిలు వరుసగా హ్యాట్రిక్ విజయాలు నమోదు చేశారు. శ్రీలంకలోని రణ్‌గిరి డంబులా ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా నేపాల్ తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించి సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది.


టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో నేపాల్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 96 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 82 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.

వివరాల్లోకి వెళితే మొదట బ్యాటింగ్ కి వచ్చిన భారత ఓపెనర్లు ఇద్దరూ అదరగొట్టారు. ఫఫాలీ వర్మ అద్భుతమైన ఫామ్ లో ఉండటంతో బ్రహ్మాండంగా ఆడటం భారత్ కి కలిసివస్తోంది. తను 48 బంతుల్లో 1 సిక్స్, 12 ఫోర్ల సాయంతో 81 పరుగులు చేసింది. మరో ఓపెనర్ దయాలన్ హేమలత (47) చేసింది. ఇద్దరూ మొదటి వికెట్ కి 122 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.


Also Read : పాక్-భారత్ టీ 20 సిరీస్.. అంతా ఉత్తుత్తిదే: పీసీబీ

తర్వాత వచ్చిన సంజీవ్ సజనా (10) త్వరగా అవుట్ అయిపోయింది. రొడ్రిగ్యూస్ (28), రిచా ఘోష్ (6) ఇద్దరూ నాటౌట్ గా నిలిచారు. మొత్తానికి 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి భారత్ 178 పరుగులు చేసింది. నేపాల్ బౌలింగులో కబితా 1, సితా రాణా మగర్ 2 వికెట్లు పడగొట్టారు.

179 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన నేపాల్ ఏ దశలోనూ పోరాట పటిమ చూపించలేదు. ఏదో మ్యాచ్ ప్రాక్టీస్ అన్నట్టు మనవాళ్లతో 20 ఓవర్లు నెమ్మదిగా ఆడారు. డిఫెన్స్ ఆడుతూ 9 వికెట్ల నష్టానికి 20 ఓవర్లలో 96 పరుగులు చేశారు. నలుగురు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. కెప్టెన్ ఇందూ బర్మ (14), రుబినా ఛెత్రి (15), బిందు రావల్ (17), సితా రాణా మగర్ (18) చేశారు. మిగిలిన వాళ్లు పదిలోపు అవుట్ అయిపోయారు.

భారత బౌలింగులో రేణుకా సింగ్ 1, అరుంధతి రెడ్డి 2, దీప్తీ శర్మ 3, రాధాయాదవ్ 2 వికెట్లు పడగొట్టారు.

Related News

Kohli-Rohith : కోహ్లీ, రోహిత్ శర్మను ఆడొద్దని అనే హక్కు ఎవడికీ లేదు.. ఇదే శాసనం

Asia Cup 2025 : ఆసియా కప్ కోసం రంగంలోకి మరో ఇద్దరు వికెట్ కీపర్లు.. ఇక దుబాయ్ లో దబిడ దిబిడే !

ASIA CUP 2025 : 5 రోజుల్లోనే ప్రారంభం కానున్న ఆసియా కప్.. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ పోస్టర్ రిలీజ్.. టోర్నమెంట్ షెడ్యూల్ ఇదే.. ఉచితంగా ఎలా చూడాలి

BCCI President : బీసీసీఐ ప్రెసిడెంట్ గా టీమిండియా మాజీ క్రికెటర్..?

Amit Mishra Retirement : 3 హ్యాట్రిక్ తీసిన‌ అమిత్ మిశ్రా రిటైర్మెంట్.. 42 ఏళ్ల వయసులో ఛాన్సులు రాక షాకింగ్ నిర్ణయం

Shikhar Dhavan : క్రికెట‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ కి ఈడీ స‌మ‌న్లు.. మ‌రికొద్ది సేప‌ట్లో విచార‌ణ‌

Big Stories

×