Two die after bike rams bus: హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చందనగర్‌లో ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు.
రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాదంలో చనిపోయిన వారు చందానగర్ వాసులుగా గుర్తించారు. మృతులు మనోజ్, రాజులు అని పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
చందానగర్ కు చెందిన గొలుసు మనోజ్(23), చిట్టిమల్ల రాజు(26) ఇద్దరూ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ పై వెళ్తున్నారు. అయితే చందానగర్ జీఎస్ఎం మాల్ సమీపంలో యూటర్న్ దగ్గర రాంగ్ రూట్‌లో వెళ్తూ.. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టారు.
బైక్ నడుపుతున్న మనోజ్ తోపాటు రాజు ఇద్దరు ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. ఇద్దరి మృతితో కుటుంబ సభ్యులు బోరున విలపించారు.