IND vs ENG: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఐదవ టి20 మ్యాచ్ లో… సూర్య కుమార్ సేన గ్రాండ్ విక్టరీ కొట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా… భారీ స్కోరు చేసి… బౌలింగ్ లో కూడా అదరగొట్టింది. దీంతో… భారీ పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది టీమిండియా. ఈ చివరి t20 మ్యాచ్ లో ఏకంగా 150 పరుగులు తేడాతో… టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది.
Also Read: Abhishek Sharma: 37 బంతుల్లో అభిషేక్ శర్మ సెంచరీ… రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ !
టీమిండియా బౌలర్లు అద్భుతంగా రాణించడంతో…. ఇంగ్లాండ్ ప్లేయర్లు విలవిలలాడిపోయారు. దీంతో చేజింగ్ చేసే క్రమంలో… 97 పరుగులకు ఇంగ్లాండ్ ఆల్ అవుట్ అయింది. 10.3 ఓవర్లలో… 97 పరుగులకు ఆల్ అవుట్ అయింది ఇంగ్లాండ్ జట్టు. ఈ తరుణంలోనే 150 పరుగులు తేడాతో… విజయం సాధించింది టీమ్ ఇండియా. ఈ విజయంతో 4-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది టీమిండియా.
ఈ మ్యాచ్ లో… టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ఇంగ్లాండుకు… ఎక్కడ కూడా పాజిటివిటీ చోటు చేసుకోలేదు. దీంతో… ఓడిపోవడం జరిగింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా… నిర్ణీత 20 ఓవర్లలో… 9 వికెట్లు నష్టపోయి 247 పరుగులు చేసింది. ఇందులో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ 54 బంతుల్లో 135 పరుగులు చేశాడు. ఇందులో 13 సిక్సర్లు ఉంటే… 7 ఫోర్లు ఉన్నాయి. అంతేకాదు ఈ మ్యాచ్ లో 250 స్ట్రైక్ రేటుతో… దుమ్ము లేపాడు అభిషేక్ శర్మ.
అలాగే ఈ మ్యాచ్ లో 13 సిక్స్ లు… రోహిత్ శర్మ రికార్డు బద్దలు కొట్టాడు. ఒక ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ పది సిక్సర్లు కొడితే… అభిషేక్ శర్మ ఇవాల్టి మ్యాచ్ లో 13 సిక్సర్లు కొట్టాడు. ఇక.. అభిషేక్ శర్మ తర్వాత తిలక్ వర్మ 24 పరుగులు చేయగా… శివం దుబే 30 పరుగులు చేశాడు. ఇక మిగతా ప్లేయర్లు ఎవరు కూడా పెద్దగా రాణించలేదు. దీంతో నిర్ణిత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 247 పరుగులు చేసింది టీమిండియా.
Also Read: South Africa In T20 World Cup: దరిద్రం అంటే ఇదే… నాలుగు సార్లు ఫైనల్లో ఓడిన సౌత్ ఆఫ్రికా?
అనంతరం చేజింగ్ కు దిగిన… 10 ఓవర్లకే చాప చుట్టేసింది. 10.3 ఓవర్లలో 97 పరుగులకు అలౌట్ అయింది ఇంగ్లాండ్ జట్టు. ఇంగ్లాండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఒక్కడే 55 పరుగులు చేసి రాణించాడు. ఈ మ్యాచ్లో ఇద్దరు డక్ అవుట్ అయ్యారు. బ్యాటింగ్లో మెరిసిన అభిషేక్ శర్మ.. బౌలింగ్ లో కూడా అదరగొట్టాడు. ఒక్క ఓవర్ వేసిన అభిషేక్ శర్మ… మూడు పరుగులు ఇచ్చి రెండు వికెట్ పడగొట్టాడు. అలాగే మహమ్మద్ షమీ… ఈ మ్యాచ్ లో మూడు వికెట్లు తీసి రీఎంట్రీ లోను అదరగొట్టాడు. వరుణ్ చక్రవర్తి కూడా ఈ మ్యాచ్ లో రెండు వికెట్లు తీశాడు. అటు శివం దుబే రెండు వికెట్లు తీయగా రవి బిస్నోయి ఒక వికెట్ పడగొట్టాడు. ఈ విజయంతో 4-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది భారత్. ఇక అల్ రౌండ్ ఆటతీరుతో రాణించిన అభిషేక్ కు మాన్ అఫ్ ది మ్యాచ్ వచ్చింది.