BigTV English

Elephant Attacks on Woman: ఏనుగుతో ఫోటో దిగాలనుకో.. రిస్కైన పర్లేదు.. కానీ దాంతో ఆటలాడితే.. ఇలాగే ఉంటుంది

Elephant Attacks on Woman: ఏనుగుతో ఫోటో దిగాలనుకో.. రిస్కైన పర్లేదు.. కానీ దాంతో ఆటలాడితే.. ఇలాగే ఉంటుంది

Elephant


Elephant Attacks on Woman Video Viral: ఏనుగులు చూడటానికి చాలా పెద్దవిగా, బలంగా ఉంటాయి. ఇవి కనపడితేనే మనం వెనుకా ముందు ఆలోచించకుండా పరుగులు తీస్తాము. ఎందుకంటే ఏనుగులు కంటపడితే వెంటాడి మరీ తొక్కి చంపేస్తాయి. ఇటువంటి ఘటనలు ఎన్నో లేకపోలేదు. అటువంటి ఏనుగును ఓ మహిళ డిస్టర్బ్ చేసింది. అది కూడా ప్రశాంతంగా తింటున్న సమయంలో దాని దగ్గరకి వెళ్లింది. తర్వాత ఏం జరిగిందో చూడండి.

అమ్మాయి ఏనుగును డిస్టర్బ్ చేసిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాన్ అథెంటిక్ అనే ఎక్స్ ఖాతా నుంచి ఈ వీడియో అప్లోడ్ అయింది. వీడియోను గనుక చూసినట్లయితే.. అమ్మాయి హెల్మెంట్ ధరించి ఉంది. అంటే ఆమె బైక్‌పై వెళ్తుంది. ఆ సందర్భంలో ఆమెకి ఏనుగు కనిపించినట్లుగా ఉంది.


ఏనుగు చూడగానే ఎవరైనా పారిపోతారు. ఎందుకంటే అదెక్కడ మన ప్రాణాలు తీస్తుందనే భయం. కానీ ఈ అమ్మాయి మాత్రం ఏగును దగ్గరకు వెళ్లింది. అప్పుడు ఏనుగు ఏదో గడ్డిలాంటిది తింటూ ఉంది. అమ్మాయి దాని దగ్గరకు వెళ్తున్నప్పుడు ఏనుగు గురించి చెబుతూ ఉంది.

Read More: ఈ వీడియో చూస్తే.. కన్నీరు ఆగదు భయ్యా..!

అంతేకాకుండా ఆమె తలకు ఉన్న హెల్మెట్ కూడా తీసేంది. చాలా దగ్గరకు వెళ్లగానే పక్కన దారిలో మరో ఏనుగు కూడా ఉంది. రెండు ఏనుగులను చూసిన ఆనందం ఆమె ముఖంలో కనిపిస్తుంది. ఈ సంఘటన మొత్తాన్ని ఫోన్‌లో షూట్ చేస్తున్నారు. అయితే ఆ అమ్మాయి ఏనుగు దగ్గరకు వెళ్లి నుంచుంది.

దీంతో ఏనుగు ఆమెపై ఒక్కసారిగా దాడి చేసింది. తొండంతో అమ్మాయిని బలంగా ఢీకొట్టింది. వెంటనే పైకిలేచి దేవుడా ప్రాణాలతో బయటపడ్డాను అన్నట్లుగా అమ్మాయి పరుగులు తీసింది.

ఈ వీడియో ఫిబ్రవరి 22 2024న ఎక్స్‌లో అప్లోడ్ చేశారు. 24.2 మిలియన్ వ్యూస్‌తో వీడియో సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. 89.3 వేల లైకులు ఉన్నాయి. నెటిజన్లు కూడా ఈ ఘటనపై భిన్నంగా స్పందిస్తున్నారు.

Read More: ఇదేందయ్యా ఇది.. నేను ఎప్పుడూ చూడలే..!

అమ్మాయి అదృష్టవశాత్తూ బ్రతికిపోయావ్ అని కొందరు అంటున్నారు. ఏనుగు దగ్గరకు వెళ్లావంటే నీకు చాలా ధైర్యం ఉందని మరికొందరు అంటున్నారు. తినేటప్పుడు ఎవరిని కదిలించ కూడదని హితవు పలుకుతున్నారు. త్వరగా ఆసత్రికి వెళ్లి చూపించుకో.. పాపా అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

Tags

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×