Bigg Boss 10 Wild Card: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కార్యక్రమం ఎంతో విజయవంతంగా ప్రసారమవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇలా ఈ కార్యక్రమం 5 వారాలను పూర్తి చేసుకుంటూ ఐదుగురు కంటెస్టెంట్లను హౌస్ నుంచి బయటకు పంపించిన సంగతి తెలిసిందే. ఇక ఈవారం అపూర్వ హౌస్ నుంచి బయటకు వచ్చేసారు. ఇక ఐదవ వారంలో భాగంగా వైల్డ్ కార్డు ద్వారా మరి కొంత మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి అడుగు పెట్టబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్లకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు వినిపించాయి.
ఇక నేడు ఈ కార్యక్రమంలో భాగంగా నాగార్జున ఒక్కొక్క వైల్డ్ కార్డు ఎంట్రీని హౌస్ లోకి పంపించారు ఇందులో భాగంగానే మొట్టమొదటి వైల్డ్ కార్డు ఎంట్రీగా ప్రముఖ బుల్లితెర నటుడు శివకుమార్ (Shiva Kumar)హౌస్ లోకి అడుగుపెట్టారు. మౌనరాగం సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు నటుడిగా పరిచయమైన శివకుమార్ పలు సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇలా బుల్లితెర నటుడిగా ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న శివకుమార్ వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టారు.
బిగ్ బాస్ వేదిక పైకి శివకుమార్ ఎంతో గ్రాండ్ ఎంట్రీ ఇస్తూ నాగార్జునతో సరదాగా ముచ్చటించారు. ఇక వీళ్లిద్దరి మధ్య ప్రియాంక జైన్(Priyanka Jain) సంభాషణ కూడా వచ్చింది. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టకముందే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ ల గురించి శివకుమార్ మాట్లాడుతూ సరైన ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేదని కంటెస్టెంట్ లు గ్రూపులుగా మారి గేమ్స్ ఆడుతున్నారంటూ ఈయన తెలిపారు. ఇక శాలిని గురించి మాట్లాడుతూ ఆమె బిగ్ బాస్ కప్పు కొట్టడానికి కాకుండా రోహిత్ కోసమే హౌస్ లోకి వచ్చారు అంటూ శివకుమార్ మాట్లాడారు. మరి మొదటి వైల్డ్ కార్డు ఎంట్రీగా హౌస్ లోకి అడుగుపెట్టిన శివకుమార్ తన ఆటతీరుతో ప్రేక్షకులను ఎలా ఎంటర్టైన్ చేస్తారు అనేది తెలియాల్సి ఉంది.
ఇక టాస్కుల పరంగా శివకుమార్ అద్భుతంగా ఆడుతారనే విషయాన్ని మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో ద్వారా అందరికీ తెలిసిపోయింది. మరి బిగ్ బాస్ రియాలిటీ షోలో శివకుమార్ ఎలాంటి గుర్తింపు సంపాదించుకుంటారనేది తెలియాల్సి ఉంది. ఇక ఈయన మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ ప్రియుడనే విషయం తెలిసిందే. అయితే బిగ్ బాస్ కార్యక్రమంలోకి వచ్చేముందు ప్రియాంక ఏవైనా సలహాలు ఇచ్చిందా అంటూ నాగార్జున అడగడంతో హౌస్ లో తాను ఎప్పుడు ఎలా ఉంటానో అలాగే ఉండమని తనుకు సలహా ఇచ్చిందని శివకుమార్ తెలిపారు. మరి వైల్డ్ ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన శివ కుమార్ కప్పు తీసుకొని బయటకు వస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
Also Read: బూతులు మాట్లాడకపోతే నీతిమంతులా… అపూర్వ పై శివాజీ ఫైర్!