Jasprit Bumrah: పెద్దగా అనుభవం లేని యువ జట్టుతో అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన భారత టెస్ట్ క్రికెట్ జట్టు అద్భుతమైన ఫలితాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఐదు టెస్టుల సిరీస్ ని 2 – 2 తో సమం చేసింది టీమిండియా. అయితే అయిదవ టెస్ట్ కి ముందు భారత జట్టుకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా చివరి టేస్ట్ కి ముందు జట్టు నుంచి నిష్క్రమించాడు.
Also Read: Champagne Bottle: టెస్టుల్లో ఈ బ్లాక్ కలర్ వైన్ బాటిల్ ఎందుకు ఇస్తారో తెలుసా ?
జూలై 31 నుండి ఓవల్ వేదికగా జరిగిన టెస్ట్ కి ముందు బుమ్రా ని జట్టు నుంచి తప్పిస్తున్నట్లు ప్రకటించింది బీసీసీఐ. ఇందుకు కారణం వర్క్ లోడ్ మేనేజ్మెంట్ అని బోర్డు పేర్కొంది. అయితే నిర్ణయాత్మక మ్యాచ్ లో జట్టుకు అతని అనుభవం అవసరం ఉందని చాలామంది క్రీడా నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే.. బుమ్రా లేకపోయినా భారత ఫాస్ట్ బౌలర్లు చివరి టెస్టులో అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు.
మహమ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, ప్రసిద్ద్ కృష్ణ ఇంగ్లాండ్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టి నాలుగవ రోజు చివరి సెషన్ లో మ్యాచ్ ని భారత్ వైపు మళ్ళించారు. ఇక చివరి రోజు ఇంగ్లాండ్ గెలవాలంటే 35 పరుగులు, భారత్ విజయానికి నాలుగు వికెట్లు కావలసిన సమయంలో.. నాలుగు వికెట్లను పడగొట్టి, 6 పరుగుల తేడాతో భారత్ ని విజయతీరాలకు చేర్చారు భారత బౌలర్లు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. ప్రస్తుతం ఓ కొత్త సెంటిమెంట్ సోషల్ మీడియాలో టీమిండియా ఫ్యాన్స్ ని వింత అనుభవానికి గురిచేస్తుంది.
అదేంటంటే.. బూమ్రా టెస్ట్ జట్టులో ఉంటే మన జట్టు గెలవడం కంటే ఓడిపోవడమే ఎక్కువగా జరుగుతుందని సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేస్తున్నారు నెటిజెన్లు. ఇంగ్లాండ్ తో భారత జట్టు గెలిచిన రెండు టెస్ట్ లలో బుమ్రా లేకపోవడమే ఇందుకు కారణం అని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ సిరీస్ లో బుమ్రా ఆడిన 3 టెస్ట్ లలో రెండు మ్యాచ్ లలో భారత్ ఓడిపోగా.. ఒక మ్యాచ్ డ్రా గా ముగిసింది. అతడు ఆడని మరో రెండు మ్యాచ్ లలో భారత్ విజయం సాధించింది. ఇక అంతకు ముందు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా బుమ్రా ఐదు టెస్ట్ మ్యాచ్ లు ఆడితే.. అందులో టీమిండియా కేవలం ఒక మ్యాచ్ లోనే గెలుపొందింది.
Also Read: FOX Spotted: మ్యాచ్ మధ్యలో ఎంట్రీ ఇచ్చిన వింత జంతువు… ఈ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు
వీటిని ఉదాహరణగా తీసుకొని ఇప్పుడు బుమ్రాపై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేస్తున్నారు. మరోవైపు బుమ్రా ఇప్పటివరకు 48 టెస్ట్ మ్యాచ్ లు ఆడితే.. అందులో భారత్ 20 మ్యాచ్ లలో గెలుపొంది, మరో 23 మ్యాచ్ లలో ఓడిపోయింది. ఇక బుమ్రా తన అరంగేట్రం నుండి 28 టెస్ట్ మ్యాచ్ లలో ఆడలేదు. వీటిలో టీమిండియా కేవలం 5 మ్యాచ్ లలో మాత్రమే ఓడిపోయింది. మిగిలిన 20 మ్యాచ్ లలో భారత జట్టు విజయం సాధించగా.. మరో మూడు డ్రా గా ముగిశాయి. దీంతో ఇప్పుడు ఈ లెక్కల ప్రకారం బుమ్రా టీమ్ ఇండియాకి దరిద్రంలా మారాడని కొంతమంది ట్రోలింగ్ చేస్తుంటే.. మరి కొంతమంది మాత్రం భారత పేస్ విభాగానికి అతడు వెన్నెముక లాంటివాడని.. అతడిని ట్రోల్ చేయడం భావ్యం కాదని మండిపడుతున్నారు.
https://www.facebook.com/share/p/1A9m5rLCNi/