Yuvraj Singh: టీమిండియా మాజీ క్రికెటర్, సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్ ( Yuvraj Singh ) గురించి తెలియని వారుండరు. అయితే.. అలాంటి సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటించి… లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే.. సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్ మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా తాజాగా వార్తలు వస్తున్నాయి. 2019లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగిన యువరాజ్ సింగ్ ఆ తర్వాత కొన్ని లీగులలో మాత్రమే పాల్గొన్నాడు. అయితే అభిమానుల కోరిక మేరకు యువరాజు సింగ్ మరోసారి బ్యాట్ పట్టబోతున్నాడు.
Also Read: Bangladesh T20 League: బస్సులోనే క్రికెటర్ల కిట్స్.. తాళమేసిన డ్రైవర్.. ఏంట్రా ఇది!
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ ద్వారా ఈ తరం క్రికెట్ అభిమానులకు యువరాజ్ సింగ్ ( Yuvraj Singh ) బ్యాటింగ్ పవర్ చూసే అవకాశం దక్కుతుంది. ఎందుకంటే యువి గొప్పతనం గురించి చాలామందికి తెలుసు. యువరాజ్ సింగ్ పేరు చెబితే ఎవరికైనా 2007 టి20 ప్రపంచ కప్ తప్పకుండా గుర్తుకువస్తుంది. ఇంగ్లాండ్ పై యువరాజ్ సింగ్ స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఓవర్ లో ఆరు సిక్సర్లు బాది టి20 క్రికెట్ కి ల్యాండ్ మార్క్ సెట్ చేసేశాడు. ఆ ఇన్నింగ్స్ తో యువరాజ్ సింగ్ ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఎంత కోపం ఉన్నా మైదానంలో అస్సలు చూపించకుండా బ్యాట్ తోనే సమాధానం చెప్పే ఆటిట్యూడ్ అంటే ఫ్యాన్స్ కు ఎంతగానో ఇష్టం.
ఈ ఏడాది టీ20 ప్రపంచ కప్ భారత్ గెలవడంలో యువరాజ్ దే కీలక పాత్ర. 2011 వన్డే ప్రపంచ కప్ గెలవడంలోనూ యువరాజ్ కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు యువ రాజ్ ( Yuvraj Singh ) మరోసారి బ్యాట్ పట్టుకొని ఉండడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సోషల్ మీడియా వేదికగా యూవీకి ఘనంగా ఆహ్వానం పలుకుతున్నారు. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ లో భాగంగా ఇండియా మాస్టర్స్ జట్టు తరుపున యువరాజ్ దిగబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ లీగ్ ఫిబ్రవరి 22 నుంచి మార్చి 16 వరకు జరుగుతుంది.
Also Read: Abhishek Sharma: ఇంగ్లండ్ అంటే ఈ పంజాబీలకు అస్సలు పడదు… ఊచకోతనే !
యువరాజ్ సింగ్ తో పాటు దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్మెన్ జె పి డుమిని కూడా ఈ లీగ్ లో పాల్గొంటాడు. అతను దక్షిణాఫ్రికా మాస్టర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తాడు. శ్రీలంక మాజీ బ్యాట్స్మెన్ ఉపుల్ తరంగా కూడా శ్రీలంక మాస్టర్స్ తరఫున ఈ లీగ్ లో కనిపించబోతున్నాడు. ఇండియా మాస్టర్ జట్టులో యువితో పాటు జట్టులో టీమ్ ఇండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా ఉన్నాడు. శ్రీలంకకు చెందిన కుమార్ సంఘక్కర, వెస్టిండీస్ కు చెందిన బ్రియాన్ లారా, దక్షిణాఫ్రికాకు చెందిన జాక్విస్ కల్లిస్, ఇంగ్లాండ్ కు చెందిన ఇయాన్ మోర్గాన్ కూడా ఈ లీగ్ లో పాల్గొంటారు. ఇండియా మాస్టర్స్ 3 వేర్వేరు నగరాలలో జరుగుతోంది. ఈ లీగ్ మ్యాచ్లు నేవీ ముంబై, రాజ్కోట్, మరియు రాయ్ పూర్ లలో జరుగుతాయి.