Inzamam Ul Haq: పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు రోజు రోజుకు హద్దులు మీరు ప్రవర్తిస్తున్నారు. ఇండియన్ క్రికెటర్లను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ను ( Indian Premier League 2026 Tournament) ప్రపంచ వ్యాప్తంగా బ్లేమ్ చేసేలా కుట్రలకు తెర లేపుతున్నారు. అయితే, తాజాగా హిందూ క్రికెటర్లను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇంజమామ్-ఉల్-హక్ ( Inzamam Ul Haq). హిందూ క్రికెటర్ లందరికీ తండ్రి లాంటి వాడు బాబర్ ఆజం ( Babar Azam) అంటూ హాట్ కామెంట్స్ చేశారు. హిందువులలో బాబర్ ఆజం కంటే తోపు ఆటగాళ్లు ఎవరూ లేరంటూ అర్థం వచ్చేలా ఈ వ్యాఖ్యలు చేశారు. బాబర్ ఆజం ముందు టీమిండియా ప్లేయర్లు జూజూబీ అంటూ అవమానించే విధంగా మాట్లాడారు ఇంజమామ్. దీంతో ఇంజమామ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే ఇంజమామ్ చేసిన వ్యాఖ్యలకు ఇండియన్ ఫాన్స్ కూడా కౌంటర్ ఇస్తున్నారు. చేతకాని దద్దమ్మలు అందరూ ఇలాగే మాట్లాడతారని.. దమ్ముంటే బాబర్ మరో సెంచరీ చేసి చూపించాలని కౌంటర్లు పేల్చుతున్నారు.
Also Read: Inzamam-ul-Haq: Inzamam-ul-Haq: 30 బంతుల్లో కోహ్లీ అర్ధ శతకం చేస్తే, బాబర్ మాత్రం సెంచరీ చేస్తాడు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ చాలా రసవత్తరంగా కొనసాగుతున్న నేపథ్యంలో.. ఇండియాకు సంబంధించిన ప్లేయర్ల మనోభావాలు దెబ్బతీసేలా పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు వ్యవహరిస్తున్నారు. ఐపీఎల్ టోర్నమెంట్ అంటేనే ఫిక్సింగ్ ఇస్తున్నారు. అయితే లేటెస్ట్ గా ఇండియన్ క్రికెటర్లను ఉద్దేశించి ఇంజమామ్-ఉల్-హక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియాలోని హిందూ క్రికెటర్లు ఎవరు కూడా పెద్దగా రాణించబోరని.. వీళ్ళందరికీ సరైన మొగుడు బాబర్ ఆజాం అంటూ వ్యాఖ్యానించారు. బాబర్ ఆజం కాలి గోటికి కూడా టీమిండియా హిందూ క్రికెటర్లు పనిచేయబోరని పరువు తీశారు.
ఐపీఎల్ టోర్నమెంటులో ( Indian Premier League Tournament) బౌండరీ గేట్లు చాలా దగ్గరగా ఉంటాయని.. అందుకే ఇండియన్స్ అవలీలగా బౌండరీలు సిక్సర్లు బాదుతారని బాంబు పేల్చారు. ఈ ఇండియన్ క్రికెటర్లు పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్లు ఆడితే, తేలిపోతారని పరువు తీశారు. ఐపీఎల్ లో ఆడే హిందూ క్రికెటర్లు అందరూ బ్యాటలో స్ప్రింగులు, చిప్స్ పెట్టుకొని ఆడతారని కూడా ఆరోపణలు చేశారు. దీనంతటికి కారణం భారత క్రికెట్ నియంత్రణ మండలి అంటూ ఫైర్ అయ్యారు. బీసీసీఐ వెనుకుండి ఈ తతంగం నడిపిస్తుందని బాంబు పేలిచారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంటులో ఆడాలి అనుకునే ఇండియన్స్… ఇస్లాం మతంలోకి మారితేనే తీసుకుంటామని ఈ కండిషన్ పెట్టారు. విరాట్ కోహ్లీ వచ్చినా కూడా మతం మార్చుకోవాల్సిందేనని షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో ఇంజమామ్-ఉల్-హక్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
https://www.facebook.com/photo/?fbid=122222776628289704&set=a.122097672758289704